NNS 23rd October Episode: సీసీటీవీ ఫుటేజీతో మనోహరి నిజస్వరూపం బయటపెట్టిన రాథోడ్​.. షాక్​లో అమర్​ కుటుంబం​​​​!-zee telugu serial nindu noorella saavasam today 23rd october episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 23rd October Episode: సీసీటీవీ ఫుటేజీతో మనోహరి నిజస్వరూపం బయటపెట్టిన రాథోడ్​.. షాక్​లో అమర్​ కుటుంబం​​​​!

NNS 23rd October Episode: సీసీటీవీ ఫుటేజీతో మనోహరి నిజస్వరూపం బయటపెట్టిన రాథోడ్​.. షాక్​లో అమర్​ కుటుంబం​​​​!

Hari Prasad S HT Telugu

NNS 23rdOctober Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (అక్టోబర్ 23) ఎపిసోడ్లో సీసీటీవీ ఫుటేజ్ తో మనోహరి నిజస్వరూపాన్ని రాథోడ్ బయటపెడతాడు. అది చూసి అమర్ కుటుంబం షాక్ తింటుంది.

సీసీటీవీ ఫుటేజీతో మనోహరి నిజస్వరూపం బయటపెట్టిన రాథోడ్​.. షాక్​లో అమర్​ కుటుంబం​​​​!

NNS 23rd October Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (అక్టోబర్ 23) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రామ్మూర్తి మళ్లీ వాచ్​మెన్​గా గేట్​ దగ్గర కనిపించడంతో ఏంటి తాతయ్య అని అడుగుతారు పిల్లలు. తాను అక్కడ జాబ్​ చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పొద్దంటాడు రామ్మూర్తి. తాతయ్యా మీరు జాబ్‌ చేస్తేనే హ్యాపీగా ఉంటానంటే ఓకే అంటారు పిల్లలు.

రామ్మూర్తితో కలిసి క్యారేజీలు కడిగిన పిల్లలు

అందరూ కలిసి భోజనం చేస్తుంటే.. ప్రిన్సిపాల్‌ వచ్చి రామ్మూర్తిని పిలిచి క్యారేజ్‌ లు కడిగి తీసుకురా అని చెప్తుంది. రామ్మూర్తి వెళ్లి వాటిని కడుతుంటాడు. పిల్లలు చూసి బాధపడతారు. తినకుండా రామ్మూర్తి కోసం ఎదరుచూసి.. వెళ్లి చూస్తారు. మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు అని ప్రిన్సిపాల్‌తో మాట్లాడదామని వెళ్తుంటే ఈ పనులు నేను చేస్తానని చెప్పాను అంటాడు రామ్మూర్తి. అయితే ఈ పని మేము చేస్తాము మీరు జరగండి తాతయ్యా అని పిల్లలు ఆ పని చేస్తారు.

ఘోరతో గుప్త వాగ్వాదం

ఘోర పూజలు చేస్తుంటాడు. అక్కడికి గుప్త వస్తాడు. సీసాలో బంధీగా ఉన్న ఆరును చూసి బాధపడతాడు. బాలికా ఆ ఇంట మహరాణిలా ఉన్న నిన్ను ఇక్కడ బంధీగా చూడలేకపోతున్నాను అంటాడు.

ఎవరు..? ఎవరు మీరు.. ఓ గుప్తుల వారా? ఎలా ఉన్నారు.. అంటాడు ఘోర. మాతో పరిహాసం ఆడుటా.. నీకు శ్రేయస్కరం కాదు అంటాడు గుప్త. అయ్యో నేను మీ పని తగ్గించాను కదా గుప్త గారు. మీరిప్పుడు ఎంచక్కా యమపురికి వెళ్లిపోవచ్చు. ఇక వెంటనే వెళ్లిపోండి అంటున్న ఘోరాతో భూలోకము నుంచి నేను మా లోకమునకు వెళ్లుట జరుగునది ఆ బాలికతోనే.. అంటాడు గుప్త.

అయితే మీరిక మాతో పాటు ఈ భూలోకమునే ఉంటారన్నమాట అంటాడు ఘోర. తప్పిదముల మీద తప్పిదములు చేయుచున్నావు ఘోర. ఇక చాలింపుము ఇకనైనను నీవు పొందిన శక్తులను సరియైన మార్గమున వినియోగించుము. నీవు చేసిన పాపములు కొన్ని అయినా హరించును అంటాడు గుప్త.

అయ్యా గుప్త గారు ఈ పూజలు చేస్తున్నదే చావకుండా చిరంజీవిగా ఉండుట కొరకే మరి నేను ఎందుకు నరకానికి వస్తాను అంటాడు ఘోర. సృష్టి ధర్మమునకు ఎదురెళ్లుతున్నావు ఘోర అంటాడు గుప్త. తపస్సుతోనే రానిది నీ లాంటి తప్పిదాలు చేసేవాళ్లకు ఎలా వస్తుందనుకున్నావు అనగానే కొత్త చరిత్రను నేను మొదలు పెట్టబోతున్నాను ఇక మీరు వెళ్లిపోవచ్చు అంటాడు ఘోర. గుప్త వెళ్లిపోతాడు.

సీసీటీవీ ఫుటేజీ చూపించిన రామ్మూర్తి

రాథోడ్‌ లాప్‌ టాప్‌ తీసుకుని కంగారుగా ఇంటికి వచ్చి అమర్‌ ను పిలుస్తుంటాడు. రాథోడ్‌ ఏమైంది.. అని అమర్​ అనగానే సార్‌ ఇది చూడండి.. అంటూ లాప్​టాప్​ ఓపెన్​ చేస్తాడు. వీడేంటి నన్ను ఇలా చూస్తున్నాడు. నేను భాగీతో మాట్లాడింది ఏమైనా చూశాడా? అని మనసులో అనుకుంటుంది మనోహరి.

లాప్‌టాప్ లో సీసీటీవీ ఫుటేజీ చూపిస్తాడు రాథోడ్​. అందులో ఘోర ఇంటికి రావడం ఉంటుంది. మనోహరి రూంలోకి వెళ్లింది కూడా వీడియోలో ఉంటుంది. అదేంటి అమర్‌ అతను నా కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి ఏం చేస్తున్నాడు అని ఏం తెలియనట్లు అడుగుతుంది మనోహరి.

అప్పుడు మీరు రూంలో లేరా మనోహరి గారు. చూస్తుంటే మిమ్మల్ని కలవడానికే వచ్చినట్టు ఉంది అంటుంది భాగీ. ఏయ్‌ నాకు వాడితో ఏం పని ఉంటుంది. నేను అప్పుడు రూంలోనే లేను. లేదంటే వాణ్ని చూసిన వెంటనే అమర్‌కు చెప్పి వాడి అంతు చూసేవాళ్లం కదా? అంటుంది మనోహరి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడు అంటాడు అమర్. సార్‌ బ్యాక్‌ సైడ్‌కు వెళ్లినట్టు ఉన్నాడు సార్‌ అక్కడ వెనక ఉన్న కెమెరా పని చేయలేదు అంటాడు రాథోడ్​.

వాడు చాలా సేపటి వరకు తిరిగి రాలేదంటే వాడు అంత సేపు మన ఇంట్లోనే ఉన్నాడు అంటాడు అమర్​. వాణ్ని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది నాన్నా. ఇలాంటి వాళ్ల కళ్లు మన ఇంటి మీద పడకూడదు అని నిర్మల అనగానే.. అమ్ము చెప్పింది… మనోహరి రూం లాక్‌ చేసుకున్నది గుర్తు చేసుకుంటుంది భాగీ. ఇంతలో అమర్‌ ఆ బ్యాక్‌ డోర్‌ నీ రూంకి దగ్గరే ఉంటుంది కదా? నీకు అలికిడి వినిపించలేదా? అని అడగ్గానే లేదని భయపడుతూ చెప్తుంది మనోహరి.

వాడు నిన్ను కలవడానికే వచ్చాడని నాకు అనుమానంగా ఉంది మనోహరి అని మనసులో అనుకుంటుంది భాగీ. ఇంతలో ఘోర సీసాలో ఆరు ఆత్మను తీసుకెళ్లడం సీసీటీవీ పుటేజీలో కనిపిస్తుంది. వాణ్ని పట్టుకుని తంతే అసలు నిజం తెలుస్తుందని అమర్‌ అంటాడు.

రామ్మూర్తి వీడియో తీసిన అంజు

ప్రిన్సిపాల్ రామ్మూర్తిని పిలిచి కారు తుడవలేదని తిడుతుంది. పిల్లలు దూరం నుంచి గమనిస్తారు. రామ్మూర్తి చేత కారు క్లీన్‌ చేయిస్తుంది. అంజు ఫోన్‌ తీసుకొచ్చి వీడియో తీస్తుంది. వీడియోతో అంజు ఏం చేయబోతోంది? ఘోరా మనోహరిని కలవడానికే వచ్చాడని అమర్​కి తెలిసిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్​ 23న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!