Tollywood: వరలక్ష్మి శరత్ కుమార్ మిస్టర్ సెలబ్రిటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - హీరోగా స్టార్ రైటర్స్ మనవడు
27 September 2024, 13:13 IST
వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన నటించిన మిస్టర్ సెలబ్రిటీ మూవీ అక్టోబర్ 4న రిలీజ్ కాబోతోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీతో సీనియర్ రైటర్లు పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.
వరలక్ష్మి శరత్‌కుమార్
Tollywood: వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తెలుగు మూవీ మిస్టర్ సెలబ్రిటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. అక్టోబర్ 4న విడుదలకానుంది. ఈ సినిమాతో సుదర్శన్ పరుచూరి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. టాలీవుడ్ సీనియర్ రైటర్స్ పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరాల మనవడిగా సుందర్శన్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోన్నాడు. మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో సాగే చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ తో పాటు శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రలను పోషించారు.
అమ్మాయిపై పడిన నింద...
క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఓ అమ్మాయిపై పడిన నిందను సాల్వ్ చేసే క్రమంలో ఓ యువకుడు తెలుసుకున్న నిజాలేమిటి? కొందరు కావాలనే సృష్టించే పుకార్ల వల్ల అమయాకుల జీవితాలు ఎలా తలక్రిందులవుతాయనే సందేశానికి యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు మిస్టర్ సెలబ్రిటీ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం.
రిలీజ్ డేట్...
మిస్టర్ సెలబ్రిటీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను పరుచూరి గోపాలకృష్ణ రిలీజ్ చేశారు.అనంతరం పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘మా మనవడు పరుచూరి సుదర్శన్ నటించిన మిస్టర్ సెలెబ్రిటీ అక్టోబర్ 4న రాబోతోంది. మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడ్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కొత్త దర్శకుడైనా కూడా సినిమాను బాగా తీశారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది అని అన్నారు.
‘మమ్మల్ని ప్రేక్షకులు ఈ నలభై ఏళ్లుగా ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మా మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా ఇండస్ట్రీలోకి మిస్టర్ సెలబ్రిటీతో అడుగుపెడుతున్నావని’ అని కోరారు. పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పాడు.
గోపీచంద్ రిలీజ్...
ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు మిస్టర్ సెలబ్రిటీ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నారు. ఈ సినిమాలోని నీ జగతా అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను ఇటీవల హీరో గోపీచంద్ రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు వినోద్ యాజమాన్య మ్యూజిక్ అందిస్తోన్నాడు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తోన్నారు.
హనుమాన్‌లో...
తెలుగులో ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూనే ఇంకోవైపు విలన్ క్యారెక్టర్స్ చేస్తోంది వరలక్ష్మి శరత్‌కుమార్. ఈ ఏడాది టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన హనుమాన్‌లో కీలక పాత్ర చేసింది. శబరిలో హీరోయిన్‌గా నటించింది. తమిళంలో ధనుష్ రాయన్‌లోనెగెటివ్ షేడ్ క్యారెక్టర్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్.
టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో..
అక్టోబర్ 4న టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో పలు చిన్న సినిమాలు నిలవబోతున్నాయి. మిస్టర్ సెలబ్రిటీతో పాటు శ్రీవిష్ణు స్వాగ్, కలి, రామ్ నగర్ బన్నీ, దక్షిణ సినిమాలు రిలీజ్ కానున్నాయి..