Romantic Thriller: యూట్యూబ్‌లో రిలీజైన నలుగురు హీరోయిన్లు నటించిన తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ
Romantic Thriller: థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ అలా ఇలా ఎలా ఓటీటీని స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ సినిమాలో పూర్ణ, హరిప్రియ, రేఖ, నిషా కొఠారి హీరోయిన్లుగా నటించారు.
Romantic Thriller: పూర్ణ హీరోయిన్‌గా నటించిన తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ అలా ఇలా ఎలా యూట్యూబ్‌లో రిలీజైంది. శనివారం నుంచి వోల్గా యూట్యూబ్ ఛానెల్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా ఎలా మూవీ గత ఏడాది జూలైలో థియేటర్లలో రిలీజైంది. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ఈ రొమాంటిక్ మూవీప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.
నలుగురు హీరోయిన్లు...
అలా ఇలా ఎలా మూవీలో పూర్ణతో ఆనందం ఫేమ్ రేఖ, హరిప్రియ హీరోయిన్లుగా నటించారు. నిషా కొఠారి గెస్ట్ పాత్రలో కనిపించింది. శక్తి వాసుదేవన్, రాజా చెంబోలు హీరోలుగా నటించారు. నాగబాబు, సితార, సీత, షాయాజీ షిండేతో పాటు పలువురు టాలీవుడ్ సీనియర్ నటులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. బ్రహ్మానందం, అలీ కమెడియన్లుగా కనిపించారు.
మణిశర్మ మ్యూజిక్.
అలా ఇలా ఎలా మూవీకి రాఘవ దర్శకత్వం వహించాడు. చాలా ఏళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించాడు.
అలా ఇలా ఎలా కథ ఇదే...
సైకో కిల్లర్ కథకు లవ్, రొమాంటిక్ అంశాలను జోడించి దర్శకుడు రాఘవ ఈ మూవీని తెరకెక్కంచారు. ఇందులో పూర్ణతోపాటు రేఖ, హరిప్రియ బోల్డ్ రోల్స్‌లో కనిపించారు. అనుకు(పూర్ణ) అబద్ధం చెప్పడం నచ్చదు. ఎవరైనా తనతో అబద్ధం ఆడారని తెలిస్తే వారిని దూరం పెడుతుంది. అను జీవితంలోకి అనుకోకుండా సూర్య (శక్తి వాసుదేవన్) వస్తాడు.
మరోవైపు కిల్లర్ అనే ఆరోపణలతో కార్తిక్‌ను (రాజా చెంబోలు) పోలీసులు అరెస్ట్‌చేస్తారు. జైలు నుంచి తప్పించుకున్న కార్తీక్...మిత్ర అనే అమ్మాయిని చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు. అసలు మిత్ర ఎవరు? ఆమెను కార్తిక్ ఎందుకు చంపాలని అనుకున్నాడు? సూర్య గురించి అనుకు తెలుసుకున్న షాకింగ్ నిజాలేమిటి? తన జీవితం గురించి అనుకు సూర్య ఎలాంటి అబద్ధాలు చెప్పాడు? అను, కార్తిక్‌కు ఉన్న లింకేటి అన్నదే ఇలా ఇలా ఎలా మూవీ కథ.
చంద్రముఖి డైరెక్టర్...
ఈ సినిమాలో హీరోగా నటించిన శక్తి వాసుదేవన్ చంద్రముఖి డైరెక్టర్ పి వాసు తనయుడు కావడం విశేషం. కన్నడంలో పలు సినిమాలు చేసిన శక్తి వాసుదేవన్ అలా ఇలా ఎలా మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీనే డిజాస్టర్ కావడంతో అతడికి మరో అవకాశం దక్కలేదు. కన్నడ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు శక్తి వాసుదేవన్.
గుంటూరు కారం మూవీలో...
మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గానే కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తోంది పూర్ణ. ఈ ఏడాది మహేష్‌బాబు గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో తళుక్కున మెరిసింది. గోపీచంద్ భీమాలో కీలక పాత్ర చేసింది. ప్రస్తుతం తెలుగు వెబ్‌సిరీస్ త్రీ రోజెస్ సీజన్ 2లో పూర్ణ నటిస్తోంది.