తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ustaad Bhagat Singh Budget: ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh Budget: ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంతో తెలుసా?

Hari Prasad S HT Telugu

12 May 2023, 11:40 IST

google News
    • Ustaad Bhagat Singh Budget: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త. అతని నెక్ట్స మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షురూ అయింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్
ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్

Ustaad Bhagat Singh Budget: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలుసు కదా. ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్ లోనే మరో సినిమా వస్తోంది. దీని పేరు ఉస్తాద్ భగత్ సింగ్. తాజాగా బుధవారం (ఏప్రిల్ 5) ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఈ మధ్యే పూజా కార్యక్రమాలు జరగగా.. ఇప్పుడు మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ తొలి షెడ్యూల్ లో భాగంగా వారం రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ లో జరగనుంది. ఇందులో పవన్ కల్యాణ్ తో పాటు ఇతర లీడ్ యాక్టర్స్ పాల్గొంటారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పై సినిమాటోగ్రాఫర్ అయనంకా బోస్, ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి, డైరెక్టర్ హరీష్ శంకర్ తీవ్రంగా శ్రమించారు.

అంతేకాదు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అభిమానుల అంచనాలకు తగినట్లుగా సినిమాను తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం పలువురు ప్రముఖ నటీనటులను ఫైనలైజ్ చేశారు. శ్రీలీల ఇందులో ఫిమేల్ లీడ్ గా కనిపిస్తోంది. అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక గబ్బర్ సింగ్ కు మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాదే ఈ సినిమాకు కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే అతడు పవన్ సినిమాలైన జల్సా, అత్తారింటికి దారేదిలాంటి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ ఇప్పటికే హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం వినోధాయ సిద్ధం రీమేక్ లోనూ నటిస్తున్నాడు.

తదుపరి వ్యాసం