NNS 24th October Episode: ప్రిన్సిపల్​కి షాకిచ్చిన పిల్లలు.. ఆరు కోసం భాగీ దీక్ష.. కుమిలిపోతున్న రామ్మూర్తి​​​​!-zee telugu serial nindu noorella saavasam today 24th october episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 24th October Episode: ప్రిన్సిపల్​కి షాకిచ్చిన పిల్లలు.. ఆరు కోసం భాగీ దీక్ష.. కుమిలిపోతున్న రామ్మూర్తి​​​​!

NNS 24th October Episode: ప్రిన్సిపల్​కి షాకిచ్చిన పిల్లలు.. ఆరు కోసం భాగీ దీక్ష.. కుమిలిపోతున్న రామ్మూర్తి​​​​!

Hari Prasad S HT Telugu
Oct 24, 2024 06:00 AM IST

NNS 24th October Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం గురువారం (అక్టోబర్ 24) ఎపిసోడ్లో ప్రిన్సిపల్​కి పిల్లలు షాకివ్వడానికి రెడీ అవుతారు. అటు ఆరు కోసం భాగీ దీక్షకు సిద్ధం అవుతుండగా.. ఆమెను తలచుకొని రామ్మూర్తి కుమిలిపోతాడు.

ప్రిన్సిపల్​కి షాకిచ్చిన పిల్లలు.. ఆరు కోసం భాగీ దీక్ష.. కుమిలిపోతున్న రామ్మూర్తి​​​​!
ప్రిన్సిపల్​కి షాకిచ్చిన పిల్లలు.. ఆరు కోసం భాగీ దీక్ష.. కుమిలిపోతున్న రామ్మూర్తి​​​​!

NNS 24th October Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (అక్టోబర్ 24) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రామ్మూర్తితో ప్రిన్సిపాల్‌ కారు క్లీన్‌ చేయిస్తుంటే చూసిన పిల్లలు బాధపడతారు. కావాలనే ప్రిన్సిపల్​ తాతయ్యతో ఇలాంటి పనులు చేయిస్తుంది.. ఎలాగైనా ప్రిన్సిపల్​కి బుద్ది చెప్పాలి అనుకుంటారు.

ఇంతలో అంజు ఫోన్‌ తీసుకొచ్చి వీడియో తీస్తుంది. నలుగురు కలిసి ప్రిన్సిపాల్‌ దగ్గరకు వెళ్లి మేడం మీరు న్యూస్‌ చూస్తారా? అని అడగ్గానే చూస్తాను.. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అయ్యే న్యూస్‌ ఎక్కువ చూస్తాను అని చెప్తుంది. పిల్లలు సరే బాయ్‌ మేడం అంటూ వెళ్లిపోతారు.

అమర్‌కు భాగీ క్లాస్

గుప్త గార్డెన్‌ లో తిరుగుతూ తనలో తానే ఆరు గురించి మాట్లాడుకుంటుంటాడు. ఇంతలో అమర్‌ ఆఫీసుకు వెళ్తూ భాగీకి చెప్పగానే.. ఒక్క నిమిషం ఎన్ని సార్లు చెప్పాను.. వెళ్తున్నాను కాదు వెళ్లొస్తాను అని చెప్పమని అంటుంది. అది ఏదో పొరపాటులో చెప్పాను.

ఇప్పుడు ఏంటి..? అంటాడు అమర్. ఆ అలవాటే మార్చుకోమని చెప్పేది. మీరు వెళ్తున్నాను అని చెప్పి వెళ్తున్నప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు ఎంత టెన్షన్‌ గా ఉంటుందో తెలుసా..? అంటుంది. సరే మళ్లీ అననులే.. అంటాడు అమర్​. ఇప్పుడు అన్నారుగా.. కూర్చోండి.. ఇప్పుడే వస్తాను..అని భాగీ లోపలికి వెళ్తుంది.

అమర్ ఇంటికి రామ్మూర్తి

రామ్మూర్తి గేటు ఓపెన్‌ చేసుకుని ఇంట్లోకి వస్తాడు. రామ్మూర్తిని చూసిన గుప్త ఇతను వచ్చాడేంటి అనుకుంటాడు. రామ్మూర్తి లోపలికి వస్తూ గార్డెన్‌ వైపు చూస్తూ మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంటాడు. రాథోడ్‌ ఎదురు వచ్చి పలకరిస్తాడు. ఏంటి సార్‌ పిలిస్తేనే రారు అలాంటిది పిలవకుండానే వచ్చారు. ఏంటి విషయాలు. అని అడుగుతాడు. నిన్నటి నుంచి మనసులో ఏదో అలజడి రాథోడ్‌. ఏదో జరిగిపోయింది. నా కూతురుకు ఏదో జరిగింది అని భయంగా ఉంది.

అమ్మాయితో ఫోన్‌ లో మాట్లాడాను కానీ అమ్మాయిని ఒక్కసారి చూడాలని వచ్చాను అంటాడు. ఏంటి సార్‌ మీరు మా సార్‌ ఉండగా.. మీ కూతురుకు ఏమైనా అవ్వనిస్తారా? ఒకవేళ ప్రమాదం వచ్చినా తన ప్రాణాలు అడ్డువేసి కాపాడతాడు అంటాడు రాథోడ్​. తెలుసు రాథోడ్‌.. కానీ ఈ సారి ఎంత నచ్చజెప్పుకున్నా మనసులో అలజడి తగ్గడం లేదు అంటాడు రామ్మూర్తి. అయితే లోపలికి వచ్చి నీ కూతురు యోగక్షేమాలు తెలుసుకుందురు రండి అని ఇద్దరూ లోపలికి వెళ్లిపోతారు.

భాగీ క్షేమం అడిగిన రామ్మూర్తి

పుట్టినప్పుడు కూతురు ముఖం కూడా చూడని తండ్రి ఇప్పుడు ఆ కూతురు లోకం విడిచి వెళ్లిన కూతురు ప్రమాదంలో ఉన్నందుకు ఆ తండ్రి మనసు విలవిలలాడుతున్నది అనుకుంటాడు గుప్త. భాగీకి అమ్మవారి దీక్ష చేపట్టమని ఎలా చెప్పాలి అని అయోమయంలో పడి.. ఈ సమస్యకు పరిష్కారం చూపమని యముణ్ని ప్రార్థిస్తాడు గుప్త. లోపలికి వచ్చిన రామ్మూర్తిని చూసి భాగీ హ్యాపీగా ఫీలవుతుంది.

నాన్నా ఎలా ఉన్నావు నాన్నా.. అంటుంది భాగీ. నేను బాగున్నాను తల్లి.. నువ్వెలా ఉన్నావు అమ్మా.. అంటాడు రామ్మూర్తి. ఏంటి బావగారు అంజు బర్తుడేకు వస్తామని మీరు రాలేదు. మీరు రాలేదు కాబట్టి మేం ఎవరం మీతో మాట్లాడము.. అంటాడు శివరామ్​. మీరు వస్తారని పిల్లలు బాగా సంతోషపడ్డారు అన్నయ్య గారు. మీరు రాలేదని తెలిసి వాళ్లు చాలా బాధపడ్డారు నిర్మల.

అంటే ఊరి నుంచి తెలిసిన వాళ్లు వచ్చారమ్మా వాళ్లను వదిలి రాలేకపోయాను. బాబుగారు రాలేకపోయినందుకు క్షమించండి అంటాడు రామ్మూర్తి. అయ్యో ఎందుకులేండి.. మీకు ఏదో ముఖ్యమైన పని ఉంటేనే రారని తెలుసు కదా? అని అందరూ మాట్లాడుకుంటుంటే ఇంతలో రాథోడ్‌ మీ కూతురును చూసుకున్నారు కదా సార్‌ ఇక హ్యాపీయేనా..? అంటాడు. ఏమైంది రాథోడ్‌ అంటూ అందరూ అడుగుతారు. రామ్మూర్తి ఎందుకు వచ్చింది చెప్తాడు రాథోడ్. దీంతో రామ్మూర్తి ఎమోషనల్‌ గా ఫీలవుతాడు. అమర్‌ వెళ్లిపోతాడు.

ఆరు కోసం భాగీ దీక్ష

రామ్మూర్తి, భాగీ గార్డెన్‌ లోకి వస్తారు. ఎందుకు నాన్నా అలా ఉన్నారు. నాకు ఏమైనా అవుతుందని ఎందుకు భయపడుతున్నారు చెప్పండి నాన్నా.. అసలు ఏమైంది అని అడుగుతుంది భాగీ. అమ్మా భాగీ ఇక్కడ అంతా బాగానే ఉంది కదా? ఆ మనోహరి వల్ల నువ్వేమైనా బాధపడుతున్నావా అమ్మా.. అల్లుడు గారు నిన్ను ఏమైనా అంటున్నారా..? అంటాడు రామ్మూర్తి.

నాన్నా నేను చాలా బాగున్నాను. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక మనోహరి అంటావా? తన తిక్క నేను కుదుర్చుతాను అంటుంది భాగీ. నిన్నటి నుంచి నా మనసు ఎందుకో ఒకటే కీడు శంకిస్తుంది అమ్మా.. అంటున్న రామ్మూర్తితో ఎందుకో తెలియడం లేదు కానీ నాక్కూడా చాలా భయంగా ఉంది నాన్నా.. ఎవరికో ఏదో అయినట్టు చాలా నిస్సహాయంగా ఉంది అంటూ ఇద్దరికీ ఒకేలా మనసుకు బాధగా ఉందిని ఎమోషనల్‌ అవుతారు.

భాగీ.. అక్క ఏదైనా ప్రమాదంలో ఉందేమో అంటుంది. మీకు నాకు తెలియకుండా ఒకటే సారి ఇలా అనిపిస్తుందంటే కచ్చితంగా అక్కకు ఏదో కష్టం వచ్చినట్టు అనిపిస్తుంది నాన్నా.. అనగానే రామ్మూర్తి ఏడుస్తాడు. కిందపడిపోతాడు. దీంతో గుప్త రక్తసంబంధమునకు ఇంత శక్తి ఉందా? అనిపిస్తుంది అనుకుంటాడు. ఇంతలో భాగీ ఎంత కష్టం వచ్చినా అక్కకు అమ్మవారే తోడుగా ఉంటుందని చెప్తావు కదా నాన్నా అందుకే ఇప్పుడు అమ్మవారి దీక్ష చేద్దామని అంటుంది. భాగీ దీక్షతో ఆరు ఆత్మ ఘోరా బంధనం నుంచి విముక్తి అవుతుందా? ప్రిన్సిపల్​ వీడియోతో పిల్లలు ఏం చేయనున్నారు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్​ 24న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner