Telugu space tourist: అంతరిక్షంలో త్రివర్ణ పతాకం: స్పేస్ లో భారత జెండాను ప్రదర్శించిన తెలుగువాడు గోపీచంద్-indian tourist displays indian tricolour in space in blue origins ns 25 mission ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Telugu Space Tourist: అంతరిక్షంలో త్రివర్ణ పతాకం: స్పేస్ లో భారత జెండాను ప్రదర్శించిన తెలుగువాడు గోపీచంద్

Telugu space tourist: అంతరిక్షంలో త్రివర్ణ పతాకం: స్పేస్ లో భారత జెండాను ప్రదర్శించిన తెలుగువాడు గోపీచంద్

HT Telugu Desk HT Telugu
May 25, 2024 10:55 AM IST

Telugu space tourist: అంతరిక్షంలో మరోసారి త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ సారి ఆ ఘనత సాధించింది ఒక తెలుగువాడు కావడం విశేషం. జెఫ్ బెజోస్ ప్రారంభించిన బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ -25 మిషన్ లో అంతరిక్షంలోకి వెళ్లి తొలి భారతీయ పర్యాటకుడు గోపీచంద్ తోటకూర చరిత్ర సృష్టించారు.

అంతరిక్షంలో త్రివర్ణ పతాకంతో తెలుగువాడు తోటకూర గోపీచంద్
అంతరిక్షంలో త్రివర్ణ పతాకంతో తెలుగువాడు తోటకూర గోపీచంద్

Telugu space tourist: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆదివారం ఆర్గనైజ్ చేసిన బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్-25 మిషన్ లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా పారిశ్రామికవేత్త, పైలట్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపీచంద్ తోటకూర చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలో తోటకూర గోపీచంద్ చిన్న త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకుని ఉన్న చిత్రాన్ని బ్లూ ఆరిజిన్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

నెటిజన్ల స్పందన

బ్లూ ఆరిజాన్ షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఈ జెండా మన భూగోళ ఐక్యతకు చిహ్నమని, ఈ చిన్న క్లిప్ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ జెండాను తనతో పాటు అంతరిక్షంలోకి తీసుకెళ్లాలని భావించిన గోపీచంద్ కు పలువురు నెటిజన్లు అభినందనలు తెలిపారు. ఇది ఎంతో గర్వించదగ్గ క్షణం అని మరొకరు రాశారు. 'మనందరికీ ఆకాశమే హద్దు, కానీ మీకు మాత్రం మీ ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించి.. అమెరికాలో వ్యాపారవేత్తగా మారి

ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన 30 ఏళ్ల పారిశ్రామికవేత్త, పైలట్ అయిన గోపీచంద్ తోటకూర 'నేను మన సుస్థిర భూగోళం కోసం పోరాడే పర్యావరణ యోధుడిని' అనే బ్యానర్ ను పట్టుకొని కనిపించారు. గోపీచంద్ తోటకూర పైలట్, ఏవియేటర్. ఇతడు అమెరికాలోని అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో హోలిస్టిక్ వెల్ నెస్ అండ్ అప్లైడ్ హెల్త్ కోసం గ్లోబల్ సెంటర్ అయిన ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ ను స్థాపించారు. కమర్షియల్ జెట్ ఫ్లైయింగ్ తో పాటు బుష్, ఏరోబ్యాటిక్, సీ ప్లేన్స్, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లను కూడా గోపి నడపగలరు. ఇంటర్నేషనల్ మెడికల్ జెట్ పైలట్ గా కూడా సేవలందిస్తున్నారు. ట్రావెలింగ్ ను ఇష్టపడే గోపీచంద్ తోటకూర ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇటీవల ఆయన టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో శిఖరాన్ని కూడా అధిరోహించారు.

మొదటి నల్లజాతి వ్యోమగామి కెప్టెన్ ఎడ్ డ్వైట్

అదే స్పేస్ మిషన్ లో పర్యటిస్తున్న ఇతర వ్యోమగాములు మాసన్ ఏంజెల్, సిల్వైన్ చిరాన్, కెన్నెత్ ఎల్ హెస్, కరోల్ షాలర్, మాజీ వైమానిక దళ కెప్టెన్ ఎడ్ డ్వైట్ కూడా ఈ వీడియోలో కనిపిస్తారు. 1961 లో అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీచే అమెరికా మొదటి నల్లజాతి వ్యోమగామిగా గతంలో కెప్టెన్ ఎడ్ డ్వైట్ ఎంపిక చేయబడ్డారు. కానీ అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం అతడికి ఎప్పుడూ రాలేదు.

ఇప్పటి వరకు 37 మందిని..

న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటి వరకు 37 మందిని అంతరిక్షంలోకి పంపింది. ఈ మిషన్ న్యూ షెపర్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఏడు సార్లు మానవులను అంతరిక్షంలోకి తీసుకువెళ్లారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ప్రైవేటు వ్యక్తులను భూ వాతావరణం, బాహ్య అంతరిక్షం మధ్య సరిహద్దు అయిన కర్మన్ రేఖకు ఎగువకు తీసుకువెళ్తారు. బ్లూ ఆరిజిన్ అభివృద్ధి చేసిన న్యూ షెపర్డ్ స్పేస్ టూరిజం కోసం రూపొందించిన పూర్తిగా పునర్వినియోగించదగిన సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్.

బ్లూ ఆరిజాన్ షేర్ చేసిన వీడియోను ఇక్కడ చూడండి.

టీ20 వరల్డ్ కప్ 2024