NNS 10th August Episode: మంగళకి మనోహరి వార్నింగ్.. అమర్ ఇంటికి రణ్‌వీర్.. అందరికీ తెలిసిపోయిన మనోహరి నిజస్వరూపం!
10 August 2024, 6:00 IST
- NNS 10th August Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 10) ఎపిసోడ్లో మంగళకి మనోహరి వార్నింగ్ ఇస్తుంది. అటు అమర్ ఇంటికి రణ్‌వీర్ రావడంతో మనోహరి నిజ స్వరూపం గురించి అందరికీ తెలిసిపోనుంది.
మంగళకి మనోహరి వార్నింగ్.. అమర్ ఇంటికి రణ్‌వీర్.. అందరికీ తెలిసిపోయిన మనోహరి నిజస్వరూపం!
NNS 10th August Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 10) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అరుంధతి తల్లిదండ్రుల గురించి తెలుసుకున్న అమర్ దిగులుగా ఇంటికి వస్తాడు. చిత్రగుప్తతో తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని ఉందని చెబుతున్న అరుంధతి.. అమర్‌ని చూసి పరిగెత్తుకుని వెళ్లి ఏమైందండి.. మా అమ్మానాన్నలు ఎవరో తెలిసిందా? అని అడుగుతుంది. అమర్ ఏం మాట్లాడకుండా ముభావంగా ఉండటం చూసి ఏమైంది రాథోడ్ అని అడుగుతుంది అరుంధతి.
నోరు మెదపని అమర్
రాథోడ్ ఏడుస్తుండటంతో ఏదో జరిగింది.. వీళ్లు నా తల్లిదండ్రుల గురించి ఏదో తెలుసుకున్నారు. ఎలాగూ అత్తయ్య, మామయ్యలకి ఆయన చెబుతారు కదా అప్పుడు వింటాను అని ఇంట్లోకి పరిగెడుతుంది అరుంధతి. కానీ నిర్మల, శివరామ్ వచ్చి ఏమైందని అడిగినా ఏం మాట్లాడకుండా లోపలకు వెళ్లిపోతాడు అమర్. రాథోడ్ కూడా ఏం చెప్పకపోవడంతో వాళ్లకి అనుమానం వస్తుంది.
ఏదో జరిగే ఉంటుంది అందుకే వీళ్లు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటుంది నిర్మల. రాథోడ్.. ఏమైంది అంటూ పరిగెడుతుంది అరుంధతి. ఏమైంది గుప్తగారు.. వీళ్లు ఎందుకు ఏం మాట్లాడటం లేదు అని అడుగుతుంది. అంతా లలాట లిఖితం అంటాడు చిత్రగుప్త.
మంగళకు మనోహరి వార్నింగ్
మంగళ మనోహరికి ఫోన్ చేసి అమర్‌కి నిజం తెలిసిపోయిందని చెబుతుంది. అది విని షాకైన మనోహరి కోపంతో అరుస్తుంది. అమరేంద్ర మాత్రమే ముప్పనుకోకు.. భాగీ గురించి నీకు పూర్తిగా తెలియదు. అది చాలా మొండిది. ఇప్పుడుగానీ దానికి నువ్వు చంపింది వాళ్ల అక్కనే అని తెలిసిందంటే అది నిన్ను చంపేవరకు ఆగదు అని హెచ్చరిస్తుంది మంగళ. అన్నీ వదిలిపెట్టి దూరంగా వెళ్లిపొమ్మని సలహా ఇస్తుంది.
కానీ అది వినకుండా అది నా ఇల్లు, అమర్ నా భర్త, అది నా జీవితం.. అక్కాచెల్లెళ్లు వచ్చి నా జీవితాన్ని తన్నుకుపోతానంటే ఊరుకుంటానా? నాకు ఎవ్వరు ఎదురొస్తే వాళ్లను చంపేస్తాను. సమాచారం కోసమే నీకు డబ్బులిస్తున్నాను, సలహాలు ఇవ్వడానికి కాదు అంటూ అరిచి ఫోన్ పెట్టేస్తుంది మనోహరి. భార్య చెల్లెలని ఆ భాగీ మీద అమర్‌కి ప్రేమ పుడితే.. నో.. అమర్ నీడని విడిచిన మరుక్షణం నా చావు నాకు దగ్గరవుతుంది. వెంటనే వాళ్లను విడగొడతాను. అందరూ మర్చిపోయిన మనోహరిని వాళ్లకి గుర్తు చేస్తానంటూ ఇంటికి వెళ్తుంది మనోహరి.
భాగీకి ముఖం చాటేసిన అమర్
వార్డెన్ చెప్పిన మాటల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు అమర్. అప్పుడే ఇంటికి వచ్చిన భాగీ అందరూ ఇంట్లోనే ఉన్నా అక్క వాళ్ల అమ్మానాన్న గురించి ఏం చర్చించట్లేదేంటి అనుకుంటూ అమర్ దగ్గరకు వెళ్తుంది. డోర్ లాక్ చేసి ఉండటంతో అమర్‌ని పిలుస్తుంది. నీ ముందుకు రాలేను భాగీ.. నువ్వు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉన్నా చెప్పలేను. మీరు ఎదురు చూస్తున్న కల ఎప్పటికీ మీ ముందుకు రాదని చెప్పలేను. చావుపుట్టుకలు మీ అక్కను మీనుంచి దూరం చేశాయని చెప్పలేను అంటూ అమర్ వెళ్లి డోర్ తీయకుండా బాధపడతాడు.
మిస్సమ్మ మాట విని ఏమైందమ్మా అని అడుగుతాడు శివరామ్. ఏంలేదు మామయ్య ఆయన డోర్ వేసుకున్నాడు. ఆరు అక్క అమ్మానాన్నల గురించి ఏమైనా తెలిసిందేమో అడుగుదామంటే ఆయన డోర్ వేసుకున్నారు అంటుంది భాగీ. ఏమోనమ్మా.. ఇంటికి వచ్చినప్పటి నుంచీ అలాగే ఉన్నాడు. అమర్‌ని అంతగా బాధపెట్టే నిజం ఏంటో తెలియట్లేదు. రేపు పొద్దున మాట్లాడుకుందాంలే అంటాడు శివరామ్.
అమర్ ఇంటికి రణ్‌వీర్
సరే మామయ్య.. ఇవాళ్టికి నేను ఆ రూమ్‌లో పడుకుంటానంటూ వెళ్లబోతుంది మిస్సమ్మ. కానీ అమర్ డోర్ దగ్గర ఉన్నాడనిపించి డోర్ దగ్గరకు వచ్చి.. మీరు అటువైపు ఉన్నారని నాకు తెలుసండీ.. మీరు తెలుసుకున్న నిజం ఏంటో నాకు తెలియదు. కానీ జరిగినదాన్ని మార్చలేం. జరగబోయేది జరగక మానదు. ప్లీజ్ అండీ.. ఎక్కువగా ఆలోచించకుండా పడుకోండి అని చెప్పి వెళ్లిపోతుంది.
అమర్ ఇంటికి వచ్చిన రణ్‌వీర్‌ని చూసి షాకవుతుంది అరుంధతి. గుప్తని పిలిచి మనోహరి భర్త అని రణ్‌వీర్‌ని చూపిస్తుంది. ఆయన ఉండగా నేరుగా ఇంట్లోకి వచ్చేస్తున్నారేంటి అని కంగారు పడుతుంది అరుంధతి. రణ్‌వీర్ అమర్‌కి నిజం చెబుతాడా? మనోహరి రణ్‌వీర్ భార్య అని అమర్‌కి తెలుస్తుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్టు 10న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్