తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Upasana Baby Shower: దుబాయ్‌లో ఉపాసన సీమంతం.. వైరల్ అవుతున్న ఫొటోలు

Upasana baby shower: దుబాయ్‌లో ఉపాసన సీమంతం.. వైరల్ అవుతున్న ఫొటోలు

Hari Prasad S HT Telugu

05 April 2023, 15:07 IST

    • Upasana baby shower: దుబాయ్‌లో ఉపాసన సీమంతం ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ వేడుకలు జరిగాయి. ఇందులో చరణ్, ఉపాసన వైట్ డ్రెస్సుల్లో కనిపించారు.
దుబాయ్ లో ఉపాసన సీమంతం వేడుకలు
దుబాయ్ లో ఉపాసన సీమంతం వేడుకలు

దుబాయ్ లో ఉపాసన సీమంతం వేడుకలు

Upasana baby shower: పెళ్లి చేసుకున్న పదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయినప్పటి నుంచీ రామ్ చరణ్, ఉపాసన తెగ తిరిగేస్తున్నారు. ఈ మధ్యే వీళ్లు అమెరికాలో చాలా రోజుల పాటు ఉన్నారు. అక్కడ గోల్డెన్ గ్లోబ్స్, ఆస్కార్స్ లో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు దుబాయ్ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడే ఉపాసన సీమంతం వేడుకలు కూడా నిర్వహించడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బుధవారం (ఏప్రిల్ 5) దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వేడుకల్లో చరణ్, ఉపాసన వైట్అండ్ వైట్ లో కనిపించారు. టెడ్డీ బేర్ థీమ్ డెకొరేషన్, భారీ కేకుతో ఈ సీమంతం వేడుకలను జరుపుకున్నారు. ఈ మాంటేజ్ వీడియోను షేర్ చేస్తూ తనకు గుర్తుండిపోయే సీమంతం నిర్వహించిన తన చెల్లెళ్లకు ఉపాసన థ్యాంక్స్ చెప్పింది.

ఈ బేబీ షవర్ కేకు కూడా మూడు లేయర్లలో ఉండి దానిపై టెడ్డీ బేర్లను ఉంచారు. ఎందుకంటే నువ్వంటే మాకిష్టం అని ఆ కేకుపై రాశారు. తన సోదరీమణులతో కలిసి సీమంతం వేడుకలను ఉపాసన బాగానే ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. ఉపాసన వైట్ డ్రెస్ లో, రామ్ చరణ్ వైట్ షర్ట్, ప్యాంట్ లో కనిపించారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ ఇద్దరూ బీచ్ లో కొన్ని రొమాంటిక్ ఫొటోలకు కూడా పోజులిచ్చారు.

బీచ్ లో సూర్యాస్తమయాన్ని కూడా వీళ్లు ఎంజాయ్ చేశారు. ఈ వేడుకల్లో రామ్, ఉపాసన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. గతేడాది ఈ ఇద్దరూ తమ పదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. గతేడాది డిసెంబర్ లో రామ్, ఉపాసన పేరెంట్స్ కాబోతున్నారన్న విషయాన్ని చిరంజీవి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. పదేళ్లుగా పిల్లలు కాకపోవడంపై తాము ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నామో కూడా ఈ మధ్య ఉపాసన వివరించింది.

కుటుంబ సభ్యులు, సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లను పట్టించుకోకూడదని తామిద్దరం నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా ఉపాసన వెల్లడించింది. తాము పేరెంట్స్ కావాలనుకున్న సమయంలోనే ప్రెగ్నెన్సీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం