OTT Movie: కోర్టు గ్రీన్ సిగ్నల్.. నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఆమిర్ ఖాన్ కుమారుడి తొలి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్-ott movie aamir khan son junaid khan debut movie maharaj streaming on netflix ott after court signal maharaj ott updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movie: కోర్టు గ్రీన్ సిగ్నల్.. నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఆమిర్ ఖాన్ కుమారుడి తొలి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie: కోర్టు గ్రీన్ సిగ్నల్.. నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఆమిర్ ఖాన్ కుమారుడి తొలి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 22, 2024 03:59 PM IST

Maharaj OTT Streaming: మహారాజ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కోర్టు ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అనుమతి ఇచ్చింది. దీంతో వివాదం, ఆలస్యం తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

OTT Movie: కోర్టు గ్రీన్ సిగ్నల్.. నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఆమిర్ ఖాన్ కుమారుడి తొలి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie: కోర్టు గ్రీన్ సిగ్నల్.. నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఆమిర్ ఖాన్ కుమారుడి తొలి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Maharaj OTT: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తొలి సినిమానే వివాదాల్లో చిక్కుకుంది. జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో మహారాజ్ చిత్రం రూపొందింది. అయితే, ఈ చిత్రం తమ మనోభావాలను కించపరిచేలా ఉందని ఓ హిందూ సంఘం కోర్టును ఆశ్రయించింది. దీంతో జూన్ 14వ తేదీన రావాల్సిన ఈ మూవీ ఆలస్యమైంది. అయితే, అనుమతి లభించడంతో మహారాజ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాలివే..

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

మహారాజ్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. జూన్ 14వ తేదీనే ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రావాల్సింది. అయితే, కోర్టులో పిటిషన్ నమోదవడంతో కోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత కోర్టు ఓకే చెప్పడంతో జూన్ 21వ తేదీన మహారాజ్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మహారాజ్ స్ట్రీమింగ్ అవుతోంది.

అభ్యంతరకరంగా ఏం లేదు!

మహారాజ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు గుజరాత్ హైకోర్టు శుక్రవారం (జూన్ 21) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిటిషన్‍లో పేర్కొన్నట్టు ఓ మత మనోభావాలను కించపరిచేలా ఈ చిత్రం లేదని న్యాయస్థానం తన తీర్పు వెల్లడించింది. ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయవచ్చని నెట్‍ఫ్లిక్స్, యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థలకు అనుమతి ఇచ్చింది. “సినిమా చూశాం. పిటిషనర్లు చెప్పినట్టుగా ఈ చిత్రం ఓ మతానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నట్టు కోర్టు గుర్తించలేదు. మహారాజ్ మూవీ విడుదలకు అనుమతిస్తున్నాం” అని గుజరాత్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతకు ముందు జూన 13వ తేదీన విధించిన స్టేను ఎత్తివేసింది.

నిజజీవిత ఘటనలతో..

మహారాజ్ సినిమా నిజజీవిత ఘటనలతో రూపొందింది. జర్నలిస్ట్, సామాజిక సంస్కర్త కర్సన్‍దాస్ ముల్జీ జీవితంపై ఈ మూవీ తెరకెక్కింది. 1860ల్లో ఓ బాబా అన్యాయాలను ముల్జీ బహిర్గతం చేయడం చుట్టూ ఈ చిత్రం సాగింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేశారు జునైద్ ఖాన్.

మహారాజ్ చిత్రంలో జునైద్‍ ఖాన్‍తో పాటు జైదీప్ అహల్వాత్, షాలినీ పాండే, శార్వరీ వాఘ్, జే ఉపాధ్యాయ్ కీలకపాత్రలు పోషించారు. సిద్ధార్థ్ పీ మల్హోత్రా దర్శకత్వం వహించారు. బ్రిటీష్ పాలన కాలమైన 1860ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ సినిమా రూపొందింది. స్నేహా దేశాయ్.

గుజరాతీ రచయిత సౌరభ్ షా రచించిన 1862 మహారాజ్ లిబెల్ కేస్ అనే పుస్తకం ఆధారంగా మహారాజ్ చిత్రాన్ని దర్శకుడు సిద్ధార్థ్ మల్హోత్రా తెరక్కించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకం నిర్మించగా.. సోహైల్ సేన్ సంగీతం అందించారు.

సోషల్ మీడియాలోనూ ఈ మహారాజ్ చిత్రంపై దుమారం రేగింది. ఈ మూవీని బ్యాన్ చేయాలనే డిమాండ్లు విపరీతంగా వచ్చాయి. ఈ విషయం రెండు రోజులు బాగా చక్కర్లు కొట్టింది. అయితే, కోర్టు అంగీకరించటంతో ఎట్టకేలకు ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

మహారాజ్ మూవీకి ఇప్పుడు ఎక్కువ శాతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలి సినిమానే అయినా జునైద్ ఖాన్ చాలా ఆత్మవిశ్వాసంగా నటించాడనే ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా కూడా ఆకట్టుకునేలా ఉందని కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Whats_app_banner