NNS 10th April Episode: అమర్ చేతికి నకిలీ నగలు.. రామ్మూర్తి ఇంటికి వెళ్లిన మనోహరికి షాక్
10 April 2024, 10:36 IST
- NNS 10th April Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (ఏప్రిల్ 10) ఎపిసోడ్లో అమర్ చేతికి నకిలీ నగలు వస్తాయి. అటు రామ్మూర్తి ఇంటికి వెళ్లిన మనోహరికి షాక్ తగులుతుంది.
అమర్ చేతికి నకిలీ నగలు.. రామ్మూర్తి ఇంటికి వెళ్లిన మనోహరికి షాక్
NNS 10th April Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఏప్రిల్ 10) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. హంతకుడు మనోహరికి ఫోన్ చేసి.. డూప్లికేట్ నగలు ఇస్తావా? అంటూ వార్నింగ్ ఇస్తాడు. దాంతో మనోహరి షాక్ అవుతుంది. మళ్లీ ఇంట్లోకి వెళ్లి నగలు చెక్ చేస్తుంది. నా దగ్గర ఉన్నవి కూడా డూప్లికేట్ నగలేనని చెప్పడంతో నాతోనే నాటకాలు ఆడుతున్నావా? అంటూ రేపు పొద్దున వరకు మీకు టైం ఇస్తున్నా లేదంటే అమర్‌కు నిజం చెప్తానని ఫోన్ కట్ చేస్తాడు డ్రైవర్.
మనోహరి చేతికి నగల బ్యాగ్
రాథోడ్, మిస్సమ్మ నగల బ్యాగ్ గురించి మాట్లాడుకుంటుంటే నిర్మల వస్తుంది. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు అంటూ అడగ్గానే అమర్ సార్ బ్యాగ్ ఇచ్చారని చెప్పడంతో.. అవి అరుంధతి నగలు నీకిచ్చాడా? అయితే నగలు సేఫ్‌గానే ఉంటాయి అని నిర్మల అనడంతో రాథోడ్, మిస్సమ్మ షాక్ అవుతారు. వెంటనే బయటకు వెళ్లిపోతారు. రాథోడ్ గారు మనం ఇంటికి వెళ్లేసరికి లేట్ అవుతుంది. ముందు నాన్నకు ఫోన్ చేసి మనోహరికి బ్యాగ్ ఇవ్వొద్దని చెబితే సరిపోతుంది అంటూ మిస్సమ్మ వాళ్ల నాన్నకు ఫోన్ చేస్తుంది.
నేను నీకిచ్చిన బ్యాగ్ మనోహరికి ఇవ్వకండి. నేను ఇప్పుడే వస్తున్నా.. అని చెబుతుంది మిస్సమ్మ. ఇప్పుడే వచ్చి బ్యాగ్ తీసుకెళ్లిపోయిందమ్మా! అని చెబుతాడు రామ్మూర్తి. బ్యాగ్ మనోహరికి ఇచ్చేశారా? అంటుంది మిస్సమ్మ. ఏమ్మా ఏదైనా సమస్యా? అని అడుగుతాడు రామ్మూర్తి. ఏం లేదు నాన్న మనోహరి ఇంట్లోనే ఉందా? బ్యాగ్ దగ్గరలోనే ఉందా? అని అడుగుతుంది మిస్సమ్మ.
మంగళ ఒంటిపై నగలు
లేదమ్మా తీసుకెళ్లి చాలాసేపు అయ్యింది అనగానే మనోహరి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందో చెప్పు నాన్న అంటూ మిస్సమ్మ అడగ్గానే జరిగింది మొత్తం చెప్పగానే సరే నాన్న మళ్లీ చేస్తాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది. మనోహరి జువెలరీ షాప్‌కు వెళ్తుంది. మనోహరిని ఫాలో అవుతూ మిస్సమ్మ, రాథోడ్ షాపుకు వస్తారు. మనోహరి కోపంగా షాపు ఓనరును రెండూ డూప్లికేట్ నగలు ఇచ్చావేంటి అంటూ నిలదీయగానే మూడో సెట్టు చెక్ చేసుకోవాల్సింది అంటూ ఓనరు చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది.
మూడో సెట్టు ఏంటి అని మనోహరి అడుగుతుంది. నిన్న ఒకావిడ వచ్చి మీరు చెప్పారని మూడో సెట్టు చేయమని చెప్పిందని ఓనరు అనగానే మనోహరి తన ఫోన్‌లో నీల, మిస్సమ్మ ఫోటో చూపించి వీళ్లేనా అని అడుగుతుంది. కాదని ఓనరు చెప్తాడు. మరోవైపు మంగళ నగలు వేసుకుని నేనే అది నేనే అంటూ పాట పాడుతుంది. ఇంతలో మూర్తి వస్తాడు. మంగళ.. మంగళ డోర్ కూడా తెరచి ఉంది. ఇది ఎక్కడుందబ్బా? అంటాడు రామ్మూర్తి. ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నాను అంటుంది మంగళ.
ఎక్కడున్నావే మాట వినిపిస్తుంది మనిషివి కనిపిస్తలేవు? అంటాడు రామ్మూర్తి. ఇక్కడున్నానండి.. ఇక్కడ అంటుంది మంగళ. అక్కడేం చేస్తున్నావే? బయటకు రా? అని మూర్తి అనగానే మంగళ రాలేనని చెప్పగానే సరేలే రోడ్డు మీద వస్తుంటే ఉంగరం ఒకటి దొరికింది. నువ్వు రావడం లేదుగా భాగీకి ఇస్తానులే అనగానే మంగళ పరుగెత్తుకొస్తుంది.
దీంతో మంగళ ఒంటిమీద నగలు చూసి మూర్తి ఎక్కడివి అని నిలదీస్తాడు. ఇంతలో గిల్టీ నగలు వేసుకుని ఏం ఫోజుకొడుతున్నావు అంటూ వెళ్లిపోతాడు. రాథోడ్, మిస్సమ్మ ఇంటికి వచ్చి ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఆ ఒరిజినల్ నగలు ఎవరు తీసుకెళ్లినట్లు మిస్సమ్మ. మనోహరి అమ్మగారు ఆ నగలు ఎవరికి ఇస్తుంది. అసలేం జరుగుతుందో ఎవరేం చేస్తున్నారో అంటాడు రాథోడ్.
రామ్మూర్తి ఇంటికి మనోహరి
ఒక్కటి మాత్రం క్లారిటీగా ఉంది. మనోహరి ప్లాన్ ఎవరికో తెలుసు? వాళ్లు మనోహరికి కూడా తెలియకుండా నగలు తీసేసుకున్నారు. మనం ముందు ఆ నగలు ఎక్కడున్నాయో కనిపెట్టాలి అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే అమర్ వస్తాడు. రేపు పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్లావు అంటూ నిర్మల అడగ్గానే తాను మనఃస్ఫూర్తిగా చేసుకోవడం లేదని, ఏదో పెళ్లి తంతులాగా ముగిస్తే సరిపోతుంది అని అమర్ అంటాడు. నీకైతే రెండో సారి పెళ్లి కానీ మనోహరికి ఇదే మొదటి పెళ్లి కదా గ్రాండ్ గా చేస్తే బాగుంటుంది అని నిర్మల అంటుంది.
మిస్సమ్మ కూడా అదీ నిజమేనని చెప్పి మేడం నగలు తాళిబొట్టు తీసుకొచ్చి ఫోటో దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుందని చెప్పగానే అమర్ సరేనంటాడు. మనోహరికి ఫోన్ చేసి నగలు తీసుకుని ఇంటికి రమ్మని చెప్తాడు. దీంతో భయంగా మనోహరి సరే అంటుంది. తర్వాత మూర్తి ఇంటికి వెళ్తుంది మనోహరి. అసలు నీ పెళ్లి రేపు అవుతుందా? అని మూర్తి అడగ్గానే మనోహరి షాక్ అవుతుంది. మనోహరి మోసం ఎలా బయటపడుతుంది? నగల దొంగతనాన్ని మనోహరి ఎవరి మీద వేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఏప్రిల్ 10న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్