NNS 14th August Episode: మనోహరికి రణ్‌వీర్ ఫోన్.. నిజం కనిపెట్టిన అరుంధతి.. ఆత్మను ముట్టుకున్న భాగీ!
14 August 2024, 7:00 IST
- NNS 14th August Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఆగస్ట్ 14) ఎపిసోడ్లో మనోహరికి రణ్‌వీర్ వీడియో కాల్ చేస్తాడు. మరోవైపు అమర్ లోకి వెళ్లి నిజం తెలుసుకుంటానని అరుంధతి అనగా.. ఆమె ఆత్మను భాగీ తాకడం షాక్‌కు గురి చేస్తుంది.
మనోహరికి రణ్‌వీర్ ఫోన్.. నిజం కనిపెట్టిన అరుంధతి.. ఆత్మను ముట్టుకున్న భాగీ!
NNS 14th August Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 14) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అరుంధతి తల్లిదండ్రుల గురించి చెప్పమని పిల్లలు, తల్లిదండ్రులు, మిస్సమ్మ అందరూ అడగడంతో ఆలోచనలో పడతాడు అమర్. నిజం బయటపడకముందే జాగ్రత్తపడాలి అనుకుంటూ ఎందుకు అందరూ అమర్‌ని ఇబ్బందిపెడుతున్నారు అంటూ అమర్‌ని ఆపుతుంది మనోహరి.
నిజం చెప్పని అమర్
అందరికీ నిజం తెలుసుకోవాలనే ఆత్రం తప్ప ఇంకేంలేదు అంటుంది మిస్సమ్మ. నువ్వు చెప్పు అమర్ అంటాడు శివరామ్. నిన్న ప్రార్థన ఆశ్రమానికి వెళ్లాం కానీ ఏం తెలియలేదు అంటాడు అమర్. నిజం చెప్పనందుకు ఊపిరిపీల్చుకుంటుంది మనోహరి. అదేంటి.. ఏం తెలియలేదా? అని అడుగుతుంది భాగీ.
లేదు.. అరుంధతి సరస్వతి వార్డెన్ దగ్గరకు రావడానికి ముందు చాలా ఆశ్రమాలు మారిందంట. తెలుసుకోవడం కష్టం అన్నారు. ఏదైనా తెలిస్తే నేనే చెబుతాను అంటాడు అమర్. మరేదైనా మార్గం ఉందేమో అంటుంది భాగీ. కష్టమని చెప్పాకదా.. మీరెవ్వరూ ఏ ప్రయత్నాలు చేయకండి. నేనే కనుక్కుంటా అంటూ కార్ తీయమని బయటకు వెళ్లిపోతాడు అమర్.
అమర్‌లోకి వెళ్తానన్న అరుంధతి ఆత్మ
పిల్లలు అందరూ బాధపడుతూ ఉంటారు. టెడ్డీబేర్‌లో నుంచి అరుంధతి వాయిస్ రావట్లేదని బాధపడుతుంది అంజు. అప్పుడే అక్కడకు వచ్చి మిస్సమ్మ ఆ టెడ్డీబేర్‌ని రిపేర్ చేసి ఇస్తుంది. మళ్లీ అరుంధతి వాయిస్ రావడంతో పిల్లలందరూ సంబరపడిపోయి మిస్సమ్మకు థ్యాంక్స్ చెబుతారు. అసలేమై ఉంటుంది, ఆయన ఎందుకు అలా డల్‌గా ఉంటున్నారు అని ఆలోచనలో పడుతుంది అరుంధతి.
నిజంగానే అతనికి ఏం తెలియలేదేమో అంటాడు గుప్త. లేదు గుప్తగారు.. ఆయన అబద్ధం చెప్పారు. ఆయనలోని తడబాటు నాకు అర్థమవుతుంది. ఆ నిజానికి, ఈ ఇంట్లో వారికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది అని గుప్తతో వాదిస్తుంది అరుంధతి. గుప్త ఎంత చెప్పినా వినకుండా తను అనుకున్నదే నిజమని నిరూపిస్తానంటుంది. అరుంధతి ఆలోచన మార్చాలని ఆలోచిస్తున్న గుప్తతో.. అవును గుప్తగారు.. ఈ పౌర్ణమికి ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన మనసులో ఏముందో కనుక్కుంటే సరిపోతుంది కదా అంటుంది. అలా చేయడానికి వీల్లేదంటాడు గుప్త.
మనోహరికి రణ్‌వీర్ ఫోన్
అందరూ అడిగిన విషయాలను తలుచుకుంటూ ఏం చెప్పాలో అర్థం కావట్లేదంటాడు అమర్. నిజం చెప్పేయాల్సింది సార్ అంటాడు రాథోడ్. చెప్పి వాళ్లను బాధపెట్టలేను అంటాడు అమర్. రణ్‌వీర్ తన గురించి నిజం చెప్పకుండా ఎందుకు తను తెలియదని అబద్ధం చెప్పాడని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. ఒకసారి రణ్‌వీర్‌కి కాల్ చేసి మాట్లాడదామా అని మనోహరి అనుకుంటుండగానే రణ్‌వీర్ వీడియో కాల్ చేస్తాడు.
నిన్ను నాశనం చేయడమే నా లక్ష్యం, నిన్ను నా వెంట తీసుకెళ్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఏం చెయ్యాలో అర్థంకాక కంగారు పడుతుంది మనోహరి. ఓవైపు అమర్, భాగీ ఒక్కటైపోతున్నారు, రణ్‌వీర్ నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేయకముందే ఎలాగైనా అమర్‌తో నా మెడలో తాళి కట్టించుకోవాలి అనుకుంటుంది. భాగీని చంపేయడమే తన సమస్యలన్నింటికీ పరిష్కారం అని నిర్ణయించుకుంటుంది.
అరుంధతి ఆత్మను తాకిన భాగీ
అరుంధతి, గుప్త లాన్లో మాట్లాడుకుంటూ ఉండగా భాగీ అటువైపు వస్తుంది. ఆరోజు ఇంట్లో మంగళగౌరీ వ్రతం చేసుకుంటున్నామని, అరుంధతిని కూడా పూజకు రమ్మని ఆహ్వానిస్తుంది. భాగీ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంకాక అయోమయంలో పడుతుంది అరుంధతి. చీర మార్చుకుని వస్తానంటున్నా వినకుండా చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంది భాగీ.
ఊహించని పరిణామంతో షాకవుతుంది అరుంధతి. మిస్సమ్మ ఎలా అరుంధతి ఆత్మను ముట్టుకుంది? అరుంధతి ఆత్మ అనే విషయం భాగీకి తెలియకుండా ఎలా తప్పించుకుంటుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్టు 14న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్