Animal 10 days box office collections: స్పీడు తగ్గని యానిమల్.. పది రోజుల కలెక్షన్లు ఎన్నంటే?
Animal 10 days box office collections: యానిమల్ మూవీ స్పీడు తగ్గడం లేదు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కొనసాగిస్తూనే ఉంది. ఆ సినిమా 10 రోజుల్లోనే ఇండియాలో రూ.400 కోట్ల మార్క్ అందుకుంది.
Animal 10 days box office collections: యానిమల్ మూవీపై ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఆదరిస్తుండటం విశేషం. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కలిసి నటించిన ఈ సినిమా పది రోజుల్లోనే ఇండియాలో రూ.430 కోట్లు వసూలు చేసింది. ఆదివారం (డిసెంబర్ 10) పదో రోజు కూడా రూ.35.02 కోట్లు రాబట్టింది.
యానిమల్ మూవీలో హింస మరీ ఎక్కువగా ఉండటం, మహిళల పట్ల వివక్ష నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు విమర్శలు గుప్పించారు. అదే సమయంలో రాంగోపాల్ వర్మ, అల్లు అర్జున్ లాంటి ప్రముఖులు ఈ సినిమాను ఆకాశానికెత్తారు. ఈ మిశ్రమ స్పందన ఆ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపడం లేదు.
పది రోజులైనా యానిమల్ దూసుకెళ్తూనే ఉంది. 9వ రోజు రూ.32.47 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. పదో రోజు రూ.35.02 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ కలెక్షన్లను వెల్లడించే Sacnilk.com ప్రకారం.. యానిమల్ మూవీ ఇండియాలో తొలి వారంలో రూ.337.58 కోట్లు వసూలు చేసింది. ఇక 8వ రోజు 22.95 కోట్లు, 9వ రోజు రూ.32.45 కోట్లు, 10వ రోజు రూ.35.02 కోట్లు వచ్చాయి.
దీంతో మొత్తంగా ఇండియాలో యానిమల్ వసూళ్లు రూ.430.29 కోట్లకు చేరాయి. ఇందులో చాలా వరకూ కలెక్షన్లు హిందీలోనే రాగా.. తెలుగులోనూ లాభాల్లోనే ఉంది. తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనే ఈ సినిమాను అసలు ఆదరించలేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యానిమల్ 10 రోజుల్లో రూ.660 కోట్లు వసూలు చేసింది.
రణ్‌బీర్ కపూర్ కెరీర్లో ఇదే అత్యధికం కావడం విశేషం. టీ-సిరీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. రణ్‌బీర్ కపూర్ తోపాటు రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్ ఈ మూవీలో నటించారు. టీ-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి.
టాపిక్