Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పూరి జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఛార్మి(Charmi)తనకు ఇరవై ఏళ్లుగా తెలుసునని అన్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh)ఛార్మితో రిలేషన్ షిప్ పై లైగర్ ప్రమోషన్స్ లో పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గత కొన్నేళ్లుగా పూరి జగన్నాథ్ తో కలిసి ప్రయాణాన్ని సాగిస్తుంది ఛార్మి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు నిర్మాణపరమైన వ్యవహారాల మొదలుకొని ప్రమోషన్స్ వరకు అన్ని బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. అనుక్షణం పూరి జగన్నాథ్ వెంటే ఉంటూ అతడికి సపోర్ట్ గా నిలుస్తోంది. పూరి జగన్నాథ్ షేర్ చేసే ప్రతి ఫొటోలో ఛార్మి తప్పకుండా కనిపిస్తుంది. వీరిద్దరి రిలేషన్ షిప్ గాపై చాలా కాలంగా అనేక పుకార్లు వినిపిస్తున్నాయి.
వీటిపై ఛార్మి చాలా సార్లు స్పందించింది. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని బదులిచ్చింది. కాగా ఛార్మితో ఉన్న అనుబంధంపై చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న పూరి జగన్నాథ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛార్మికి పదమూడేళ్లు ఉన్నప్పటి నుండి ఆమె తనకు తెలుసునని అన్నాడు. తాను చాలా హార్డ్ వర్కర్ అని పేర్కొన్నది. రెండు దశాబ్దాలుగా తనతో స్నేహం ఉందని తెలిపాడు.
ఛార్మి వయసు యాభై ఏళ్లు దాటినా, ఆమెకు పెళ్లైనా ఈ ప్రచారాలు ఉండేవి కాదని పూరి జగన్నాథ్ అన్నాడు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ఛార్మి యంగ్ ఏజ్ లో ఉంది కాబట్టే తమ ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. జంటల మధ్య ఉండే శృంగార ఆకర్షణలు, వాంఛలు తొందరగా చచ్చిపోతాయి. కానీ స్నేహం మాత్రమే ఎళ్లకాలం నిలిచిపోతుంది’ అని పూరి జగన్నాథ్ పేర్కొన్నాడు.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా ఆగస్ట్ 25న రిలీజ్ కానుంది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతాలతో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు.