NNS 26th October Episode: మనోహరి, ఘోరాలను కనిపెట్టేసిన అమర్.. దీక్షలో భాగీ, రామ్మూర్తి.. ఆరు ఆత్మకి విముక్తి!
26 October 2024, 6:00 IST
- NNS 26th October Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం శనివారం (అక్టోబర్ 26) ఎపిసోడలో మనోహరి, ఘోరాలు ఎక్కడున్నారో అమర్ కనిపెట్టేస్తాడు. అయితే అప్పటికే ఆ ఇద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. మరోవైపు భాగీ, రామ్మూర్తి దీక్ష చేస్తుంటారు.
మనోహరి, ఘోరాలను కనిపెట్టేసిన అమర్.. దీక్షలో భాగీ, రామ్మూర్తి.. ఆరు ఆత్మకి విముక్తి!
NNS 26th October Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు (అక్టోబర్ 26) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆరు ఆత్మను బంధించిన ఘోరా పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనోహరి వచ్చి మరి నేను ఎప్పుడు గెలుస్తాను ఘోర అని అడుగుతుంది. ఈ ఘోర మాటిచ్చాడు అంటే సచ్చేదాకా కాస్తునే ఉంటాడు. నీ కష్టాలు తీర్చాకే నా పని మొదలు పెడతాను అంటాడు ఘోర. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది.
ఘోర ఎక్కడున్నాడో తెలుసుకున్న అమర్
అయితే దీనివల్ల నేను కోల్పోయినవి అన్ని దీంతోనే వెనక్కి తెప్పించబోతున్నావన్న మాట. అమర్ తో గడిపిన జీవితం నేను పెట్టిన బిక్షే.. దానికి రుణం తీర్చుకో ఆరు అంటుంది. కానిస్టేబుల్ వచ్చి ఘోర, మనోహరిని చూసి రాథోడ్‌కు ఫోన్ చేస్తాడు. సార్ కానిస్టేబుల్ సార్.. అని రాథోడ్ అనగానే స్పీకర్ ఆన్ చేయ్ అంటాడు అమర్.
సార్ ఓఆర్‌ఆర్ 19 ఎగ్జిట్ దగ్గర మీరు చెప్పినట్టే అతనెవరో ఏవో పూజలు చేస్తున్నారు సార్. పక్కన ఇంకెవరో ఉన్నారు సార్ అని చెబుతాడు కానిస్టేబుల్. అవునా అయితే మేము వస్తున్నాం అంటాడు రాథోడ్. వాళ్లను నువ్వు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండు ఇప్పుడే మేము వస్తున్నాం. కమాన్ రాథోడ్ అని ఇద్దరూ కలిసి వెళ్తారు. కానిస్టేబుల్ వాళ్లను చూస్తూనే ఉంటాడు.
పారిపోయిన ఘోర, మనోహరి
సరే ముందు నువ్వు చెప్పినట్టు భాగీలోకి ఇది ప్రవేశించేలా చేసి అమర్‌కు దూరం అయ్యేలా చేయ్. తర్వాత నా మొగుడి సంగతి చూద్దాం అంటుంది మనోహరి. అలాగే.. పని అవ్వగానే నేను దేవాను కలవడానికి వెళ్లాలి. ఈ శక్తులను నా నుంచి లాక్కోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఆలోగా చాలా శక్తులను శాశ్వతం చేసుకోవాలి అని ఘోర చెప్తాడు.
ఇంతలో అక్కడికి అమర్, రాథోడ్ వస్తారు. కానిస్టేబుల్ ఘోర, మనోహరిలను దూరం నుంచి చూపిస్తాడు. అమర్ ఘోర దగ్గరకు వెళ్తుంటే మనోహరి గమనించి ఘోరాను పారిపోమ్మని చెప్తుంది. ఇద్దరు కలిసి అక్కడి నుంచి పారిపోతారు. అమర్ వచ్చి వెతుకుతుంటాడు. ఎవరూ కనిపించరు.
అమ్మవారి దీక్షలో భాగీ
భాగీ అమ్మవారి దీక్ష మొదలుపెడుతుంది. ఇల్లంతా దూపం వేస్తుంది. పూజ పూర్తి చేసి అందరికీ హారతి ఇస్తుంది. ఈ అవతారం ఏంటి..? ఈ పూజలేంటి..? ఈ పాటలేంటి..? అంటుంది మనోహరి. మనోహరి గారు అవతారం అంటే కళ్లు పోతాయి. నేను అమ్మవారి దీక్ష చేస్తున్నాను అంటుంది భాగీ. పూజ చేస్తాను అంటే నేనేదో మామూలు పూజ అనుకున్నాను కానీ ఇంత పెద్ద దీక్ష చేస్తున్నావు అనుకోలేదు అంటుంది నిర్మల.
అయినా ఇంత సడెన్ గా దీక్ష ఏంటమ్మా..? అంటాడు శివరామ్. నేను, నాన్నా మనసుకు ఎప్పుడు కష్టంగా అనిపించినా అమ్మవారికి దీక్ష చేసి కోరిక కోరుకోగానే కష్టాలన్నీ అమ్మవారే తీరుస్తారని మేము నమ్ముతాము. నాన్నకే కాదు.. నాక్కూడా రెండు రోజుల నుంచి మనసంతా అలజడిగా ఉంది. అందుకే దీక్ష చేపట్టాలని అనుకున్నాం. మీకు ఇబ్బంది అవుతుందని చెప్పలేదు అంటుంది భాగీ. నీ పూజ మాకు ఇబ్బంది అవ్వడం ఏంటి మిస్సమ్మ.. దీక్ష అంటే చాలా పాటించాలి కదా..? నీకే కష్టంగా అనిపిస్తుందేమోనని ఆలోచిస్తున్నాం అంటాడు అమర్.
ఘోరాకు విషయం చెప్పిన మనోహరి
ఎందుకు అంత బాధపడుతున్నావు మిస్సమ్మ. మాకు ఎవరికైనా చెప్పుకోవచ్చు కదా? అంటుంది అమ్ము. కారణం తెలిస్తేనే కదా అమ్ము పంచుకోవడానికి. ఇది కారణం లేని బాధ మనసు మోయలేకపోతుంది. కనీసం ఈ దీక్ష వల్ల పోతుందని నమ్మకం అంటుంది భాగీ. నాకు ముందే చెప్పి ఉంటే నేను సాయం చేసేదాన్ని కదమ్మా.. అంటుంది నిర్మల. పర్వాలేదులే అత్తయ్యా… పిల్లలు మీరు వెళ్లి రెడీ అయి రండి మీకు టిఫిన్ రెడీ చేస్తాను అని భాగీ చెప్పగానే అందరూ వెళ్లిపోతారు.
మనోహరి మాత్రం ఈ విషయం వెంటనే ఘోరాకు చెప్పాలి అనుకుంటుంది. మరోవైపు రామ్మూర్తి కూడా దీక్ష చేస్తుంటాడు. మంగళ చూసి దీక్ష చేస్తున్నావేంటి అని అడుగుతుంది. నా పెద్ద కూతురు కోసం దీక్ష చేస్తున్నాను అంటాడు. దీంతో మంగళ తిడుతుంది. నాకు చెప్పకుండా చేస్తున్నావేంటి అని నిలదీస్తుంది.
నేను నా కూతురు ఇంట్లో దీక్ష చేస్తున్నాను అని వెళ్లిపోతాడు. మనోహరి, ఘోర దగ్గరకు వెళ్లి భాగీ దీక్ష చేస్తుందని చెప్తుంది. దాన్ని ఇంట్లోంచి పంపించేయాలి అంటుంది. ఘోరా మనోహరికి సాయం చేస్తాడా? భాగీ దీక్షతో ఆరు ఆత్మకి విముక్తి లభిస్తుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్ 26న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్