Vikranth Rona Collections: వంద కోట్ల క్లబ్‌లో విక్రాంత్ రోణ - నాలుగు రోజుల్లోనే ఈ ఘనత సొంతం
కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హీరోగా అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన విక్రాంత్ రోణ ( Vikranth Rona)చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఎంతంటే....
Vikranth Rona Collections : ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దక్షిణాది సినిమాల హవా కొనసాగుతోంది. ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ -2 సినిమాలు వందల కోట్ల వసూళ్లను రాబట్టి చరిత్రను సృష్టించాయి. ఈ విజయపరంపరను విక్రాంత్ రోణ కొనసాగిస్తోంది. సుదీప్ హీరోగా ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 116 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. తొలిరోజు 35 కోట్ల ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. రెండో రోజు 27, మూడో రోజు 25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
ఈ వారం మిగిలిన సినిమాలకు యావరేజ్ టాక్ రావడంతో నాలుగో రోజు ఆదివారం వసూళ్లు గణనీయంగా పెరిగాయి. దాదాపు 29 కోట్ల కలెక్షన్స్ సాధించింది. మొత్తంగా నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 116 కోట్ల వసూళ్లను సాధించి ఈ ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. సుదీప్ కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమా ఇదే కావడం గమనార్హం.
తెలుగులో స్టేట్స్ లో మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌గా నిలిచినట్లు సమాచారం. హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా వసూళ్లు నిలకడగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మర్డర్ మిస్టరీ పాయింట్‌కు గ్రాఫిక్స్ ను జోడించి దర్శకుడు అనూప్ భండారీ ఈ సినిమాను తెరకెక్కించాడు. దాదాపు మూడు వందల కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమాలో నిరూప్ భండారీ, నీతా అశోక్ కీలక పాత్రల్లో నటించారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రత్యేక గీతంలో నటించింది.
టాపిక్