తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Etv Win Ott: ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీకి రికార్డ్ వ్యూస్ - ఎందులో చూడాలంటే?

Etv Win OTT: ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీకి రికార్డ్ వ్యూస్ - ఎందులో చూడాలంటే?

08 September 2024, 14:37 IST

google News
  • Etv Win OTT: వ‌రుణ్ సందేశ్ నింద ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఓటీటీలో రిలీజైన ఒక్క‌రోజులోనే ఈ సినిమాకు 1.4 మిలియ‌న్ స్ట్రీమింగ్ మిన‌ట్స్ వ్యూస్ వ‌చ్చిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.ఈటీవీ విన్ ఓటీటీలో నింద మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈటీవీ విన్ ఓటీటీ
ఈటీవీ విన్ ఓటీటీ

ఈటీవీ విన్ ఓటీటీ

Etv Win OTT: వరుణ్‌ సందేశ్ నింద మూవీ ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఇటీవ‌లే ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. ఒక్క‌రోజులోనే ఈ మూవీకి 1.4 మిలియ‌న్ స్ట్రీమింగ్ మిన‌ట్స్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీ...

నింద మూవీకి రాజేష్ జగన్నాథం ద‌ర్శ‌క‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. జూన్ నెల‌లోథియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ దాదాపు మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో మంచి సినిమాగా నింద మూవీ ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న‌ది. క‌థ‌లోని మ‌లుపుల‌తో పాటు వ‌రుణ్ సందేశ్ యాక్టింగ్‌కు మంచి పేరొచ్చింది. రీసెంట్ టైమ్స్‌లో వ‌రుణ్ సందేశ్ చేసిన బెస్ట్ మూవీ ఇందంటూ ఆడియెన్స్ పేర్కొన్నారు. క‌లెక్ష‌న్స్ ప‌రంగా ప‌ర్వాలేద‌నిపించింది.నింద మూవీలో వ‌రుణ్ సందేశ్‌తో పాటు అనీ, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్, భ‌ద్ర‌మ్‌ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. సంతు ఓంకార్ మ్యూజిక్ అందించాడు.

నింద మూవీ క‌థ ఇదే...

మంజు (క్యూ మ‌ధు) అనే యువ‌తిని రేప్ చేశాడ‌నే నేరంపై కాండ్ర‌కోట‌కు చెందిన బాల‌రాజును (ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌) పోలీసులు అరెస్ట్ చేస్తారు. బాల‌రాజు పొలంలోనే మంజు శవం దొరుకుతుంది. అంతే కాకుండా పోలీస్ ఇన్వేస్టిగేష‌న్‌తో పాటు డీఎన్ఏ రిపోర్ట్స్ లో బాల‌రాజు త‌ప్పు చేశాడ‌ని నిరూప‌ణ కావ‌డంతో అత‌డికి జ‌డ్జ్ స‌త్యానంద్ (త‌నికెళ్ల‌భ‌ర‌ణి) ఉరిశిక్ష విధిస్తాడు.

బాల‌రాజు నేరం చేయ‌లేద‌ని స‌త్యానంద్‌ న‌మ్ముతాడు. త‌న కార‌ణంగా నిర్ధోషికి శిక్ష ప‌డుతుంద‌నే మ‌నోవేద‌న‌తోనే క‌న్నుమూస్తాడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం హ్యూమ‌న్ రైట్స్ క‌మీష‌న్‌లో ప‌నిచేస్తోన్న స‌త్యానంద్‌కొడుకు వివేక్ (వ‌రుణ్ సందేశ్‌).... బాల‌రాజు కేసును రీ ఇన్వేస్టిగేష‌న్ చేయ‌డం మొద‌లుపెడ‌తాడు? వివేక్‌ అన్వేష‌ణ‌లో ఏం తేలింది? నిజంగా బాల‌రాజే మంజును హ‌త్య చేశాడా?

ఈ హ‌త్య‌కు బాల‌రాజు కూతురు సుధాకు (అనీ) ఏమైనా సంబంధం ఉందా? మంజును ప్రేమించిన మ‌నోహ‌న్ ఎవ‌రు? అస‌లైన కిల్ల‌ర్‌ను త‌న తెలివితేట‌ల‌తో వివేక్ ఎలా ప‌ట్టుకున్నాడ‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.

విరాజి…

నింద త‌ర్వాత విరాజి పేరుతో ఓ సినిమా చేశాడు వ‌రుణ్ సందేశ్‌. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ అంత‌గా ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం నింద డైరెక్ట‌ర్ రాజేష్ జ‌గ‌న్నాథ‌మ్‌తో వ‌రుణ్ సందేశ్ మ‌రో మూవీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కానిస్టేబుల్‌తో పాటు వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టిస్తోన్న మ‌రికొన్ని సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

తదుపరి వ్యాసం