NNS 13th August Episode: రణ్​వీర్​ నిశ్శబ్దంతో వణికిపోతున్న మనోహరి.. అమర్​ని నిలదీసిన పిల్లలు.. ఆలోచనలో అరుంధతి​!-zee telugu serial nindu noorella saavasam today august 13th episode nns serial today episode nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 13th August Episode: రణ్​వీర్​ నిశ్శబ్దంతో వణికిపోతున్న మనోహరి.. అమర్​ని నిలదీసిన పిల్లలు.. ఆలోచనలో అరుంధతి​!

NNS 13th August Episode: రణ్​వీర్​ నిశ్శబ్దంతో వణికిపోతున్న మనోహరి.. అమర్​ని నిలదీసిన పిల్లలు.. ఆలోచనలో అరుంధతి​!

Hari Prasad S HT Telugu
Aug 13, 2024 07:26 AM IST

NNS 13th August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (ఆగస్ట్ 13) ఎపిసోడ్లో రణ్​వీర్​ సైలెంట్ గా ఉండటం చూసి మనోహరి తెగ వణికిపోతుంటుంది. అటు అమర్ ను నిలదీయడానికి పిల్లలు సిద్ధమవుతుండగా.. తన గురించి తెలిసిపోతుందంటూ అరుంధతి ఆలోచనలోపడుతుంది.

రణ్​వీర్​ నిశ్శబ్దంతో వణికిపోతున్న మనోహరి.. అమర్​ని నిలదీసిన పిల్లలు.. ఆలోచనలో అరుంధతి​!
రణ్​వీర్​ నిశ్శబ్దంతో వణికిపోతున్న మనోహరి.. అమర్​ని నిలదీసిన పిల్లలు.. ఆలోచనలో అరుంధతి​!

NNS 13th August Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 13) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అరుంధతి తల్లిదండ్రుల గురించి అమర్​ ఏం చెప్పట్లేదని ఇంట్లో అందరూ ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఎవరూ తమకేం చెప్పట్లేదని ఎందుకు తమవద్ద అందరూ ఏం చెప్పకుండా దాచేస్తున్నారని అనుకుంటారు.

అమర్​కి ఏదో తెలిసే ఉంటుంది నిర్మల, తెలియకపోతే తప్పకుండా తెలియలేదు అని చెప్పేవాడు అంటాడు శివరామ్​. రాథోడ్​ని అడిగినా లాభం లేదు, డాడీ చెయ్యొద్దన్న పని ఎప్పుడూ చేయడు. డాడీనే అడిగి తెలుసుకుందాం అనుకుంటారు పిల్లలు. ఇంట్లో అందరూ ఎలాగైనా అమర్​ని విషయం అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకుంటారు.

వణికిపోతున్న మనోహరి

పరిస్థితులకు అనుకూలంగా ప్లాన్​ మార్చాడు. అమరేంద్ర బలం తెలుసుకుని ఎదురెళ్లి లాభం లేదని ఆయనతో స్నేహం చేస్తున్నాడు అంటాడు ఘోరా. ఆ భాగీని అమర్​కి ఎలా దూరం చేయాలని ఆలోచిస్తుంటే మధ్యలో ఈ రణ్​వీర్​ ఊడిపడ్డాడు. నేను చూసిన రణ్​వీర్​ వేరు. ఈరోజు నేను చూసిన రణ్​వీర్​ వేరు. వాడికున్న ఆవేశంతో నన్ను చూడగానే చంపేస్తాడనుకున్నా. కానీ ఆవేశాన్ని అణుచుకుని మాట్లాడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంటుంది మనోహరి.

నువ్వు చెప్పేది వింటుంటే కావాలనే అలా చేస్తున్నాడనిపిస్తోంది అంటాడు ఘోరా. వాడి ఆవేశం కంటే నిశ్శబ్దం ఇంకా భయంకరంగా ఉందంటుంది మనోహరి. వాడు నన్ను చూసిన చూపులు ఇంకా గుర్తున్నాయి. అరుంధతిని చంపడంతో కథ ముగిసిపోతుందనుకుంటే అక్కడే కథ మొదలవుతుందని అస్సలు అనుకోలేదు అంటుంది.

మనోహరి, ఘోరా ప్లాన్

మన ముగ్గురి కథలు ఒక్కటే మనోహరి. మనం ముగ్గురం కోరుకుంటుంది ఒక్కటే అంటాడు ఘోరా. ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు అంటుంది మనోహరి. నాది కాని ఆత్మ కోసం నేను ఆరాటపడుతున్నాను. నీది కాని జీవితం గురించి నువ్వు ఆశపడుతున్నావు. నువ్వు వద్దంటున్నా నువ్వే కావాలనుకుంటున్నాడు రణ్​వీర్​. మన ముగ్గురం ఒకే దారిలో ప్రయాణిస్తున్నాం.

ఒక్కరం గెలిస్తే మిగిలిన వాళ్లం ఓడిపోవడం ఖాయం. మనం ఒంటరిగా పోరాడితే గెలవలేం. ఒకటిగా పోరాడాలి, అప్పుడే బలం పెరుగుతుంది అంటాడు ఘోరా. సరే అంటుంది మనోహరి. అమరేంద్ర అరుంధతి జన్మరహస్యం ఎవ్వరికీ చెప్పకుండా చూడమంటాడు ఘోరా. అవును వెంటనే వెళ్లి అమర్​ని ఆపాలి అంటూ ఇంటికి బయల్దేరుతుంది మనోహరి.

అమర్‌ను నిలదీయడానికి సిద్ధమైన ఫ్యామిలీ

పిల్లలు, మిస్సమ్మ, అమర్​ తల్లిదండ్రులు అందరూ హాల్లోకి చేరతారు. ఒకరినొకరు చూసుకుని కంగారు పడతారు. ఏంటీ.. అందరూ బిత్తర మొహాలు వేసుకుని చూస్తున్నారు అంటాడు రాథోడ్​. అందరూ నవ్వుతారు. అమర్​ రావడంతో భయంతో వణికిపోతారు. ఈరోజు నిజం బయటపడిపోతుంది. అందరూ నా విషయమే అడుగుతారు అని గుప్తతో అంటుంది అరుంధతి. ఇంట్లో అందరూ నువ్వు అడుగు అంటే నువ్వే అడుగు అంటూ ఉంటారు.

ఎవ్వరూ అడిగే ధైర్యం చేయకపోవడంతో.. అదేం లేదు నాన్నా.. అందరిదీ ఒకటే ప్రశ్న, అందరికీ కావాల్సింది ఒక్కటే సమాధానం. కోడలు తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని వెళ్లిన నువ్వు ఏం తెలుసుకున్నావు? అదే అందరం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటుంది నిర్మల. వార్డెన్​ అరుంధతి కన్నవాళ్ల గురించి చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటాడు అమర్​.

నిజం తెలిస్తే మీరెవ్వరూ తట్టుకోలేరు అనుకుంటాడు. అప్పుడే హడావిడా ఇంటికి వస్తుంది మనోహరి. అమర్​ అందరికీ నిజం చెబుతాడా? మనోహరి అమర్​కి ఏం చెప్పి అరుంధతి గురించి నిజం బయటపడకుండా ఆపుతుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్టు 13న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner