Mahesh Babu Dimple Kapadia Movie: ఫ్లాష్‌బ్యాక్: మహేష్‌బాబు, డింపుల్ కపాడియా మూవీ ఎందుకు ఆగిపోయిందంటే
Mahesh Babu Dimple Kapadia Movie: రాజకుమారుడుకు ముందే హీరోగా మహేష్‌బాబు ఓ సినిమా చేయాల్సింది. కానీ ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే
Mahesh Babu Dimple Kapadia Movie: 1999లో విడుదలైన రాజకుమారుడు సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్‌బాబు. ఈ సినిమాకు ముందు బాలనటుడిగా గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురంతో పాటు పలు సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న మహేష్‌బాబు హీరోగా అరంగేట్రం చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
అయితే రాజకుమారుడు సినిమాకు ముందే మహేష్‌బాబు హీరోగా ఓ సినిమా చేయాల్సింది. కథ, హీరోయిన్ సిద్ధమైన తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. సీనియర్ డైరెక్టర్ వంశీ తాను రాసిన నళిని ఆంటీ నీకు ఫోనోచ్చింది నవలను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేశారు.
ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి డింపుల్ కపాడియాను సంప్రదించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా యంగ్ హీరో ప్రధానంగా సాగే సినిమా కావడంతో ఈ రోల్ కోసం మహేష్‌బాబును తీసుకోవాలని వంశీ అనుకున్నారు. ఈ ప్రతిపాదనను కృష్ణ ముందు ఉంచారు వంశీ.
కానీ సినిమాలకు గ్యాప్ తీసుకున్న మహేష్ చదువుపై సీరియస్‌గా దృష్టిపెట్టడంతో అతడిని డిస్ట్రబ్ చేయకూడదనే ఆలోచనతో వంశీ ప్రతిపాదనను కృష్ణ తిరస్కరించారు. అలా నళిని ఆంటీ నీకు ఫోనోచ్చింది సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోయిన మూడు, నాలుగేళ్ల తర్వాత మహేష్‌బాబు రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.