Vikrant Rona OTT Release date: విక్రాంత్ రోణ తెలుగు వెర్షన్ ఓటీటీలో ఎప్పుడొస్తుందంటే?
01 September 2022, 22:45 IST
- Vikrant Rona Telugu OTT Release date: కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోణ తెలుగు వెర్షన్ ఓటీటీ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా రిలీజ్ చేయనున్నారు.
విక్రాంత్ రోణ
Vikrant Rona Telugu OTT Release date: కన్నడ హీరో, ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్ నటించిన పాన్ఇండియా చిత్రం విక్రాంత్ రోణ. ఈ సినిమా జులైలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో రక్కమ్మ అనే సాంగ్ సూపర్ సక్సెస్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే కన్నడ వెర్షన్‌ను సెప్టెంబరు 2వ తేదీన జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే తెలుగు వెర్షన్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.
ఓటీటీలో విక్రాంత్ రోణ తెలుగు వెర్షన్‌ను సెప్టెంబరు 16న విడుదల చేయనుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కన్నడ వెర్షన్ సెప్టెంబరు 2 నుంచి జీ5లో ప్రసారం కానుండగా.. తెలుగులో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ నెల 16 నుంచి రానుంది.
ఈ సినిమా కథ కొమరట్టు అనే గ్రామంలో జరుగుతుంది. ఆ ఊరిలోని ఓ పాడుబడ్డ ఇంట్లో బ్రహ్మరాక్షసుడు ఒకడు ఉంటున్నాడనేది అక్కడ ప్రజలు నమ్ముతుంటారు. ఆ ఇంటి ఆవరణలో ఉన్న బావిలో ఓ రోజు ఆ ఊరి ఇన్‌స్పెక్టర్ శవం దొరుకుతుంది. ఆ హత్య కేసు ఛేదించి, నేరస్థులను పట్టుకోవడం కోసం విక్రాంత్ రోణ రంగంలోకి దిగుతాడు. అప్పటికే ఆ ఊరిలో పదుల సంఖ్యలోపిల్లలు హత్యకు గురవుతున్నట్లు తెలుసుకంటారు. మరి వాళ్ల మరణాలకు, పోలీస్ హత్యకు ఉన్న సంబంధమేంటి? ఈ కేసులో విక్రాంత్ విజయం సాధించాడా? ఆ బ్రహ్మరాక్షసుడు ఎవరు లాంటి ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాను జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 3డీలో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ సినిమాను షాలినీ జాక్ మంజూ, అలంకార్ పాండ్యన్ నిర్మించారు. నిరూప్ భండారి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.
టాపిక్