తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vetrimaran On Ntr Movie: అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో మూవీపై వెట్రిమారన్ కామెంట్స్ ఇవీ

Vetrimaran on NTR Movie: అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో మూవీపై వెట్రిమారన్ కామెంట్స్ ఇవీ

Hari Prasad S HT Telugu

11 April 2023, 18:38 IST

    • Vetrimaran on NTR Movie: అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో మూవీపై డైరెక్టర్ వెట్రిమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన లేటెస్ట్ మూవీ విడుదలై కోసం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అతడు ఈ మూవీపై స్పందించాడు.
విడుదలై మూవీ లొకేషన్ లో డైరెక్టర్ వెట్రిమారన్
విడుదలై మూవీ లొకేషన్ లో డైరెక్టర్ వెట్రిమారన్

విడుదలై మూవీ లొకేషన్ లో డైరెక్టర్ వెట్రిమారన్

Vetrimaran on NTR Movie: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్లలో ఒకడు వెట్రిమారన్. ఇప్పటికే అతడు తీసిన పలు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆడుకాలం, విసరనాయ్, అసురన్ లాంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక అతడు తీసిన మరో సినిమా విడుదలై. ఈ మూవీ తొలి పార్ట్ ఈ మధ్యే రిలీజై మంచి టాక్ కొట్టేసింది.

ట్రెండింగ్ వార్తలు

Kalvan Review: కాల్వన్ రివ్యూ - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైన‌ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Jr NTR Donation: ఏపీలోని ఆలయానికి భారీ విరాళం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్: వివరాలివే

Krishna mukunda murari serial: కృష్ణకి పట్టపగలే చుక్కలు చూపిస్తానన్న ముకుంద.. మీరా మీద డౌట్ పడిన తింగరి

Guppedantha Manasu Serial: యాక్టింగ్‌లో వ‌సుధార‌ను మించిన‌ శైలేంద్ర - మోస‌పోయిన రాజీవ్ - మ‌ను కోసం రిషి భార్య రిస్క్‌

అలాంటి డైరెక్టర్ మన టాలీవుడ్ లోని టాప్ హీరోలతో సినిమా తీయడానికి ఆసక్తిగా ఉన్నాడు. అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులతో ఇప్పటికే అతడు సంప్రదింపులు కూడా జరపడం విశేషం. ఈ విషయాన్ని వెట్రిమారనే ఈ మధ్య హైదరాబాద్ లో ప్రెస్ మీట్ సందర్భంగా వెల్లడించాడు. తాను త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నట్లు కూడా చెప్పాడు.

"ఆడుకాలం తర్వాత నేను అల్లు అర్జున్ ను కలిశాను. మేము చెన్నైలోనూ కలిశాం. తాను తమిళంలోకి రావాలని అనుకుంటున్నట్లు అతడు నాతో చెప్పాడు. వడచెన్నైలోని ఓ క్యారెక్టర్ ను అతనికి నేను చెప్పాను. కానీ ఇప్పుడు దానిని నేను మార్చాను. ఈ కొత్త క్యారెక్టర్ ను కూడా అల్లు అర్జున్ తో చెప్పాను" అని వెట్రిమారన్ వెల్లడించాడు.

"నేను మహేష్ బాబును కూడా కలిశాను. ఇక అసురన్ తర్వాత లాక్‌డౌన్ తర్వాతి కాలంలో ఎన్టీఆర్ ను కలిశాను. మేమిద్దరం ఓ ప్రాజెక్ట్ పై మాట్లాడుతున్నాం. అది జరుగుతుంది. కానీ మూవీ స్టార్ట్ చేయడానికి మాత్రం కాస్త సమయం పడుతుంది" అని వెట్రిమారన్ చెప్పాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తో ఈ ముగ్గురిలో ఎవరు సినిమా చేసినా అది బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం