తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Klin Kaara : రామ్ చరణ్-ఉపాసన కూతురికి క్లిన్ కారా అని పేరు పెట్టింది ఎవరు?

Klin Kaara : రామ్ చరణ్-ఉపాసన కూతురికి క్లిన్ కారా అని పేరు పెట్టింది ఎవరు?

Anand Sai HT Telugu

02 July 2023, 6:14 IST

google News
    • Ram Charan-Upasana : ఇటీవల రామ్ చరణ్-ఉపాసనకు కూతురు పుట్టింది. ఆమెకు క్లిన్ కారా అని నామకారణం చేశారు. ఈ పేరు గురించి అభిమానులు తెగ సెర్చ్ చేశారు. అయితే పాపకు ఈ పేరు పెట్టాలని సూచించింది ఎవరో తెలుసా?
క్లిన్ కారా పేరు పెట్టింది ఎవరు?
క్లిన్ కారా పేరు పెట్టింది ఎవరు? (Instagram)

క్లిన్ కారా పేరు పెట్టింది ఎవరు?

రామ్ చరణ్-ఉపాసన(Ram Charan Upasana) ఇటీవల తల్లిదండ్రులు అయ్యారు. కొద్ది రోజుల క్రితం ఈ దంపతులకు అందమైన పాప పుట్టింది. జూన్ 30న ఊయల వేడుక, నామకరణం అంగరంగ వైభవంగా జరిగింది. పాపకు క్లిన్ కారా(Klin Kaara) అని పేరు పెట్టారు. ఈ ప్రత్యేకమైన పేరుపై సోషల్ మీడియాలో మిశ్రమ అభిప్రాయాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ చిన్నారికి ఈ పేరు పెట్టింది ఎవరు?

కొన్ని రోజులుగా ఈ పేరును సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఇటు రామ్ చరణ్ అభిమానులు అయితే.. క్లిన్ కారా పేరు కొత్తగా ఉందని సంబరపడిపోతున్నారు. అసలు రామ్ చరణ్-ఉపాసన కుమార్తెకు ఉపాసన తల్లి శోభనా కామినేని క్లిన్ కారా అని పేరు పెట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన శోభనా కామినేని ఇన్‌స్టాగ్రామ్‌లో దీని గురించి ఇలా రాశారు.

'ఉపాసన నువ్ పుట్టినప్పుడు నేను నీకు క్లిన్ కారా అని పేరు పెట్టాలనుకున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. రామ్ చరణ్-ఉపాసన అభినందనలు. మీ ప్రేమ నుండి మీకు పరిపూర్ణమైన బిడ్డ వచ్చింది. ఆ బిడ్డ మన భవిష్యత్తును మార్చే శక్తి. మేం నిన్ను ప్రేమిస్తున్నాం కారా.' అని నామకారణం రోజు కొన్ని చిత్రాలను పంచుకున్నారు శోభనా. ఈ పోస్ట్‌పై స్పందించిన ఉపాసన, ధన్యవాదాలు అమ్మ అని రిప్లై ఇచ్చారు. జూన్ 30న నామకరణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ తల్లిదండ్రులు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), సురేఖ కొణిదెల, మరికొందరు సన్నిహితులు పాల్గొన్నారు.

క్లిన్ కారా ఫారిన్ పేరు లాగా ఉంది కానీ పేరు వెనుక ఒక ప్రత్యేకత ఉంది. క్లిన్ కారా పేరు లలితా సహస్రనామం నుండి తీసుకున్నారు. క్లిన్ కారా అనే పేరు ఆధ్యాత్మిక మేల్కొలుపును తీసుకువచ్చే పరివర్తన, శుద్ధి చేసే శక్తిని సూచిస్తుందని చెబుతున్నారు. 'క్లీంకారి' అనే పేరు లలితా సహస్రనామంలోని 125వ పాదంలో వచ్చింది. దాని నుండి రామ్ చరణ్-ఉపాసన కుమార్తెకు క్లిన్ కారా అని పేరు పెట్టారు. అయితే ఉపాసనకు తన తల్లి శోభానా పెట్టాలనుకున్న పేరు.. ఇప్పుడు పాపకు పెట్టారు.

రామ్ చరణ్-ఉపాసన జూన్ 2012 లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు. కొణిదెల వారసురాలు రావడంతో ఇటు మెగా ఫ్యామిలీలో, అటు మెగా అభిమానుల్లో జోష్ పెరిగింది. జూన్ 20వ తేదీన రామ్ చరణ్, ఉపాసనలకు కూతురు పుట్టిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో ఉపాసన ప్రసవించింది. తాను తాతగా మారిన ఆనందంలో అదే రోజు చిరంజీవి ఫుల్ ఖుషీగా హాస్పిటల్ కు వచ్చాడు. ఇతర మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా ఆ పాపను చూసి మురిసిపోయారు. పాప తనలాగే ఉందని డిశ్చార్జ్ రోజు మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ చెప్పాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం