NNS 23rd September Episode: నిలదీసిన అమర్.. అబద్దం చెప్పిన మనోహరి.. అంజు చేతికి తాయత్తు.. నిజం తెలుసుకున్న భాగీ!
23 September 2024, 9:42 IST
- NNS 23rd September Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 23) ఎపిస్డోలో మనోహరిని అమర్ నిలదీయగా.. ఆమె ఏదో అబ్ధం చెప్పి తప్పించుకుంటుంది. అటు అంజు చేతికి తాయత్తు ఇస్తుంది మనోహరి.
నిలదీసిన అమర్.. అబద్దం చెప్పిన మనోహరి.. అంజు చేతికి తాయత్తు.. నిజం తెలుసుకున్న భాగీ!
NNS 23rd September Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (సెప్టెంబర్ 23) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి, భాగీ చెస్ ఆడుతూ ఉంటారు. భాగీకి చెక్ పెట్టిన మనోహరి ఇక నీ ఆటలు చెల్లవు అంటుంది. అప్పుడే అమర్ వచ్చి భాగీని చెస్‌లో గెలిపిస్తాడు. దీంతో పిల్లలందరూ హ్యాపీగా గెంతులేస్తారు. అంజు మాత్రం డాడ్ వచ్చి గెలిపించారు మీరు మరీ సంబరపడకండి అంటుంది.
మనోహరిని నిలదీసిన అమర్
ఇంతలో అమర్ మనోహరితో మాట్లాడాలి పక్కకి రా అంటూ పైకి వెళ్తాడు. వెనకాలే అనుమానంగా మనోహరి వెళ్తుంది. భాగీ మాత్రం పర్సనల్ గా ఏం మాట్లాడతాడు అనుకుంటుంది. మనోహరి వెళ్లి ఏదో మాట్లాడాలి అన్నావు అని అడగ్గానే ఇవాళ ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు. అది చెప్పాను కదా అమర్. ఫ్రెండ్స్ తో కెఫేకు వెళ్లాను అంటుంది మనోహరి.
కెఫే ఏ ఏరియాలో ఉంది..? అంటాడు అమర్. జూబ్లీహిల్స్ లో ఉంది అనగానే కెఫే వరకు కారులోనే వెళ్లావా? అని అడుగుతాడు అమర్. కారులోనే వెళ్లాను.. కారులోనే వచ్చాను.. ఏమైంది అమర్. ఎందుకు అలా అడిగావు అంటుంది మనోహరి. నేను నీకు కాల్ చేసినప్పుడు నీ కారును నానక్ రామ్ గూడలో చూశాను అని అమర్ అనగానే మనోహరి తడబడుతూ.. అంటే అక్కడకు వచ్చింది అమరా..? నేను ఘోరాతో మాట్లాడటం చూశాడా ఏంటి? అని మనసులో అనుకుంటూ భయపడుతుంది.
అబద్ధం చెప్పిన మనోహరి
మనోహరి నువ్వు జాబ్లీహిల్స్ లో నీ ఫ్రెండ్స్ తో ఉంటే ఆదే టైంలో నీ కారును నానక్ రామ్ గూడలో ఎలా చూశాను అంటూ అమర్ నిలదీయగానే మనోహరి షాక్ అవుతుంది. ఏదో చెప్పి తప్పించుకోవాలని చూస్తే అమర్ నువ్వు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నావు అంటాడు.
నాకు కావాల్సింది నీ మౌనం కాదు మనోహరి నీ సమాధానం అంటూ గట్టిగా అమర్ అడగ్గానే.. ఇల్లు చూడ్డానికి వెళ్లానని అది నీకు చెబితే ఒప్పుకోవని అబద్దం చెప్పాను. నాకు ఇక్కడ ఉండే అర్హత లేదు అంటుంది మనోహరి. సరే నీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే వెళ్లొచ్చు అంటాడు అమర్. దీంతో మనోహరి ఏడుస్తూ థాంక్యూ అమర్ అంటుంది. సరేనని అమర్ వెళ్లిపోతాడు.
అంజుకి తాయత్తు ఇచ్చిన మనోహరి
భాగీ అంత సీరియస్ గా ఏం మాట్లాడుతున్నారు అనుకుని రాథోడ్ ను అడుగుతుంది. రాథోడ్ జరిగింది మొత్తం చెప్పేస్తాడు. చెట్టు చాటు నుంచి రాథోడ్ మాటలు విన్న అరుంధతి పౌర్ణమి రోజు మనోహరిని పంపించేయాలి అనుకుంటుంది. తర్వాత మనోహరి అంజును పిలుస్తుంది. చెప్పండి ఆంటీ అంటుంది అంజు. నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను నేను చూసుకుంటున్నట్లుగా ఉంది తెలుసా..? సేమ్ టూ సేమ్ అంటుంది మనోహరి.
ఏం మీకు చిన్నప్పటి నుంచి చదువు రాదా. మీరు కూడా నాలాగా ఓవర్ గా బిహేవ్ చేసేవారా? అల్లరి చేసి అందరితో తిట్లు తినేవారా.? చెప్పండి అంటుంది అంజు. ఆపు.. ఆపు ప్లీజ్.. నేను చెప్తుంది. నీలాగా క్యూట్‌గా ఇంటలిజెంట్ గా ఉండేదాన్ని అంటున్నాను. నిన్ను చూస్తుంటే చాలా ముద్దుగా ముచ్చటగా ఉంది తెలుసా? అంటుంది మనోహరి.
మీరు కూడా పెళ్లి చేసుకుని ఉంటే నాలాగా ముద్దుగా క్యూట్ గా ఒక కూతురు పుట్టేది కదా..? అప్పుడు తనను కూడా ఇలానే ముద్దు చేస్తూ స్కూల్ కు రెడీ చేస్తూ పంపించేవారు కదా? అంటుంది అంజు. ఆ జీవితం వద్దనే కదా వదిలేసి వచ్చాను అని మనసులో అనుకుంటూ.. సరే నాకు ఒక హెల్ఫ్ కావాలి చేస్తావా..? అని అంజుని అడుగుతుంది మనోహరి.
మనోహరి ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
ఆ చెప్పండి ఆంటీ చేస్తాను. అని అంజు చెప్పగానే ఘోర ఇచ్చిన తాయెత్తు తీసి అంజుకు ఇస్తూ ఇది తీసుకుని నీ దగ్గర ఉంచుకుని రేపు నేను వచ్చి నీకు ముద్దు పెట్టాక నా చేతికి కట్టాలి అని చెప్తుంది. సరేనని అంజు వెళ్తుంది. దీంతో మనోహరి నీ రక్తంతోనే నిన్ను ఓడించబోతున్నాను అనుకుంటుంది మనసులో.
అరవింద్ లోకేషన్ ట్రేస్ చేసి పట్టుకున్నామని అమర్ పై అధికారి చెప్తాడు. అరవింద్ తప్పించుకున్నాడని వాడి అనుచరుడు దొరికాడని.. అరవింద్ ఇక దొరకడేమో అంటాడు. దీంతో నేను నా వైఫ్ తో కలిసి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్తాను అప్పుడు వాడు మా కోసం వస్తాడు. అప్పుడు వాడిని పట్టుకుందామని అమర్ చెప్తాడు.
పౌర్ణమి రోజు మనోహరి శరీరంలోకి అరుంధతి ఆత్మ ప్రవేశిస్తుందా? మనోహరి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు సెప్టెంబర్ 23న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్