Vijay Deverakonda: పంజాబీ స్టైల్ తెలుగు సాంగ్.. లైగర్ కోకా 2.0 పాట వచ్చేసింది-vijay deverakonda movie liger new song coka 2 0 released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: పంజాబీ స్టైల్ తెలుగు సాంగ్.. లైగర్ కోకా 2.0 పాట వచ్చేసింది

Vijay Deverakonda: పంజాబీ స్టైల్ తెలుగు సాంగ్.. లైగర్ కోకా 2.0 పాట వచ్చేసింది

Maragani Govardhan HT Telugu
Aug 12, 2022 06:11 PM IST

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. ఈ సినిమా నుంచి మరో కొత్త పాట వచ్చేసింది. కోకా 2.0 అనే ఈ సాంగ్ పూర్తి పంజాబీ పాట మాదిరిగా ఉంది. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది.

<p>లైగర్ నుంచి కొత్త పాట</p>
లైగర్ నుంచి కొత్త పాట (Twitter)

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్, ట్రైలర్ విడుదలై అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదల చేసింది చిత్రబృందం. కోకా 2.0 అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది.

పంజాబీ స్టైల్‌లో సాగుతున్న ఈ సాంగ్‌లో విజయ్ కుర్తా పైజామా ధరించడమే కాకుండా తలకు టర్బన్ వేసుకుని అసలు, సిసలు సిక్కు వలే అగుపించాడు. పంజాబీ స్టైల్ డ్యాన్స్‌తో తనదైన రీతిలో అలరించాడు. లెహంగా ధరించిన అనన్యా ఆకట్టుకుంటోంది. ఇద్దరూ తమదైన రీతిలో స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఈ పంజాబీ స్టైల్ తెలుగు పాటను చూస్తే పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ మాదిరిగా అనిపిస్తోంది. ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

కోకా 2.0 సాంగ్‌ను రామ్ మిరియాల, గీతా మాధురి ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. జానీ లిజో జార్జ్, డేజే చేతాస్ ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చారు. ప్రస్తుతం చిత్రబృందం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో లైగర్ ప్రమోషన్లను నిర్వహిస్తోంది. తాజాగా ఛండీగఢ్‌కు వెళ్లిన విజయ్, అనన్యాకు సాదర స్వాగతం లభించింది. అక్కడి పొలాల్లో ఇద్దరూ కలిసి కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.

ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు కరణ్‌ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది విజయ్‌కు హిందీలో తొలి చిత్రం. రమ్య కృష్ణ ఇందులో రౌడీ హీరోకు తల్లి పాత్రలో కనిపించనుంది. అనన్యా పాండే హీరోయిన్ కాగా.. రోనిత్ రాయ్ విజయ్‌కు కోచ్‌ పాత్రలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో విడుదలకానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం