Sreeleela Role in Ssmb28: మ‌హేష్, త్రివిక్ర‌మ్ సినిమాలో శ్రీలీల రోల్ ఇదేనా-sreeleela role revealed in mahesh babu trivikram movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sreeleela Role In Ssmb28: మ‌హేష్, త్రివిక్ర‌మ్ సినిమాలో శ్రీలీల రోల్ ఇదేనా

Sreeleela Role in Ssmb28: మ‌హేష్, త్రివిక్ర‌మ్ సినిమాలో శ్రీలీల రోల్ ఇదేనా

Nelki Naresh Kumar HT Telugu
Mar 24, 2023 01:28 PM IST

Sreeleela Role in Ssmb28:మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ సినిమాలో శ్రీలీల ఓ హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె రోల్ రివీల్ అయ్యింది.

శ్రీలీల
శ్రీలీల

Sreeleela Role in Ssmb28: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల హ‌వా కొన‌సాగుతోంది. రెండు సినిమాల‌తోనే తెలుగు హీరోయిన్ల‌లో టాప్ లీగ్‌లో అడుగుపెట్టింది శ్రీలీల‌. మ‌హేష్‌బాబు (Mahesh Babu), త్రివిక్ర‌మ్ (Trivikram) కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో శ్రీలీల రోల్‌పై టాలీవుడ్‌లో ఓ ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో మ‌హేష్‌బాబు మ‌ర‌ద‌లుగా శ్రీలీల న‌టిస్తోన్న‌ట్లు స‌మాచారం. అల్ల‌రి మ‌న‌స్త‌త్వం క‌లిగిన మ‌ర‌ద‌లిగా హుషారైన పాత్ర‌లో ఆమె క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. మ‌హేష్‌బాబు, శ్రీలీల కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిల‌వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఫ‌న్‌, రొమాన్స్ మేళ‌వించి ఈ సీన్స్‌ను త్రివిక్ర‌మ్ స్పెష‌ల్‌గా డిజైన్ చేస్తోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మ‌హేష్‌బాబు, శ్రీలీలల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తోన్న‌ట్లు స‌మాచారం. . ఎస్ఎస్ఎంబీ28 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

మ‌హ‌ర్షి త‌ర్వాత మ‌హేష్‌బాబు, పూజాహెగ్డే (Pooja Hegde) జంట‌గా న‌టిస్తోన్న సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. అంతే కాకుండా అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత దాదాపు ప‌దేళ్ల విరామం అనంత‌రం మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో ఈ సినిమా రాబోతుండ‌టం గ‌మ‌నార్హం.

ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ కృష్ణ మ‌ర‌ణంతో షూటింగ్ డిలే కావ‌డంతో ఆగ‌స్ట్‌కు వాయిదావేశారు. మ‌రోవైపు మ‌హేష్‌బాబు సినిమాతో పాటు బాల‌కృష్ణ 108లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది శ్రీలీల‌. అలాగే నితిన్‌, రామ్‌, వైష్ణ‌వ్‌తేజ్‌, న‌వీన్ పొలిశెట్టిల‌తో సినిమాలు చేస్తోంది.

IPL_Entry_Point