Ram Charan Upasana:మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ramcharan) తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆయన భార్య ఉపాసన(Upasana) మంగళవారం ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఉద్దరు క్షేమంగా ఉన్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ఓ ప్రకటనను రిలీజ్ చేశాయి.
రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు తల్లిదండ్రులుగా మారడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. సోమవారం ఉపాసన హాస్పిటల్‌లో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. డెలివరీ కోసమే ఆమె హాస్పిటల్‌లో చేరినట్లు ప్రచారం మొదలైంది. ఆమె వెంట రామ్‌చరణ్‌తో పాటు శోభన కామినేని, సురేఖ కొణిదెల కనిపించారు.
డెలివరీ వార్తలను నిజం చేస్తూ మంగళవారం ఉదయం గుడ్‌న్యూస్ వినిపించారు. రామ్‌చరణ్ ఉపాసన 2012లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత తల్లిదండ్రులుగా మారారు. తన ప్రెగ్నెన్సీని గత ఏడాది ఉపాసన ప్రకటించింది.
ఈ రోజు ఉదయం ఏడు గంటలకు మెగా ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కామినేని కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రిని సందర్శించనున్నట్లు తెలిసింది. తమ కుటుంబంలోకి అడుగుపెట్టిన కొత్త ఫ్యామిలీ మెంబర్‌ను ఆశీర్వదించబోతున్నట్లు సమాచారం.తల్లిదండ్రులుగా మారిన రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. మెగా ఫ్యామిలీలోకి ప్రిన్సెస్ వచ్చిందని ఫ్యాన్స్ ఆనందపడుతోన్నారు.
టాపిక్