తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Triptii Dimrii On Animal Bold Scene: యానిమల్‌లో రణ్‌బీర్‌తో బెడ్‌పై బోల్డ్ సీన్.. తృప్తి దిమ్రి పేరెంట్స్ రియాక్షన్ ఇదీ

Triptii Dimrii on Animal Bold scene: యానిమల్‌లో రణ్‌బీర్‌తో బెడ్‌పై బోల్డ్ సీన్.. తృప్తి దిమ్రి పేరెంట్స్ రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu

11 December 2023, 13:09 IST

google News
    • Tripti Dimri on Animal Bold scene: యానిమల్‌ మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌తో ఓ సీన్లో బెడ్‌పై రెచ్చిపోయి నటించింది తృప్తి దిమ్రి. ఆ సీన్ చూసి తమ పేరెంట్స్ ఎలా రియాక్టయ్యారో ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది.
యానిమల్ మూవీలో రణ్‌బీర్ తో రెచ్చిపోయి నటించిన తృప్తి దిమ్రి
యానిమల్ మూవీలో రణ్‌బీర్ తో రెచ్చిపోయి నటించిన తృప్తి దిమ్రి

యానిమల్ మూవీలో రణ్‌బీర్ తో రెచ్చిపోయి నటించిన తృప్తి దిమ్రి

Tripti Dimri on Animal Bold scene: యానిమల్ మూవీతో కొత్త నేషనల్ క్రష్ గా మారిపోయింది తృప్తి దిమ్రి (Tripti Dimrii). ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ తో ఆమె చేసిన బోల్డ్ సీన్ చూసి అందరూ నోరెళ్లబెట్టారు. బెడ్‌పై నగ్నంగా ఇద్దరూ పడుకున్న సీన్ చూసి థియేటర్లలో ప్రేక్షకులు షాక్ తిన్నారు. మరి ఈ సీన్ చూసి తృప్తి పేరెంట్స్ ఎలా రియాక్టయ్యారో తెలుసా?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ యానిమల్ స్టార్ ఇదే విషయాన్ని వెల్లడించింది. ఆ సీన్ చూసి వాళ్లు ఆశ్చర్యపోయారని తృప్తి దిమ్రి చెప్పింది. అలా చేయాల్సింది కాదని వాళ్లు అన్నారట. యానిమల్ మూవీలో ఆమె నటన, ఇలా బోల్డ్ సీన్లలో నటించడం చూసి పది రోజుల్లోనే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 6 లక్షల నుంచి ఏకంగా 33 లక్షలకు పెరగడం విశేషం.

మా పేరెంట్స్ కాస్త అప్‌సెట్ అయ్యారు: తృప్తి

కానీ ఆమెకు ఇలా వచ్చిన ఫేమ్ మాత్రం తృప్తి పేరెంట్స్ కు నచ్చలేదు. సహజంగానే ఏ పేరెంట్స్ అయినా స్క్రీన్ పై తమ కూతురు ఇలాంటి బోల్డ్ సీన్లలో నటించడం కాస్త ఇబ్బంది కలిగించేదే. వాళ్లూ అలాగే ఫీలైనట్లు ఆమె చెప్పింది. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తృప్తి దీనిపై స్పందించింది.

"మా పేరెంట్స్ కాస్త ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకూ సినిమాల్లో మేము ఎప్పుడూ చూడనిది నువ్వు చేశావని అన్నారు. ఆ సీన్ నుంచి కోలుకోవడానికి వాళ్లకు కాస్త సమయం పట్టింది. అలా చేయాల్సింది కాదు. కానీ సరేలే. పేరెంట్స్ గా మేము ఇలాంటివి చూసి ఇబ్బంది పడతాం కదా అన్నట్లుగా వ్యవహరించారు.

కానీ నేనే తప్పూ చేయడం లేదని వాళ్లకు చెప్పాను. అది నా వృత్తి. అందులో ఎలాంటి అసౌకర్యం, అభద్రత లేనంత వరకూ ఇలాంటివి చేయడానికి నేనేమీ ఇబ్బంది పడను. నేనో నటిని. నా పాత్రకు న్యాయం చేయడానికి నేను 100 శాతం నిజాయతీగా ఉండాలి" అని తృప్తి దిమ్రి అనడం విశేషం.

నిజానికి తృప్తి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆరేళ్లు అవుతోంది. కానీ యానిమల్ చూసిన తర్వాత ఆమెకు ఫాలోవర్లు పెరిగారు. ఈ మూవీ తర్వాత తాను గతంలో నటించిన బుల్‌బుల్, ఖాలాలాంటి సినిమాలు కూడా చూస్తున్నారని తృప్తి చెప్పింది. మరోవైపు యానిమల్ మూవీ పది రోజుల్లో ఇండియాలో రూ.430 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.660 కోట్లు వసూలు చేసింది.

తదుపరి వ్యాసం