OTT Action Thriller: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్
12 July 2024, 15:37 IST
- Action Thriller OTT: తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మహారాజ ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. నెలలోగానే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Thriller OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్
తమిళ స్టార్ నటుడు, మక్కల్ సెల్వన్ ప్రధాన పాత్ర పోషించిన ‘మహారాజ’ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. ట్విస్టులతో, ఆకట్టుకునే స్క్రీన్‍ప్లేతో మెప్పించారు. హీరోగా సేతుపతికి ఇది 50వ సినిమా. జూన్ 14వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్‍బస్టర్ అయింది. అంచనాలను నిలబెట్టుకుంది. మహారాజ మూవీ నేడు (జూలై 12) ఓటీటీలోకి అడుగుపెట్టింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
మహారాజ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా నేడు వచ్చేసింది. థియేటర్లలో తమిళం, తెలుగులోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల వెర్షన్‍ల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
మహారాజ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కమర్షియల్‍గానూ మంచి సక్సెస్ అయింది. దీంతో ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి వ్యూస్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఐదు భాషల్లో రావడం కూడా ప్లస్‍గా ఉంది. సూపర్ హిట్ అయినా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది.
మహారాజ మూవీ నిథిలన్ స్వామినాథన్ డైరెక్షన్, స్కీన్‍ప్లే మెప్పించాయి. మహారాజ పాత్రలో విజయ్ సేతుపతి యాక్టింగ్ ఈ మూవీకి హైలైట్‍గా నిలిచింది. మొత్తంగా యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను దక్కించుకుంది.
కలెక్షన్లు ఇలా..
మహారాజ చిత్రానికి రూ.113 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఈ మూవీ కొన్ని థియేటర్లలో ఉంది. సుమారు రూ.20కోట్ల బడ్జెట్‍తోనే ఈ చిత్రం రూపొందింది. రూ.110కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది.
మహారాజ చిత్రంలో విజయ్ సేతుపతి టైటిల్ రోల్ చేయగా.. బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి, అరుల్‍దాస్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ థింక్ బ్యానర్లపై సుధాన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేశారు. అజ్నీశ్ లోకనాథ్ మ్యూజిక్ ఇచ్చారు.
నేరుగా ‘వైల్డ్ వైల్డ్ పంజాబ్’
వైల్డ్ వైల్డ్ పంజాబ్ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 11నే ఈ కామెడీ డ్రామా మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్ భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రంలో వరుణ్ శర్మ, సన్నీ సింగ్, మన్‍జోత్ సింగ్, జెస్సీ గిల్, పత్రలేఖ, ఇషితా రాజా రాజేశ్ శర్మ, గోపాల్ దత్ ప్రధాన పాత్రలు పోషించారు. వైల్డ్ వైల్డ్ పంజాబ్ మూవీకి సిమ్రన్‍ప్రీత్ దర్శకత్వం వహించారు. ప్రేయసితో విడిపోయిన స్నేహితుడు ఆ బాధ నుంచి బయటికి వచ్చేందుకు స్నేహితులు చేసే రోడ్ ట్రిప్ చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది.
టాపిక్