Liger Censor Cuts: లైగర్‌ మూవీకి ఏడు కట్స్‌ చెప్పిన సెన్సార్‌ బోర్డు-censor board suggested 7 cuts to liger movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Liger Censor Cuts: లైగర్‌ మూవీకి ఏడు కట్స్‌ చెప్పిన సెన్సార్‌ బోర్డు

Liger Censor Cuts: లైగర్‌ మూవీకి ఏడు కట్స్‌ చెప్పిన సెన్సార్‌ బోర్డు

HT Telugu Desk HT Telugu
Aug 18, 2022 05:17 PM IST

Liger Censor Cuts: విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే పాన్‌ ఇండియా మూవీ లైగర్‌ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ మూవీ ఆగస్ట్‌ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే.

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ

ఈ ఏడాది మోస్ట్‌ అవేటెడ్‌ పాన్‌ ఇండియా మూవీస్‌లో ఒకటైన లైగర్‌ రిలీజ్‌కు టైమ్‌ దగ్గర పడుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్‌, సాంగ్స్‌ ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఈ మూవీతోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ నెల 25న రిలీజ్‌ కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో టీమ్‌ బిజీబిజీగా గడుపుతోంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. దీనికి యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చారు. లైగర్‌ మూవీ రన్‌టైమ్‌ 140.20 నిమిషాలు. అంటే 2 గంటల 20 నిమిషాలు. ఇప్పుడు వస్తున్న చాలా సినిమాల కంటే రన్‌టైమ్‌ తక్కువే అని చెప్పాలి. ఇక ఈ మూవీకి సెన్సార్‌ మొత్తం ఏడు కట్స్‌ చెప్పింది. కొన్ని డైలాగులను వేరేవాటితో రీప్లేస్ చేయనున్నారు.

మరికొన్ని డైలాగులను మ్యూట్‌ చేస్తారు. ఎఫ్‌ వర్డ్స్‌ను సగానికి కట్‌ చేయడం, మ్యూట్‌ చేయడం చేయనున్నారు. ఈ స్పోర్ట్స్‌ డ్రామాలో విజయ్‌ దేవరకొండ పక్కా మాస్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. దీంతో అతని నోటి వెంట బూతు డైలాగులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలాంటి డైలాగులన్నింటికీ సెన్సార్‌ బోర్డు నో చెప్పింది. ఇక మూవీలో మిడిల్‌ ఫింగర్‌ సీన్లను బ్లర్‌ చేయాలని కూడా సెన్సార్‌ బోర్డు సూచించింది.

లైగర్‌ మూవీలో లెజెండరీ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ కూడా గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగు, హిందీలలో ఒకేసారి షూట్‌ చేశారు. మిగతా భాషల్లోకి డబ్‌ చేశారు. పూరి కనెక్ట్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో విజయ్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ బాక్సర్‌గా కనిపించనున్నాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం