Vijay Devarakonda: లైగర్‌ పక్కా తెలుగు సినిమా.. మన సినిమానే ఇండియాకు చూపిస్తున్నాం: విజయ్-liger is a pakka telugu movie says vijay devarakonda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Devarakonda: లైగర్‌ పక్కా తెలుగు సినిమా.. మన సినిమానే ఇండియాకు చూపిస్తున్నాం: విజయ్

Vijay Devarakonda: లైగర్‌ పక్కా తెలుగు సినిమా.. మన సినిమానే ఇండియాకు చూపిస్తున్నాం: విజయ్

HT Telugu Desk HT Telugu
Aug 15, 2022 05:26 PM IST

Vijay Devarakonda: లైగర్‌ పక్కా తెలుగు సినిమా అని, మన సినిమానే హిందీలోనూ చూపిస్తున్నామని అన్నాడు ఈ మూవీ హీరో విజయ్‌ దేవరకొండ. సోమవారం హైదరాబాద్‌లో ప్రమోషనల్‌ ఈవెంట్‌లో విజయ్‌తోపాటు మూవీ టీమ్‌ సందడి చేసింది.

హైదరాబాద్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న విజయ్ దేవరకొండ
హైదరాబాద్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న విజయ్ దేవరకొండ

ఇప్పుడు టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ లైగర్‌. విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లాంటి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ ఆగస్ట్‌ 25న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా దేశమంతా చుట్టుస్తున్న లైగర్‌ టీమ్‌ సోమవారం హైదరాబాద్‌లోనూ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా విజయ్‌ కొన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాలు చెప్పాడు.

లైగర్‌ పాన్‌ ఇండియా లెవల్లో రిలీజవుతున్నా.. ఇది పక్కా తెలుగు సినిమా అని విజయ్‌ అన్నాడు. "ఈ మూవీ తెలుగు, హిందీల్లో ఒకేసారి షూటింగ్‌ చేశాం. అయితే ఇది మాత్రం పక్కా తెలుగు సినిమా. మన సినిమానే ఇప్పుడు ఇండియాకు చూపిస్తున్నాం" అని విజయ్‌ చెప్పాడు. కరీంనగర్‌ నుంచి ముంబైకి వలస వెళ్లే ఓ తల్లీకొడుకుల కథే లైగర్‌ అని అతడు తెలిపాడు.

ఇక రీమేక్స్‌ గురించి విజయ్‌ మాట్లాడుతూ.. తానెప్పుడూ రీమేక్స్‌ చేయనని, తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశాడు. అమ్మా నాన్న తెలుగు అమ్మాయి మూవీతో పోలికలపై అతడిలా స్పందించాడు. ఆ మూవీలోది బాక్సింగ్‌ అని, ఇందులో ఉన్న మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ పూర్తిగా భిన్నమైన స్పోర్ట్ అని విజయ్‌ అన్నాడు. ఈ మూవీ భారీ అంచనాలు ఉండటంపై తానేమీ ఆందోళన చెందడం లేదని చెప్పాడు.

"మేము కచ్చితంగా అంచనాలను అందుకుంటామన్న నమ్మకం ఉంది. నేనెప్పుడూ పెద్దగా చేయాలని కలలు కంటాను. పెళ్లి చూపులు నా కెరీర్‌లో పెద్ద విజయం. అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం కూడా పెద్ద హిట్సే. లైగర్‌ కూడా అద్భుతమైన కంటెంట్‌తో వస్తోంది. ఆడియెన్స్‌ను థియేటర్లకు తీసుకురావడం మా విధి. వాళ్లు వస్తే మాత్రం కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు" అని విజయ్‌ స్పష్టం చేశాడు.

తన కెరీర్‌లో లైగర్‌ అతిపెద్ద సినిమా అని అన్నాడు. అంతేకాదు చాలెంజింగ్‌గా కూడా అనిపించిందని చెప్పాడు. ఫిజికల్ ట్రైనింగ్‌, మానసిక ఒత్తిడి చాలా ఉన్నదని తెలిపాడు. ఈ సినిమా కోసం తన హద్దులను చెరిపేసినట్లు విజయ్‌ చెప్పాడు. తన శరీరాన్ని మలచుకోవడానికి రెండు నెలల సమయం సరిపోతుందని అనుకున్నా.. చాలా ఎక్కువ సమయమే పట్టిందని అన్నాడు.

IPL_Entry_Point