తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 14th September Episode: భాగీలో అనుమానం.. దొరికిపోయిన అరుంధతి.. రణ్​వీర్​ ఫోన్​ నెంబర్​ కావాలన్న అంజు​!

NNS 14th September Episode: భాగీలో అనుమానం.. దొరికిపోయిన అరుంధతి.. రణ్​వీర్​ ఫోన్​ నెంబర్​ కావాలన్న అంజు​!

Hari Prasad S HT Telugu

14 September 2024, 6:00 IST

google News
    • NNS 14th September Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శనివారం (సెప్టెంబర్ 14) ఎపిసోడ్లో భాగీలో అనుమానం మొదలవుతుంది. అటు అరుంధతి తాను ఎక్కడ దొరికిపోతానో అని భయపడగా.. రణ్‌వీర్ నంబర్ కావాలని మనోహరిని అడుగుతుంది అంజు.
భాగీలో అనుమానం.. దొరికిపోయిన అరుంధతి.. రణ్​వీర్​ ఫోన్​ నెంబర్​ కావాలన్న అంజు​!
భాగీలో అనుమానం.. దొరికిపోయిన అరుంధతి.. రణ్​వీర్​ ఫోన్​ నెంబర్​ కావాలన్న అంజు​!

భాగీలో అనుమానం.. దొరికిపోయిన అరుంధతి.. రణ్​వీర్​ ఫోన్​ నెంబర్​ కావాలన్న అంజు​!

NNS 14th September Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (సెప్టెంబర్ 14) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్​ కంగారుగా ఫోన్​ మాట్లాడుతుండటం చూసి ఏమైంది ఈయనకి.. ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంది.. చుట్టూ ఇంత జరుగుతున్నా ఏం చెప్పరు అనుకుంటూ ఉండగా మిస్సమ్మా.. అని పిలుస్తాడు. నేనే మీతో మాట్లాడుదామనుకుంటున్నా.. మీరే పిలిచారు. ఏంటో చెప్పండి అంటుంది మిస్సమ్మ.

రామ్మూర్తిని రావద్దని చెప్పిన అమర్

రేపు మీ నాన్న వాళ్లు వస్తున్నారా? అని అమర్​ అడగగానే వస్తారు అంటుంది. అయితే ఫోన్​ చేసి రావొద్దని చెప్పు అంటాడు అమర్​. ఏ.. ఎందుకండి అంటుంది మిస్సమ్మ. తర్వాత చెప్తాను.. ముందు చెప్పింది చెయ్​ అంటాడు అమర్​. ఒక్క నిమిషం.. మీరే వాళ్లని పిలుద్దామని ఇంటికి కూడా తీసుకెళ్లారు, మా నాన్న రాను అంటే బలవంతంగా ఒప్పించారు. ఇప్పుడు మీరే వద్దంటున్నారు. కనీసం కారణమైనా చెప్పండి అంటుంది.

కారణం చెప్పకూడదని కాదు మిస్సమ్మ.. కానీ మొన్న స్కూల్లో జరిగినదానికి నువ్వు, పిల్లలు ఎంత భయపడ్డారో నాకు తెలుసు.. మిమ్మల్ని ఇంకా ఇబ్బందిపెట్టాలని అనుకోవట్లేదు అని మనసులో అనుకుంటాడు అమర్​. తనే స్వయంగా రామ్మూర్తికి ఫోన్​ చేసి రేపు మీరు రానక్కర్లేదు ఏం అనుకోకండి అని చెబుతాడు. సరే అంటాడు రామ్మూర్తి. కారణమేదైనా ఇలా చేయడం దారుణం అంటూ వెళ్లిపోతుంది భాగీ.

భాగీలో మొదలైన అనుమానం

ఎవరు ఫోన్​ చేశారని అంటుంది మంగళ. ఇంటికి రావొద్దన్నారు అంటాడు రామ్మూర్తి. అదేంటి.. ఇప్పుడు నా పైసల సంగతేంటి అని భయపడుతుంది మంగళ. ఇంట్లోనే పండగ చేసుకుందామంటాడు రామ్మూర్తి. మనబోటి జీవితాలకి పండగ కూడానా అంటూ విసుక్కుని వెళ్లిపోతుంది మంగళ.

భాగీ గార్డెన్లో కూర్చుంటే ఓ సెక్యూరిటీ అతను వచ్చి ఇక్కడ కూర్చోకూడదు మేడమ్​ అంటాడు. కానీ భాగీ వినిపించుకోకుండా అక్కడే కూర్చుంటుంది. సరే అమర్​ గారిని పిలుస్తాను అని వెళ్లిపోతాడు. అప్పుడే అటుగా వచ్చిన అరుంధతి ఏమైందని భాగీని అడుగుతుంది. జరిగిదంతా చెప్పి బాధపడుతుంది భాగీ. ఆయన అలా చెప్పరే.. అంటుంది అరుంధతి.

ఆయన మీ ఆయనా.. మీకు అన్నీ తెలిసిపోవడానికి అంటుంది భాగీ. ఆయన ఏం చేసినా దాని వెనక ఓ బలమైన కారణం ఉంటుంది అంటుంది అరుంధతి. గేట్​లో నుంచి ఎవర్నీ లోపలకు రానివ్వట్లేదు కదా మీరెలా వచ్చారు అని అడుగుతుంది భాగీ. నేను పక్కింటి ఆవిడనే కదా వాళ్లకు అప్పుడప్పుడు కనపడుతూనే ఉంటా కదా అంటుంది అరుంధతి.

అమర్‌కు సారీ చెబుతానన్న భాగీ

ఇంతలో రాథోడ్​ వచ్చి ఏంటి మిస్సమ్మ అని అడుగుతాడు. రాథోడ్​ ముందరే అరుంధతితో మాట్లాడటంతో ఏం అర్థం కాక కంగారు పడతాడు. తను బాధలో ఉన్నప్పుడు తన అక్కను ఊహించుకుని మాట్లాడుతోంది అనుకుంటూ తనూ అక్కతో మాట్లాడుతున్నా అంటూ అరుంధతితో మాట్లాడుతాడు.

తను కనపడకపోయినా ఎలా మాట్లాడుతున్నాడో అర్థంకాక అయోమయంలో పడుతుంది అరుంధతి. మా సార్​ కఠిన నిర్ణయం వెనుక ఓ బలమైన కారణం ఉంటుందని తెలుసు కదా.. తెలుసుకోకపోతే ఎలా? అని జరిగిందంతా చెబుతాడు రాథోడ్. అమర్​ని అపార్థం చేసుకున్నందుకు ఫీలైపోయి వెంటనే సారీ చెబుతాను అంటూ లోపలకు వెళ్తుంది భాగీ.

రణ్‌వీర్ నంబర్ అడిగిన అంజూ

అంజు మనోహరిని పిలిచి తనకు ఓ హెల్ప్​ చేయమంటుంది. తను చేయలేనంటుంది మనోహరి. చిన్న హెల్ప్​కి ఎందుకు అలా అంటారు అంటుంది అంజు. సరే ఏంటో చెప్పు అంటుంది మనోహరి. రణ్​వీర్​ అంకుల్​ నెంబర్​ ఇస్తారా? అని అడుగుతుంది అంజు. అదెంత పని అంటూ లోపలికి పోబోయిన మనోహరి తేరుకుని రణ్​వీర్​ నెంబర్​ ఎందుకు?

అయినా ఆయన నెంబర్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? అని కంగారు పడుతుంది. రణ్​వీర్​ అంకుల్​ని పండగకి పిలుద్దామని అంటుంది అంజు. రణ్​వీర్​ అమర్​ ఇంటికి పండగకు వస్తాడా? అమర్​ ఇంట్లో బాంబ్​ని కనిపెడతారా? మనోహరి ఎలా తప్పించుకోబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు సెప్టెంబర్​ 14న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం