OTT Comedy Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు-hindi comedy movie wild wild punjab to stream on netflix ott from july 10 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

OTT Comedy Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 24, 2024 02:59 PM IST

Wild Wild Punjab OTT Release Date: వైల్డ్ వైల్డ్ పంజాబ్ సినిమా ఓటీటీలోకి నేరుగా అడుగుపెట్టనుంది. ఫ్రెండ్స్ గ్యాంగ్ మధ్య కామెడీ మూవీగా రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.

OTT Comedy Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు
OTT Comedy Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

OTT Comedy Movie: వైల్డ్ వైల్డ్ పంజాబ్ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోనే అడుగుపెట్టనుంది. వరుణ్ శర్మ, సన్నీ సింగ్, మనోజ్ సింగ్, జెస్సీ గిల్, పత్రలేఖ, ఇషితా రాజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కామెడీ డ్రామాగా ఈ మూవీని డైరెక్టర్ సిమ్రన్‍ప్రీత్ సింగ్ తెరకెక్కించారు. వైల్డ్ వైల్డ్ పంజాబ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

వైల్డ్ వైల్డ్ పంజాబ్ సినిమా జూలై 10వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. ఓ కొత్త పోస్టర్ తీసుకొచ్చింది. పూలతో అలంకరించిన ఓ కారు వద్ద ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నట్టు ఈ పోస్టర్ ఉంది. పత్రలేఖ ట్రెడిషనల్ డ్రెస్‍లో ఉన్నారు.

వైల్డ్ వైల్డ్ పంజాబ్ మూవీలో వరుణ్ శర్మ, సన్నీ సింగ్, మన్ జ్యోత్ సింగ్, జెస్సీ గిల్ కలిసి పఠాన్‍కోట్‍కు ట్రిప్‍కు వెళుతారన్నట్టుగా ఈ కొత్త పోస్టర్లో మేకర్స్ హింట్ ఇచ్చారు. పూలతో అలంకరించిన ఆ కారులోనే జర్నీ ఉంటుందని అర్థమవుతోంది. లవ్ రంజన్ ఈమూవీకి కథ అందించగా.. సిమ్రన్‍ప్రీత్ దర్శకత్వం వహించారు.

స్టోరీ లైన్

బ్రేకప్ అయిన ఫ్రెండ్‍‍ను ఆ బాధ నుంచి బయటికి తీసుకొచ్చేందుకు ఓ ట్రిప్‍కు స్నేహితులు కలిసి వెళ్లడం చుట్టూ వైల్డ్ వైల్డ్ పంజాబ్ మూవీ స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. ఖన్నే (వరుణ్ శర్మ)కు తన ప్రేయసితో బ్రేక్ అవుతుంది. దీంతో అతడి స్నేహితులు ఆరోర్ (సన్నీ సింగ్), జైనూ (జెస్సీ గిల్), హనీ పాజీ (మన్‍జ్యోత్ సింగ్) అతడిని ఓదారుస్తారు. ఆ అమ్మాయిని మరిచిపోవాలని ఖన్నేకు చెబుతారు. అయినా అతడు బాధగానే ఉంటాడు. దీంతో ఫ్రెండ్స్ అందరూ కలిసి ట్రిప్‍ ప్లాన్ చేస్తారు. ఖన్నేను సంతోషపరచాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఈ ప్రయాణం ఎలా సాగింది.. అనే విషయాలు ఈ చిత్రంలో చూడాలి . నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 10 నుంచి ఈ చిత్రాన్ని చూడొచ్చు.

దుమ్మురేపుతున్న మహారాజ్

స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన మహారాజ్ చిత్రం కూడా నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమ్ అవుతోంది. జూన్ 21వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. కోర్టులో కేసు వల్ల కాస్త ఆలస్యంగా ఈ పీరియడ్ బయోపిక్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది.

పాత్రికేయుడు, సంఘ సంస్కర్త కర్సన్‍దాస్ ముల్జీ జీవితంపై మహారాజ్ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ పీ మల్హోత్రా దర్శకత్వం వహించారు. 1860ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ సినిమా రూపొందింది. ఓ బాబా చేసిన దురాగతాలను ముల్జీ వెలుగులోకి తేవడంపై నిజజీవిత ఘటనలతో ఈ చిత్రం రూపొందింది. జునైద్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించగా.. జైదీప్ అహల్వాత్, షాలినీ పాండే, శార్వరీ వాఘ్, జే ఉపాధ్యాయ్ కీరోల్స్ చేశారు.

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మహారాజ్ చిత్రం దుమ్మురేపుతోంది. ప్రస్తుతం (జూన్ 24) ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍లో ఉంది.

Whats_app_banner