తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Priyanka Chopra:2005లోనే షూటింగ్ కంప్లీట్ - అయినా రిలీజ్ కానీ ప్రియాంక చోప్రా స్ట్రెయిట్ తెలుగు మూవీ ఏదో తెలుసా?

Priyanka Chopra:2005లోనే షూటింగ్ కంప్లీట్ - అయినా రిలీజ్ కానీ ప్రియాంక చోప్రా స్ట్రెయిట్ తెలుగు మూవీ ఏదో తెలుసా?

14 February 2024, 5:53 IST

  • Priyanka Chopra: రామ్‌చ‌ర‌ణ్ తుఫాన్ కంటే ముందు ప్రియాంక చోప్రా తెలుగులో అపురూపం పేరుతో ఓ సినిమా చేసింది. 2005లోనే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యినా ఈ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు.

ప్రియాంక చోప్రా తెలుగు మూవీ
ప్రియాంక చోప్రా తెలుగు మూవీ

ప్రియాంక చోప్రా తెలుగు మూవీ

Priyanka Chopra Telugu Movie Apuroopam: రామ్‌చ‌ర‌ణ్ తుఫాన్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2013లో తెలుగు, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ కంటే ఎనిమిదేళ్ల ముందుగానే ప్రియాంక చోప్రా తెలుగులో ఓ మూవీ చేసింది. షూటింగ్ పూర్త‌యిన ఆ సినిమా మాత్రం ఇప్ప‌టికీ రిలీజ్ కాలేదు.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. స్క్రిప్ట్, టైటిల్ ఫిక్స్ అయినా పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

అపురూపం...

ప్రియాంక చోప్రా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్ల‌లో అపురూపం పేరుతో తెలుగులో ఓ మూవీని అంగీక‌రించింది. ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు శ‌శిర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మ‌ధుక‌ర్ అనే కొత్త న‌టుడు హీరోగా న‌టించాడు. ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా షూటింగ్‌లోనే అపురూపం మూవీకి అనేక అవాంత‌రాలు ఎదుర‌య్యాయి. ఎలాగోలా క‌ష్ట‌ప‌డి ప్రొడ్యూస‌ర్స్ షూటింగ్ పూర్తిచేశారు. పాట‌ల‌ను రిలీజ్ చేశారు.

చ‌క్రి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి సాహిత్యం అందించారు. పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కానీ అనుకోని కార‌ణాల వ‌ల్ల అపురూపం మూవీ మాత్రం రిలీజ్ కాలేదు. డెబ్యూ మూవీనే డిస‌పాయింట్ చేయ‌డంతో టాలీవుడ్‌పై ఆశ‌లు వ‌దులుకున్న ప్రియాంక చోప్రా బాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్టింది. అయితే ఇప్ప‌టికీ అపురూపం పాట‌లు యూట్యూబ్‌లో క‌నిపిస్తుంటాయి. ఈ పోస్ట‌ర్స్‌లో చాలా వ‌ర‌కు లంగా వోణీలో తెలుగు అమ్మాయిగా ప్రియాంక చోప్రా క‌నిపిస్తుంటుంది. ఈ పోస్ట‌ర్స్ అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి.

ప్రియాంక కెరీర్‌లో ఒకే ఒక్క మూవీ...

ప్రియాంక బాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ స్టార్‌గా మారిన త‌ర్వాత అపురూపం సినిమాను రిలీజ్ చేయాల‌ని ప్రొడ్యూస‌ర్స్ అనుకున్నారు. కానీ ఆ ప్ర‌య‌త్నాలు కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. దాంతో ప్రియాంక ఫ‌స్ట్ తెలుగు మూవీ అన్ రిలీజ్‌డ్ సినిమాల‌ లిస్ట్‌లో చేరిపోయింది. ప్రియాంక చోప్రా కెరీర్‌లో షూటింగ్ పూర్త‌యిన రిలీజ్ కానీ ఒకే ఒక మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

హాలీవుడ్ మూవీస్‌...

పాప్ సింగ‌ర్‌, అమెరిక‌న్ న‌టుడు నిక్ జోన‌స్‌ను పెళ్లాడిన ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు షిప్ట్ అయ్యింది. ది స్కై ఈజ్ పింక్‌, ల‌వ్ ఎగైన్‌, వీ కెన్ బీ హీరోస్‌తో పాటు హాలీవుడ్‌లో చాలా సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో హెడ్స్ ఆఫ్ స్టేట్ మూవీ చేస్తోంది ప్రియాంక చోప్రా. ఈ సినిమాలో గోల్డెన్ గ్లోబ్ విన్న‌ర్ ఇద్రీస్ ఎల్బా తో పాటు డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ ఈ స్టార్ జాన్ సెనా హీరోలుగా న‌టిస్తోన్నారు.

గ‌త ఏడాది సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో ప్రియాంక‌ గూఢ‌చారిగా యాక్ష‌న్ ఓరియెంటెడ్ రోల్ చేసింది. ప్రియాంక చోప్రా సిటాడెల్ సిరీస్‌ను హిందీలో స‌మంత రీమేక్ చేస్తోంది. ప్రొడ్యూస‌ర్‌గా కూడా 2020లో హాలీవుడ్‌లో ఈవిల్ ఐ అనే మూవీని నిర్మించింది ప్రియాంక చోప్రా. 2016లో రిలీజైన జై గంగాజ‌ల్ త‌ర్వాత ప్రియాంక చోప్రా మ‌ళ్లీ బాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌లేదు. హిందీ ఇండ‌స్ట్రీలోకి ప్రియాంక రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. కానీ అవి పుకార్లుగానే మిగిలిపోయాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం