Whisky IceCreams: హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌ క్రీమ్ అమ్మకాలు, అరికో ఐస్‌క్రీమ్స్‌ నిర్వాకం.. నిందితుల అరెస్ట్-whiskey ice cream sales arico ice cream management in hyderabad accused arrested ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Whisky Icecreams: హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌ క్రీమ్ అమ్మకాలు, అరికో ఐస్‌క్రీమ్స్‌ నిర్వాకం.. నిందితుల అరెస్ట్

Whisky IceCreams: హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌ క్రీమ్ అమ్మకాలు, అరికో ఐస్‌క్రీమ్స్‌ నిర్వాకం.. నిందితుల అరెస్ట్

Whisky IceCreams: హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌ క్రీమ్‌లు కలకలం రేపాయి. జూబ్లీ హిల్స్‌ రోడ్ నంబర్ 5లో ఉన్న అరికో ఐస్‌క్రీమ్స్‌లో ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఐస్ క్రీమ్‌ మెనూలో విస్కీ ఐస్‌ క్రీమ్ ఉన్నట్టు గుర్తించారు.

హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌ క్రీమ్‌ల కలకలం

Whisky IceCreams: హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌ క్రీమ్‌లు కలకలం రేపాయి. జూబ్లీ హిల్స్‌ రోడ్ నంబర్ 5లో ఉన్న అరికో ఐస్‌క్రీమ్స్‌లో ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఐస్ క్రీమ్‌ మెనూలో విస్కీ ఐస్‌ క్రీమ్ ఉన్నట్టు గుర్తించారు. కిలో ఐస్‌ క్రీమ్‌లో 50 నుంచి 100 ఎంఎల్‌ 100పైపర్స్‌ విస్కీని మిక్స్‌ చేసి ఐస్‌ క్రీమ్‌లను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. విక్రయాల కోసం సిద్ధం చేసిన ఐస్‌ క్రీమ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

జూబ్లిహిల్స్‌లోని అరికో ఐస్‌ క్రీమ్‌ పార్లర్ నిర్వాహకులు దయాకర్‌ రెడ్డి, శోభాలను అదుపులోకి తీసుకున్నారు. ఐస్‌ క్రీమ్‌ పార్లర్‌ను సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరికో పార్లర్‌లో రకరకాల ఫ్లేవర్లతో మద్యం మిక్స్‌ చేసిన ఐస్‌ క్రీమ్‌లను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. వీటిని భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ప్రధానంగా స్కూలు పిల్లలు, చిన్నారులు లక్ష్యంగా అమ్మకాలు చేస్తున్నారు.