తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: ప్రెస్‌మీట్‌లో టేబుల్‌ మీద కాళ్లు పెట్టి మాట్లాడటంపై విజయ్‌ రియాక్షన్‌ ఇదీ

Vijay Deverakonda: ప్రెస్‌మీట్‌లో టేబుల్‌ మీద కాళ్లు పెట్టి మాట్లాడటంపై విజయ్‌ రియాక్షన్‌ ఇదీ

Hari Prasad S HT Telugu

19 August 2022, 15:09 IST

    • Vijay Deverakonda news: తనకు నచ్చింది చేయడం, తోచింది మాట్లాడటం విజయ్ దేవరకొండ స్టైల్‌. ఎవరేమనుకున్నా జాన్తా నై అనుకునే ఈ రౌడీ బాయ్‌ ఈ మధ్య హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌లో రెండు కాళ్లు టేబుల్‌పై పెట్టడం వివాదానికి దారితీసింది.
హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో విజయ్ ఇలా టేబుల్ పై కాళ్లు పెట్టుకొని కూర్చున్నాడు
హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో విజయ్ ఇలా టేబుల్ పై కాళ్లు పెట్టుకొని కూర్చున్నాడు

హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో విజయ్ ఇలా టేబుల్ పై కాళ్లు పెట్టుకొని కూర్చున్నాడు

vijay devarakonda news: విజయ్‌ దేవరకొండది స్వేచ్ఛగా ఉండే మనస్తత్వం. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచీ అతడు ఎంచుకున్న సినిమాలు, రోల్స్‌ చూసినా ఇదే అనిపిస్తుంది. విమర్శలను పెద్దగా పట్టించుకోడు. ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్లు ఉంటాడు. ప్రస్తుతం తన నెక్ట్స్‌ మూవీ లైగర్‌ ప్రమోషన్లలో బిజీగా ఉన్న విజయ్‌.. ఈ మధ్య ఓ వివాదంలో చిక్కుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

లైగర్‌ టీమ్‌ హైదరాబాద్‌ వచ్చిన సమయంలోనూ మీడియాతో మాట్లాడింది. విజయ్‌, అనన్య కలిసి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఓ సందర్భంలో విజయ్‌ తన ముందు ఉన్న టేబుల్‌పై రెండు కాళ్లు పెట్టి కూర్చున్నాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేవలం ఈ ఫొటోలు మాత్రమే బయటకు రావడంతో విజయ్‌కి ఎంత పొగరు? చాలా ఆటిట్యూడ్‌ చూపిస్తున్నాడంటూ చాలా మంది విమర్శించారు.

నిజానికి ఆ మొత్తం వీడియో చూస్తే విజయ్‌ ఎందుకలా చేశాడో అర్థమవుతుంది. ఓ జర్నలిస్ట్‌ తనతో ఫ్రీగా మాట్లాడలేను అని అంటుంటే.. ఎందుకు ఫ్రీగా ఉండలేరు.. మీరు కాలు మీద కాలేసుకొని అడగండి.. నేనూ కాలు మీద కాలేసుకుంటా అంటూ టేబుల్‌పై కాళ్లు పెడతాడు. నిజానికి అతడు సరదాగా చేసిన పని ఇది. అయితే ఆ విషయం తెలియని చాలా మంది విజయ్‌ని విమర్శించారు. దీనిపై శుక్రవారం అతడు ట్విటర్‌ ద్వారా స్పందించాడు.

"ఎవరైనా వాళ్ల రంగంలో ఎదుగుతూ ఉంటే.. వెనుకాల టార్గెట్‌ కచ్చితంగా అవుతారు. కానీ మేము ఫైట్‌ చేస్తాం. మీరు నిజాయతీగా ఉంటే, అందరికీ మంచి జరగాలని అనుకుంటే అభిమానుల ప్రేమతోపాటు ఆ దేవుడు కూడా మిమ్మల్ని రక్షిస్తాడు" అని విజయ్‌ ఘాటుగా ట్వీట్‌ చేశాడు. లైగర్‌ ప్రమోషన్లలో భాగంగా అనన్యతో కలిసి హైదరాబాద్‌ వచ్చిన విజయ్‌.. తన ఇంటికి వెళ్లిన సమయంలో అతని తల్లి మాధవి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.

పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వస్తున్న లైగర్‌ ఈ నెల 25న రిలీజ్‌ కానుంది. ఈ పాన్‌ ఇండియా మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో ఓ చాయ్‌వాలాగా ఉండే వ్యక్తి మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ఇంటర్నేషనల్‌ లెవల్‌కు ఎలా ఎదుగుతాడన్నదే స్టోరీ.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం