Nindu Noorella Saavasam Today Episode: భాగీకి అరుంధతి ఫొటో చూపించిన మనోహరి.. ఆరు ఆత్మపై జాలిపడ్డ ఘోరా.. కోప్పడిన అమర్
Nindu Noorella Saavasam October 22nd Episode: నిండు నూరేళ్ల సావాసం అక్టోబర్ 22 ఎపిసోడ్‌లో పిల్లల దగ్గరి నుంచి అరుంధతి ఫొటో చూడాలని ప్రయత్నిస్తుంది భాగీ. కానీ, అది కుదరదు. అంతలోనే మనోహరి ద్వారా వచ్చిన అమర్ కోప్పడుతాడు. ఆరు ఫొటో గురించి భాగీ అడిగితే మనోహరి చూపిస్తుంది.
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం టుడే ఎపిసోడ్ (NNS 22nd October Episode)లో అరుంధతి ఫొటో చూద్దామని భాగీ పిల్లల రూమ్‌కి వెళ్తుంది. అయితే, పిల్లలు ముగ్గురు పడుకుని ఉంటారు. అమ్ము ఒక్కతే మెలుకువగా ఉంటుంది. అంజు పడుకుందా? అనగానే అవునంటుంది అమ్ము.
బాధపెట్టడం కరెక్టేనా
మరి అరుంధతి అక్క ఫోటో అని అడగ్గానే అంజు పట్టుకునే పడుకుందని చెప్తుంది అమ్ము. నాది అనుమానమో కాదో తెలుసుకుంటే ఆ గిఫ్ట్ ఇచ్చింది అరుంధతి అక్కనో కాదో తెలుస్తుంది అని మనసులో అనుకుని అమ్మును కూడా పడుకోమని చెప్తుంది భాగీ. దాంతో అమ్ము పడుకుంటుంది. అమర్ రూమ్‌లోకి వెళ్లిన మనోహరి పిల్లలకి అరుంధతి ఫోటో ఇచ్చి బాధపెట్టడం కరెక్టేనా అని అడుగుతుంది.
ఫోటో ఎవరిచ్చారు అని అడిగి హల్లోకి వెళ్తాడు అమర్. అమ్మా నాన్నా ఆరు ఫోటో మీరు పిల్లలకు ఇచ్చారా? అంటాడు. అది అంజు బాధపడుతుంటే కొంచెం.. అని శివరామ్ అనగానే కొంచెం కాదు నాన్నా.. చాలా బాధపడతారు. రాత్రంతా ఏడుస్తుంటారు. హెల్త్ పాడు చేసుకుంటారు. అందుకే అరుంధతి ఫోటోను నేను వాళ్లకు ఇవ్వలేదు. ఒక్కమాట నాకు చెప్పి ఉండాలి అంటూ అమర్ పైకి వెళ్తాడు.
పైన పిల్లల దగ్గర మెలుకువగా ఉన్న భాగీ అంజు దగ్గర ఫోటో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. బయట గుప్తా ఉలిక్కి పడి లేస్తాడు. బాలిక చిత్రపటమును ఇప్పుడు మిస్సమ్మ చూసినచో బాలిక ఉనికి అందరికీ తెలియును. అటు పిమ్మట బాలికకు ఇప్పుడు పొంచి ఉన్న ప్రమాదం కంటే ఎక్కువ ప్రమాదం గోచరించు సూచనలు కనిపిస్తున్నాయి. ఏమీ చేయవలే.. అని ఇంట్లో కరెంట్ పోయేటట్లు చేస్తాడు గుప్త.
పిల్లలు ఏడ్వడానికా
ఇంతలో అమర్ వచ్చి భాగీని రూమ్‌లోంచి బయటకు లాకొస్తాడు. భాగీ చేతిలో ఫోటో లాగేసుకుంటాడు. ఇంతలో కరెంట్ వస్తుంది. ఏవండి అక్క ఫోటో అని భాగీ అనగానే పిల్లలకు ఇవ్వొద్దని చెప్పాను కదా మిస్సమ్మ.. అరుంధతి ఫోటో చూస్తే పిల్లలు ఏడుస్తారని తెలుసు కదా? అంటాడు అమర్. అది కాదండి ఒక్కసారి.. అంటున్న భాగీని ఆపి ఎందుకు మళ్లీ పిల్లలు ఏడ్వడానికా? చూశావు కదా ఎలా డల్ అయిపోయారో.. అంటాడు అమర్.
అది కాదండి ఒక్కసారి.. అంటున్న మిస్సమ్మతో ఇంకేం మాట్లాడకు మిస్సమ్మ వెళ్లి పడుకో.. అని చెప్పి అమర్ వెళ్లిపోతాడు. ఎందుకు అక్క ఫోటో నేను చూడకుండా ఎప్పుడూ ఇలా అయిపోతుంది. ఎవరో కావాలనే అపుతున్నట్లు అవుతుంది అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది భాగీ. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. అరుంధతి ఆత్మని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఘోరా పూజలు చేస్తుంటాడు.
ఆరు బాధపడుతుంది. ఘోరా నన్ను వదిలేయ్.. నేను వెళ్లి నా పిల్లలను కాపాడుకోవాలి అంటుంది ఆరు. నీ పని కాపాడటం కాదు ఆత్మ.. నాశనం చేయడం. ఇకనుంచి దేన్ని కాపాడలేవు. నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. నేను నిన్ను ఈ లోక వినాశనానికి వాడతా..? నీ స్థానం ఆ మనోహరికి ఇస్తాను. నీ భర్తకు మనోహరిని భార్యను చేస్తాను అంటాడు ఘోరా.
జాలి వేస్తుంది ఆత్మ
వద్దు ఫ్లీజ్.. వద్దు అది నా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. రాక్షసి అది. నీకు దండం పెడతాను అని బతిమాలుడుతుంది అరుంధతి. నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది ఆత్మ.. కన్నవాళ్లు వదిలేశారు. కట్టుకున్నోడితో నువ్వు సంతోషంగా ఉంటే నువ్వు నమ్మిన స్నేహం నిన్ను కాటికి పంపింది. ఆ భగవంతుడు నీ మీద జాలి పడి నిన్ను భూలోకంలో ఉంచితే నువ్వు నా కంటపడ్డావు. ఇప్పడు నా లక్ష్యాన్నికి బలి కాబోతున్నావు అంటూ పూజ చేస్తుంటాడు ఘోరా.
భాగీ ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. కరుణ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఎలాగైనా అరుంధతి ఫోటో చూడాలనుకుంటుంది. మనోహరి దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలి అంటుంది. నీతో నాకు మాటలేంటి..? అయినా నేను బయటకు వెళ్తున్నాను నాకు టైమ్ లేదు అంటుంది మనోహరి. ఒక్కనిమిషం.
నేను మాట్లాడాలి అనుకుంటుంది అమరేంద్ర గారి గురించి ఆరు అక్క గురించి.. నువ్వు ఈ ఇంటికి చెడు చేయాలని చూసి ఉండొచ్చు. కానీ మనఃస్పూర్తిగా ఆయన మంచి కోరతావని నాకు తెలుసు. అందుకే నీ దగ్గరకు వచ్చాను అంటుంది భాగీ. సరే దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నావు అని మనోహరి అడగ్గానే నేను చూస్తున్న అక్క.. నేను చూడలేకపోయిన ఆరు అక్కా ఒక్కతే అన్న అనుమానం వస్తుంది. పక్కింటి అక్క ఆరు అక్కా ఒక్కరే అవడం అంటూ చెప్తుంది. నేను చూసింది.. నాతో మాట్లాడింది ఆత్మ అయి ఉండాలి అని చెప్తుంది.
ఎవరికీ చెప్పొద్దు
దీంతో మనోహరి షాక్ అవుతుంది. నేను అర్జంట్‌గా ఆరు అక్క ఫోటో చూడాలి అని భాగీ చెప్తుంది. దాంతో భాగీకి వేరే ఫోటో చూపిస్తుంది మనోహరి. ఈవిడ అరుంధతి అక్కనేనా? అని భాగీ అడగ్గానే అవునని చెప్తుంది మనోహరి. దాంతో భాగీ వెళ్లిపోతుంది. మరోవైపు రామ్మూర్తి స్కూల్‌లో లంచ్ చేస్తుంటే పిల్లలు వచ్చి మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అయ్యారా? అని అడుగుతారు.
తను మళ్లీ ఉద్యోగంలో చేరిన సంగతి ఎవరికీ చెప్పొద్దంటాడు రామ్మూర్తి. అప్పుడే రామ్మూర్తిని ప్రిన్సిపల్ పిలుస్తుంది. అక్కడితే నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.
టాపిక్