NNS September 13th Episode: అమర్​ని బ్లాక్​మెయిల్​ చేసిన మంగళ- తప్పించుకున్న ఉగ్రవాది- ఇంట్లో బాంబ్- చంపేందుకు ప్లాన్-nindu noorella saavasam serial september 13th episode mangala blackmails amar nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns September 13th Episode: అమర్​ని బ్లాక్​మెయిల్​ చేసిన మంగళ- తప్పించుకున్న ఉగ్రవాది- ఇంట్లో బాంబ్- చంపేందుకు ప్లాన్

NNS September 13th Episode: అమర్​ని బ్లాక్​మెయిల్​ చేసిన మంగళ- తప్పించుకున్న ఉగ్రవాది- ఇంట్లో బాంబ్- చంపేందుకు ప్లాన్

Sanjiv Kumar HT Telugu
Sep 13, 2024 11:03 AM IST

Nindu Noorella Saavasam September 13th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌‌లో రామ్మూర్తి పెద్ద కూతురు, మీ భార్య అరుంధతి అని అమర్‌తో మాట్లాడుతుంది మంగళ. తనకు నిజం తెలుసని చెప్పి రూ. 10 లక్షలు అడుగుతుంది. మరోవైపు అమర్ అరెస్ట్ చేయించిన ఉగ్రవాది తప్పించుకుంటాడు.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 13th September Episode) వినాయక చవితికి పిలవడానికి భాగీ, అమర్‌ రామ్మూర్తి ఇంటికి వెళ్తారు. వినాయక చవితికి రమ్మని పిలవగానే రామ్మూర్తి మొహమాట పడుతుంటాడు. దీంతో భాగీ నాన్నా మీరు ఆ ఇంటికి రావడం మీకేమైనా ఇబ్బందా? అని అడుగుతుంది.

మోసుకెళ్లడానికి కాదు

దీంతో రామ్మూర్తి ఇప్పటికే ఆ ఇంటి నుంచి చాలా తీసుకున్నానని చెప్తాడు. అప్పుడు అమర్‌ ఆ ఇల్లు మీ కూతురిది కూడా. మీరు వస్తేనే మాకు సంతోషంగా ఉంటుంది. ఇంత దూరం వచ్చింది మీరు రారనే వార్తను మోసుకెళ్లడానికి కాదు. మా వెంట మిమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చాము అని అమర్ అంటాడు. దాంతో రామ్మూర్తి సరే అని ఒప్పుకుంటాడు.

బయట వెయిట్‌ చేస్తుంటాను. మీరు రెడీ అయి రండి అని బయటకు వెళ్తాడు అమర్. తర్వాత మంగళ కూడా బయటకు వెళ్తుంది. అమర్​ దగ్గరకు వెళ్లిన మంగళ బాబు.. అంటుంది. ఏదో చెప్పాలని వచ్చి మొహమాట పడుతున్నారు. డబ్బుల గురించా? నన్ను అడగలేకపోతే రాథోడ్‌‌ను అయినా అడగండి అంటాడు అమర్​.

అయ్యోయ్యో అది కాదు బాబు. మీ భార్య అరుంధతి గురించి.. మా ఆయన పెద్ద కూతరు గురించి అని మంగళ అనగానే అమర్‌ కంగారుగా ఆ విషయం మీకెలా తెలుసు..? ఈ విషయం ఆయనకు తెలుసా? మిస్సమ్మకు కూడా తెలుసా? అని అడుగుతాడు. ఈ నిజం నాకు మాత్రమే తెలుసు. ఆయనకు కానీ భాగీకి కానీ నేను చెప్పలేదు. మీరు నిజం ఎందుకో దాస్తు‌న్నారు అని నేను చెప్పలేదు. అయినా మీరు ఎందుకు నిజం చెప్పలేదు అంటుంది మంగళ.

చెప్పకపోవడమే మంచిది

నేను చెప్పే ఒక్క నిజంతో ఆయన బ్రతకడానికి కారణం లేకుండా చేయలేకపోయాను. తన అక్క లేదనే నిజం తట్టుకుని నిలబడే శక్తి మిస్సమ్మకు లేదు. ఇందరి జీవితాలను తారుమారు చేసే ఆ నిజం, మనసు విరిచేసే ఆ నిజం చెప్పకపోవడమే మంచిది అనిపించింది అంటాడు అమర్​.

కరెక్టుగా చెప్పారు బాబు. ఆయన పెద్ద కూతురు గురించి కలవరపడుతున్నారు. ఆయన మంచాన పడి ఉండటం చూడలేకపోతున్నాను. ఇంతకు ముందు ఉద్యోగానికి వెళ్లేవాడు. ఇలాగే ఖాళీగా ఉంటే కూతురు జాడ కనుక్కోకుండా ఉండేలా లేడు. అందుకే బిజినెస్‌ చేద్దామనుకుంటున్నాము. ఒక పది లక్షలు ఇవ్వండి అని ఇన్‌డైరెక్ట్‌గా అమర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తుంది మంగళ.

సరే లేండి డబ్బుల విషయం నేను చూసుకుంటాను అని అమర్ చెప్పగానే ఇంతలోనే లోపలి నుంచి రామ్మూర్తి, భాగీ వస్తారు. మంగళను రామ్మూర్తి తిడతాడు. తర్వాత భాగీ, అమర్‌ వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక అమర్‌తో ఏం మాట్లాడావు అని మంగళను అడుగుతాడు రామ్మూర్తి. నేనేం అడగలేదని చెప్తుంది. దీంతో డబ్బులు అడిగావా? అంటూ రామ్మూర్తి గట్టిగా నిలదీస్తే మంగళ తడబడుతూ నేనేం అడగలేదు. నీ పెద్దకూతురు గురించి మాట్లాడాను అంటుంది.

మనసంతా ఏదోలా ఉంది

దీంతో రామ్మూర్తి ఎమోషనల్‌ అవుతాడు. బాబు గారి ఇంట్లో ఆ పట్టుపంచె చూసినప్పటి నుంచి మనసంతా ఏదోలా ఉంది అంటాడు. మరోవైపు అమర్‌ ఇంటికి మిలటరీ మేజర్‌ వస్తాడు. మేజర్‌ రాగానే ఏదైనా ప్రాబ్లమ్​ ఉందా అని అడుగుతాడు అమర్​. ప్రాబ్లం ఏమీ లేదు అమర్‌. జస్ట్‌ రొటీన్‌ చెక్‌ అప్‌. అండ్‌ సెక్యూరిటీని కొంచెం టైట్‌ చేస్తున్నాం అంతే అని మేజర్ అంటాడు.

ఏదైనా సమస్య ఉంటే చెప్పండి బాబు పర్వాలేదు అని శివరామ్ అనగానే ఎం లేదండి.. అని చెప్పి మేజర్‌ అమర్‌తో పర్సనల్‌‌గా మాట్లాడాలి అని పక్కకు తీసుకెళ్లి ఇండిపెండెన్స్‌ డే రోజు మనం అరెస్ట్‌ చేసి వారిలో మేయిన్‌ వాడు జైలు నుంచి తప్పించుకున్నాడు. అందుకే వాడు ఇప్పుడు నిన్ను, నీ ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తాడు. అందుకే నీకు నీ ఫ్యామిలీకి సెక్యూరిటీ పెంచాము. జాగ్రత్తగా ఉండమని చెప్పి మేజర్‌ వెళ్లిపోతాడు.

భాగీ ఎందుకు ఇంత సెక్యూరిటీ అని అడగ్గానే రొటీన్‌ అంట అని అందరినీ లోపలికి పంపిస్తాడు అమర్. రాథోడ్‌ వచ్చి ఏమైంది సార్ అని అడగ్గానే అరవింద్‌ జైలు నుంచి తప్పించుకున్నాడంట అందుకే టైట్‌ సెక్యూరిటీ చేశారు అని చెప్తాడు అమర్.

ఉగ్రవాదులు ఏం చేయనున్నారు

మరోవైపు తీవ్రవాదులు ఉక్రోషంతో అమర్‌ను తిడుతుంటారు. అమరేంద్రను చంపాలని డిసైడ్‌ అవుతాడు. ఉగ్రవాదులు ఏం చేయనున్నారు? మంగళ ప్లాన్​ వర్కౌట్​ అవుతుందా? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్​ 14న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner