తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Katrina Kaif | బికినీలో కత్రీనా.. షర్ట్ లేకుండా విక్కీ.. పూల్‌ను వేడెక్కించారు

Katrina Kaif | బికినీలో కత్రీనా.. షర్ట్ లేకుండా విక్కీ.. పూల్‌ను వేడెక్కించారు

07 May 2022, 16:52 IST

google News
    • కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ఎప్పటికప్పుడు తమ గురించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. తాజాగా కత్రీనా.. విక్కీని కౌగిలించుకుని దిగిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది.
కత్రీనా-విక్కీ
కత్రీనా-విక్కీ (Instagram)

కత్రీనా-విక్కీ

బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్.. గతేడాది డిసెంబరులో ప్రముఖ హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకునేంత వరకు తమ సంబంధాన్ని గుట్టుగా మెయింటేన్ చేసిన ఈ జంట.. వివాహం తర్వాత మాత్రం సోషల్ మీడియాలో అదిరిపోయే ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది. ముఖ్యంగా కత్రీనా కైఫ్.. భర్తతో కలిసి పంచుకున్న మధురమైన క్షణాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. తాజాగా విక్కీతో కలిసి దిగిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది.

స్విమ్ సూట్ ధరించిన మన మల్లీశ్వరీ.. పూల్‌లో భర్త విక్కీ కౌశల్‌ను గట్టిగా కౌగిలించుకుని ఫొటోకు ఫొజిచ్చింది. ఈ ఫొటలో విక్కీ షర్ట్ లేకుండా ఉండటం గమనార్హం. నేను.. నాతో(Me and Mine) అంటూ క్యాప్షన్ జతచేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోలు ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో ఈ చిత్రం వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ ఫొటోపై విశేషంగా స్పందిస్తున్నారు.

అతడిని కత్రీనా నా వాడు(Mine) అనడం తప్పేమి లేదని. ఎవరిని పడితే వారిని ప్రేమించే వారి కంటే అతడు చాలా విశ్వాసంగా ఉంటాడని ఓ యూజర్ పేర్కొన్నాడు. నువ్వు ప్రేమలో ఉన్నావని మాకు అర్థమవుతుంది కత్రీనా.. కానీ ఇది మాత్రం చెడు ప్రభావం చూపుతుంది అని మరోక వ్యక్తి స్పందించారు. నువ్వు ప్రేమించే వారిని సొంతం చేసుకోవడం మానుకో కత్రీనా అని మరోకరు పోస్ట్ పెట్టారు.

గత ఏడాది డిసెంబరులో రాజస్థాన్‌లో విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వీరిద్దరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్లోజ్ ఫ్రేండ్స్ మాత్రమే హాజరయ్యారు. వీరిద్దరు పెళ్లి తర్వాత చెట్టాపట్టాలేసుకుని ఎప్పటికప్పుడు తమ జీవితంలో జరిగే సంఘటనలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే కత్రీనా కైఫ్ విజయ్ సేతుపతి సరసన మెర్రీ క్రిస్టమస్ అనే చిత్రంలో నటిస్తోంది. మరోపక్క ఇషాన్ కట్టర్, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఫోన్ బూత్ అనే సినిమాను కూడా చేస్తుంది. ఇది కాకుండా సల్మాన్ ఖాన్ సరసన టైగర్-3 కూడా సన్నద్ధమవుతోంది.

తదుపరి వ్యాసం