Tulasivanam Web Series: ఓటీటీలో రిలీజైన తరుణ్ భాస్కర్ తెలుగు కామెడీ వెబ్‌సిరీస్ - ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ స్ట్రీమింగ్!
21 March 2024, 11:58 IST
Tulasivanam Web Series: తెలుగు కామెడీ వెబ్ సిరీస్ తులసి వనం గురువారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తరుణ్ భాస్కర్ ప్రజెంటర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది
తులసివనం వెబ్ సిరీస్
Tulasivanam Web Series: డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు కామెడీ వెబ్‌సిరీస్ తులసివనం ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి ఈ వెబ్‌సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ ఎపిసోడ్‌ను ఫ్రీగా ఈటీవీ విన్‌లో చూడొచ్చొని ఓటీటీ సంస్థ ప్రకటించింది. మొత్తం మూడు ఎపిసోడ్స్‌ను మాత్రమే రిలీజ్ చేశారు. మిగిలిన ఎపిసోడ్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్...
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో అక్షయ్ లగుసాని, ఐశ్వర్య హోలక్కల్, వెంకటేష్ కాకుమాను, టాక్సీవాలా విష్ణు కీలక పాత్రలు పోషించారు. తులసి అనే యువకుడి జీవితంలో జరిగిన కొన్ని ఫన్నీ సంఘటనలతో దర్శకుడు అనిల్ రెడ్డి ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాడు. తులసిని ఐఏఎస్ ఆఫీసర్‌గా చూడాలని తండ్రి కోరుకుంటాడు.
కానీ తులసి మాత్రం క్రికెటర్ కావాలని కలలు కంటాడు. కానీ తండ్రి బలవంతంతో సాఫ్ట్‌వేర్ జాబ్‌లో తులసి ఎందుకు చేరాల్సివచ్చింది. హైదరాబాద్ వచ్చిన అతడు కలలకు వాస్తవ జీవితానికి మధ్య ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నాడన్నది ఈ సిరీస్‌లో చూపించారు. యువత మనోభావాలకు దగ్గరగా చాలా రియలిస్టిక్‌గా ఈ సిరీస్ ఉండబోతున్నట్లు దర్శకుడు ప్రకటించాడు. తులసి వనం వెబ్‌సిరీస్‌లో అభినవ్ గోమటం గెస్ట్ రోల్‌లో కనిపించాడు.
తరుణ్ భాస్కర్ ప్రజెంటర్...
తరుణ్ భాస్కర్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సిరీస్‌ను స్వాగత్ రెడ్డి, నీలిత పైడిపల్లి, జీవన్ కుమార్, ప్రీతమ్ కలిసి నిర్మించారు. అక్షయ్ లగుసాని, ఐశ్వర్య హోళక్కల్ కలిసి గతంలో హాస్టల్ డేస్ అనే వెబ్‌సిరీస్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సెకండ్ వెబ్‌సిరీస్ ఇది.
హాస్టల్ డేస్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో సినిమాల కంటే సిరీస్‌లతోనే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. డెడ్ పిక్సెల్స్ వెబ్‌సిరీస్‌లో నిహారిక కొణిదెలతో పాటు అక్షయ్ లగుసాని ఓ కీలక పాత్ర పోషించాడు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్...
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో ఐశ్వర్య హోళక్కల్ గెస్ట్ రోల్ చేసింది. విందుభోజనంతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది.
కీడాకోలాతో రీఎంట్రీ...
పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో దర్శకుడిగా విజయాల్ని అందుకున్నాడు తరుణ్ భాస్కర్. యూత్ ఎంటర్‌టైనర్స్‌గా తెరకెక్కిన ఈ సినిమాలు కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచాయి. కొంత గ్యాప్ తర్వాత ఇటీవలే దర్శకుడిగా కీడా కోలా సినిమాను తెరకెక్కించాడు. క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ కీలక పాత్ర పోషించాడు.
ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నది. దర్శకుడిగా పలు అవకాశాల్ని అందుకుంటున్నాడు తరుణ్ భాస్కర్. గత ఏడాది మంగళవారం, దాస్ కా ధమ్కీ, హాస్టల్ బాయ్స్‌తో పాటు యాంగర్ టేల్స్, ధూత వెబ్‌సిరీస్‌లలో తరుణ్ భాస్కర్ డిఫరెంట్ రోల్స్ చేశాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే ప్రయత్నాల్లో తరుణ్ భాస్కర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.