తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vicky And Katrina: కత్రీనాతో పెళ్లి గురించి విక్కీ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

Vicky and Katrina: కత్రీనాతో పెళ్లి గురించి విక్కీ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

23 June 2022, 14:35 IST

google News
    • విక్కీ కౌశల్ ఇటీవల జరిగిన ఐఫా 2022 వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా కత్రీనాతో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లైఫ్‌లో సెటిల్ అయినట్లు అనిపిస్తోందని సమాధానమిచ్చాడు.
విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్
విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్ (Vicky Kaushal Instagram)

విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్

విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్ గతేడాది డిసెంబరులో పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. వీలుచిక్కినప్పుడల్లా ఇద్దరూ కలిసున్న ఫొటోలను తమ తమ సోషల్ మీడియా వేదికల్లో పంచుకుంటున్నారు. ఇటీవలే ఐఫా 2022 వేడుకల్లో పాల్గొన్న విక్కీ కౌశల్.. తన వైవాహిక జీవితం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ బాలీవుడ్ హోస్ట్ కుశా కపిలా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. కత్రీనాతో తన జీవితం గురించి ప్రస్తావించాడు.

కత్రీనాతో జీవితం ఎలా ఉందని కుశా అడిగింది.. ఇందుకు సమాధానంగా లైఫ్‌లో సెటిల్ అయ్యానని అనిపించిందని విక్కీ అన్నాడు. "ప్రస్తుతం అంతా సాఫీగా సాగుతోంది. నిజం చెప్పాలంటే నేను సెటిల్ అయ్యానని అనిపిస్తోంది. ఇంతకంటే మంచి పదం చెప్పలేను. దేవుడు నా పట్ల దయతో ఉన్నాడు. వ్యక్తిగత, వృత్తిగత రెండు జీవితాల్లోనూ ఆనందంగా ఉన్నాను అని విక్కీ బదులిచ్చాడు." కత్రీనాతో పెళ్లి గురించి తన స్నేహితులు ఎలా స్పందించారు అనే ప్రశ్నకు నవ్వుతూ విక్కీ సమాధానమిచ్చాడు.

"మా పెళ్లికి నా స్నేహితులంతా హాజరయ్యారు. అంతేకాకుండా చాలా కాలం నుంచి కత్రీనాతో వారికి పరిచయముంది. కాబట్టి ఈ విషయంలో వారు చాలా కూల్‌గా ఉన్నారు. పెళ్లిలో మాతో ఎంతో సరదాగా సమయాన్ని గడిపారు." అని విక్కీ కౌశల్ తెలిపాడు.

గత కొన్నేళ్లుగా విక్కీ-కత్రీనా ఒకరినొకరు రహస్యంగా ప్రేమించుకున్నారు. అయితే ఎట్టకేలకు వీరు 2021 డిసెంబరులో సవాయ్ మాధోపుర్ సిక్స్ సెన్సెస్ ఫోర్టులో అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగిన కొన్ని నెలల తర్వాత ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని విక్కీ సన్నిహితులు తేల్చిచెప్పారు.

తదుపరి వ్యాసం