తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Upasana Baby Shower: ఉపాసన సీమంతం.. అల్లు అర్జున్, సానియా మీర్జా పిక్స్ వైరల్

Upasana baby shower: ఉపాసన సీమంతం.. అల్లు అర్జున్, సానియా మీర్జా పిక్స్ వైరల్

Hari Prasad S HT Telugu

24 April 2023, 14:38 IST

    • Upasana baby shower: ఉపాసన సీమంతం వేడుకకు అల్లు అర్జున్, సానియా మీర్జా వచ్చారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉపాసన సీమంతం వేడుకల్లో అల్లు అర్జున్, సానియా మీర్జా
ఉపాసన సీమంతం వేడుకల్లో అల్లు అర్జున్, సానియా మీర్జా

ఉపాసన సీమంతం వేడుకల్లో అల్లు అర్జున్, సానియా మీర్జా

Upasana baby shower: ఉపాసన సీమంతం వేడుకలు ఆదివారం (ఏప్రిల్ 23) హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఇంతకుముందే ఒకసారి దుబాయ్ లో ఈ వేడుకలు జరగగా.. తాజాగా ఇప్పుడు ఇంట్లోనూ ఆమె బేబీ షవర్ జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్ తోపాటు మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా రావడం విశేషం. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

పెళ్లయిన పదేళ్ల తర్వాత తొలిసారి ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిన వార్తను గతేడాది రామ్ చరణ్ తండ్రి చిరంజీవి సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉపాసనకు ఏడో నెల. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఆమెకు సీమంతం చేశారు. దీనికి స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ తోపాటు సానియా కూడా రావడం విశేషం.

ఈ ఫొటోలను ఉపాసనతోపాటు అల్లు అర్జున్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఉపాసనతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. సో హ్యాపీ ఫర్ మై స్వీటెస్ట్ ఉప్సీ అని బన్నీ కామెంట్ చేశాడు. ఇక ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన ఫొటోల్లో సానియా మీర్జా కూడా కనిపించింది. మరో ఫొటోలో ఉపాసన.. తన తల్లి, అత్తతో కలిసి కనిపించింది.

ఆ మధ్య దుబాయ్ వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన అక్కడ కూడా తన కజిన్స్ తో కలిసి సీమంతం వేడుక జరుపుకున్న విషయం తెలిసిందే. ఆ ఫొటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిన తర్వాత చరణ్ తో కలిసి అమెరికా, జపాన్, యూఏఈలాంటి దేశాల టూర్లకు వెళ్లింది ఉపాసన.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.