NNS 25th October Episode: అక్క కోసం భాగీ దీక్ష.. ఆరు ఆత్మ ఎక్కడుందో చెప్పిన సాయబు.. ఘోరాను వెతుకుతున్న అమర్!
NNS 25thOctober Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం శుక్రవారం (అక్టోబర్ 25) ఎపిసోడ్లో అక్క కోసం భాగీ దీక్ష మొదలుపెడుతుంది. అటు ఆరు ఆత్మ ఎక్కడుందో అమర్ కు సాయబు చెబుతాడు. ఘోరా కోసం అమర్ వెతకడం మొదలుపెడతాడు.
NNS 25th October Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (అక్టోబర్ 25) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. రామ్మూర్తి, భాగీ ఇద్దరూ ఇంటి బయట గార్డెన్లో కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా అక్కకు అమ్మవారే తోడుగా ఉంటుందని చెప్తావు కదా నాన్నా అందుకే ఇప్పుడు అమ్మవారి దీక్ష చేద్దామని అంటుంది భాగీ. తల్లి చాలా బాగా చెప్పావు.. అమ్మా రేపు ఉదయాన్నే అమ్మవారి దీక్ష మొదలు పెట్టి ఎల్లుండి కావడి ఎత్తుదాము అంటాడు రామ్మూర్తి.
సరే నాన్నా అంటూ రామ్మూర్తిని లోపలికి తీసుకెళ్తుంది భాగీ. అంతా గమనించిన గుప్త ఆశ్యర్యపోతాడు. జగన్నాథ నీ లీల భలే ఉంది అయ్యా.. అంటూ పైకి చూస్తూ దేవుణ్ని మొక్కుతుంటాడు.
ఘోరను గుర్తు చేసుకుంటూ అమర్ ఆందోళన
కారులో వెళ్తూ ఘోరను గుర్తు చేసుకుంటాడు అమర్. అసలు వాడికి ఏం కావాలి. అసలు మన ఇంటి నుంచి ఏం తీసుకెళ్లాలని ఇన్ని రోజులు మన ఇంటి చుట్టు తిరిగాడు. అంజు బర్తుడే రోజు ఎందుకు ఇంటికి వచ్చాడు. ఎవరిని కలిశాడు..? ఏం తీసుకెళ్లాడు..? మన ఇంట్లో వాణ్ని కలిసే అవసరం ఎవరికి ఉంది అంటాడు.
వాడు ఏం తీసుకెళ్లాడో తెలియదు కానీ ఇంట్లో అందరూ భయపడుతున్నారు సార్ అంటాడు రాథోడ్. అవును రాథోడ్.. మనసంతా ఏదో అలజడి. ఎందుకో చాలా భయంగా ఉంది. ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఆరుకు దూరంగా ఉన్నప్పుడు అలా అనిపించేది. మళ్లీ ఇప్పుడు అలజడిగా ఉంది అంటూ అమర్ ఎమోషన్ అవుతుంటే ఇంతలో కారుకు ఒక సాయబు అడ్డు వస్తాడు. రాథోడ్ కారు ఆపి వెళ్లి తిడుతుంటే.. ఆ ముసలాయన నవ్వుతాడు. ఆ అలజడికి కారణం ఉంది అంటాడు. అమర్ కారు దిగి వస్తాడు.
ఘోర ఎక్కడున్నాడో చెప్పిన సాయబు
ఏమన్నారు..? కారణం ఉందా? అని అడుగుతాడు అమర్. అదే కదా నీ ప్రశ్న అంటాడు సాయబు. నేను నిన్ను ఏ ప్రశ్న అడగలేదే..? అనగానే అడగాలి సామి.. మీకు తెలియనప్పుడు అడగాలి. అప్పుడే సమాధానం దొరుకుంతుంది అంటాడు. మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు.. అంటాడు అమర్.
నీకు ముఖ్యమైనది వాడు స్వార్థానికి తీసుకెళ్లాడు అంటాడు సాయబు. ఏం తీసుకెళ్లాడు.. ఇదంతా మీకెలా తెలుసు..? అసలు మీరెవరు..? అంటాడు అమర్. ఇప్పుడు నేను ఎవరన్నది ముఖ్యం కాదు. నీకు ముఖ్యమైనది ఏమిటి..? వాడి నుంచి నువ్వు కాపాడాల్సింది ఏమిటి? ఇది నీది నువ్వు చేయాల్సిన యుద్దం అంటాడు సాయబు.
మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంటాడు అమర్. నువ్వు వెతుకుతున్నది ఊరి బయట ఉంది. నీ చేతుల్లో ఓడిపోవడానికి సిద్దంగా ఉంది. వెళ్లు.. అంటూ చెప్పి వెళ్లిపోతాడు. ఏంటి ఆయన ఏం చెప్పారో అర్థం కావడం లేదు అంటాడు రాథోడ్. అతను చెప్పినదాంట్లో అర్థం లేకపోయినా.. ఏదో అర్థం ఉంది. ఎస్సైతో మాట్లాడి ఘోర గురించి వెతకమను అని చెప్తాడు అమర్.
అక్క కోసం వెతుకుతున్న భాగీ
భాగీ.. ఆరు కోసం వెతుకుతుంది. ఎక్కడా ఆరు జాడ తెలియకపోవడంతో బాధపడుతుంది. ఇంతలో నిర్మల వస్తుంది. నిన్న ఘోర రావడం. అప్పటి నుంచి ఇంట్లో అందరి మనసు కీడు శంకిస్తు ఉండటం ఇవన్నీ చూస్తుంటే మనసు ఎందుకో భారంగా ఉంది అమ్మా.. అంటుంది నిర్మల. అవును అత్తయ్య ఆలోచిస్తుంటే కరెక్టుగా ఘోర ఇంటికి వచ్చి వెళ్లినప్పటి నుంచే అక్క కూడా కనిపించకుండా పోయింది. అసలు మనకు తెలియకుండా నిన్న ఇంట్లో ఏదో జరిగింది అత్తయ్య.
ఏది ఎందుకు జరుగుతుందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఎటు చూసినా ప్రశ్నలే కానీ సమాధానాలు దొరకడం లేదు అంటుంది భాగీ. దూరం నుంచి అంతా వింటున్న మనోహరి.. భాగీని ఎలాగైనా డైవర్ట్ చేయాలని అనుకుని దగ్గరకు వెళ్తుంది. ఏమైంది ఆంటీ దేని గురించో సీరియస్‌గా మాట్లాడుతున్నారు అంటుంది. పక్కింటి అక్క గురించి నిన్నటి నుంచి కనిపించడం లేదు అంటుంది భాగీ.
అదేంటి మీకు చెప్పలేదా? ఆవిడ ఇక్కడి నుంచి వెళ్లిపోయింది కదా? అంటుంది మనోహరి. వెళ్లడం అంటే ఎక్కడికి వెళ్లింది. ఎలా వెళ్లింది. ఎందుకు వెళ్లింది అంటున్న భాగీతో ఇప్పటికే చాలా ఆలస్యం అయింది భాగీ.. కానీ వెళ్లడం రాసి పెట్టి ఉన్నప్పుడు వెళ్లక తప్పదు కదా? అక్క ఇక తిరిగి రాదు. రాలేదు. నువ్వు మర్చిపోవడం బెటర్ భాగీ. సరే నాకు చిన్న పని ఉంది వెళ్లోస్తాను అంటూ వెళ్లిపోతుంది మనోహరి.
ఇదే ముగింపు అనుకుని గెలిచావు అనుకుని అప్పుడే మురిసిపోతే ఎలా బాలిక అనుకుంటాడు గుప్త. మనం కష్టాలు బాధల్లో ఉంటే ఈ అమ్మాయి ఒకతి.. దేనికి ఎలా స్పందించాలో తెలియదు అంటుంది నిర్మల. మేమంతా ఇంత కంగారు పడుతుంటే మనోహరి మాత్రం నిన్నటి నుంచి ఆనందంగా ఉంది. ఘోర ఇంట్లోకి రాగలిగాడు అంటే అది కచ్చితంగా మనోహరి సాయంతోనే అంటూ ఆలోచిస్తుంది భాగీ. భాగీ పోరాటంలో గెలవాలని గుప్త దీవిస్తాడు.
ఎమోషనల్ అయిన అమర్
ఘోర పూజ చేస్తుంటాడు. అమర్ ఘోర కోసం వెతుకుతుంటాడు. ఘోర దగ్గర సీసాలో బంధీగా ఉన్న ఆరు ఏడుస్తుంది. దేవుడా ప్లీజ్ నన్ను కాపాడు అంటూ వేడుకుంటుంది. అక్కడే దగ్గరలో ఉన్న అమర్ హార్ట్ వేగంగా కొట్టుకుంటుంది. అమర్ ఒక్కసారిగా ఆగిపోతాడు.
ఆరును గుర్తు చేసుకుంటాడు. ఏమైంది సార్.. అంటాడు రాథోడ్. ఎందుకో ఆరు మాటలు వినిపించినట్టు అనిపించింది రాథోడ్. మనసంతా ఎందుకో భయంగా ఉంది. ఎవరి మీదనో తెలియదు కానీ చాలా కోపంగా ఉంది. మనిషిని ఇక్కడ ఉన్నా కానీ మనసు ఎక్కడొక్కడో తిరుగుతుంది అంటూ అమర్ ఎమోషనల్ అవుతాడు. ఘోర గట్టిగా నవ్వుతూ ఆత్మా ఇప్పటి నుంచి నువ్వు నా బంధీవి నా బానిసవి.. నా మాటే నీకు శాసనం. ఈ ఘోర లోకాధిపతి అయ్యాడు అంటూ నవ్వుతుంటాడు.
ఇంతలో అక్కడికి మనోహరి వచ్చి మరి నేను ఎప్పుడు గెలుస్తాను ఘోర.. అని అడుగుతుంది. ఈ ఘోర మాటిచ్చాడు అంటే సచ్చేదాకా కాస్తునే ఉంటాడు. నీ కష్టాలు తీర్చాకే నా పని మొదలు పెడతాను అంటాడు ఘోర. అమర్ ఆరు ఆత్మను కాపాడతాడా? మనోహరి దొరికిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్ 25న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్