International Space Station: మే 14 వరకు ఈ సమయాల్లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ను నేరుగా చూసే అవకాశం-chennai witnesses international space station in night sky ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  International Space Station: మే 14 వరకు ఈ సమయాల్లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ను నేరుగా చూసే అవకాశం

International Space Station: మే 14 వరకు ఈ సమయాల్లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ను నేరుగా చూసే అవకాశం

HT Telugu Desk HT Telugu
May 11, 2024 03:08 PM IST

International Space Station: అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ప్రస్తుతం ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తూ భారతీయులకు కనువిందు చేస్తోంది. మే 8వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు భారత్ లోని వివిధ ప్రాంతాల వారు నేరుగా ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను వీక్షించవచ్చు.

అంతర్జాతీయ స్పేస్ స్టేషన్
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్

International Space Station: 'రాత్రి ఆకాశంలో మూడో ప్రకాశవంతమైన వస్తువు'గా భావించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (INS) మే 10న చెన్నైలో ఆకాశంలో కనిపించింది. మే 8 నుంచి మే 23 మధ్య వివిధ భారతీయ నగరాల నుంచి ఐఎస్ఎస్ ను ఎలాంటి టెలీస్కోప్ అవసరం లేకుండా, నేరుగా వీక్షించవచ్చని నాసా తెలిపింది.

yearly horoscope entry point

సోషల్ మీడియాలో వైరల్

చెన్నైకి చెందిన పలువురు యూజర్లు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ రోజు చెన్నైలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నేరుగా చూడటం అదృష్టం" అని ఒక యూజర్ తన ఉత్సాహాన్ని పంచుకున్నాడు. "ఈ రాత్రి చెన్నై మీదుగా వెళుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యొక్క అద్భుతమైన దృశ్యం లభించింది. థాంక్స్ నాసా’’ అని మరో యూజర్ స్పందించాడు. చెన్నై ఆకాశంలో ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ స్టేషన్ రాత్రి 7.07 గంటల నుంచి 7.09 గంటల వరకు ఒక ప్రకాశవంతమైన చుక్కలా కనిపించిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ ఐఎస్ఎస్ స్పష్టంగా కనిపించేంత ప్రకాశవంతంగా ఉందని మరో యూజర్ తెలిపారు.

మే 14 వరకు వివిధ సమయాల్లో..

శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో, అలాగే, శనివారం ఉదయం ఉదయం 5.02 గంటల సమయంలో చెన్నై ఆకాశంలో ఐఎన్ఎస్ స్పష్టంగా కనిపించింది. శనివారం ఉదయం 5.02 గంటల నుంచి ఆరు నిమిషాల పాటు చెన్నై ఆకాశంలో ఇది కనిపించింది. అలాగే, మే 12 ఉదయం 4.14 గంటల సమయంలో నాలుగు నిమిషాల పాటు, రాత్రి 7.08 గంటల సమయంలో మరో నాలుగు నిమిషాల పాటు ఇది కనిపిస్తుంది. మే 13న ఉదయం 5 గంటల నుంచి 6 నిమిషాల పాటు, మే 14న ఉదయం 4.14 గంటల నుంచి 3 నిమిషాల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చెన్నై వాసులు వీక్షించవచ్చు.

ఇతర నగరాల్లో కూడా..

‘‘ చంద్రుడు సూర్యుడి కాంతిని ప్రతిబింబించినట్లుగా.. ఐఎన్ఎస్ కూడా సూర్యుడి కాంతిని ప్రతిబింబిస్తుంది కాబటి ఆ వెలుగులో భూమిపై ఉన్నవారికి కనిపిస్తుందని నాసా వివరించింది. చెన్నైతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ఇతర నగరాల్లో కూడా వివిధ సమయాల్లో ఐఎస్ఎస్ కనిపిస్తుంది.

ఢిల్లీ

మే 11: ఉదయం 3:23 గంటలకు ప్రారంభమై మూడు నిమిషాలు, తరువాత 4:58 నుండి ఆరు నిమిషాలు, 7:59 నుండి మరో ఏడు నిమిషాలు.

మే 12: ఉదయం 4:09 గంటల నుంచి ఏడు నిమిషాలు, రాత్రి 8:48 గంటల నుంచి మరో రెండు నిమిషాలు

మే 13: ఉదయం 3:23 గంటల నుంచి మూడు నిమిషాలు, ఆ తర్వాత 4:58 నుంచి మూడు నిమిషాలు, 7:57 గంటల నుంచి మరో ఐదు నిమిషాలు.

ముంబై

మే 11: ఉదయం 5:00 గంటలకు ఆరు నిమిషాలు, రాత్రి 7:56 గంటల నుంచి మరో ఆరు నిమిషాలు

మే 12: ఉదయం 4:12 గంటల నుంచి మూడు నిమిషాలు.

బెంగళూరు

మే 11: ఉదయం 5:02 గంటలకు ప్రారంభమై ఆరు నిమిషాలు, సాయంత్రం 7:58 నుంచి మరో రెండు నిమిషాలు.

మే 12 : ఉదయం 4:14 గంటలకు మూడు నిమిషాలు, రాత్రి 7:07 నుంచి మరో ఐదు నిమిషాలు.

మే 13: ఉదయం 4:59 నుంచి ఆరు నిమిషాలు

మే 14: ఉదయం 4:14 నుంచి రెండు నిమిషాలు

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.