Triptii Dimri on Animal Nude Scene: ఆ రేప్ సీన్‌తో పోలిస్తే యానిమల్ న్యూడ్ సీన్ ఎంత?: తృప్తి దిమ్రి షాకింగ్ కామెంట్స్-triptii dimri on animal nude scene says it was nothing compared to rape in bulbbul ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Triptii Dimri On Animal Nude Scene: ఆ రేప్ సీన్‌తో పోలిస్తే యానిమల్ న్యూడ్ సీన్ ఎంత?: తృప్తి దిమ్రి షాకింగ్ కామెంట్స్

Triptii Dimri on Animal Nude Scene: ఆ రేప్ సీన్‌తో పోలిస్తే యానిమల్ న్యూడ్ సీన్ ఎంత?: తృప్తి దిమ్రి షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Dec 07, 2023 10:22 PM IST

Triptii Dimri on Animal Nude Scene: యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ తో న్యూడ్, సెక్స్ సీన్లపై తృప్తి దిమ్రి స్పందించింది. బుల్‌బుల్ మూవీలో తాను నటించిన రేప్ సీన్ తో పోలిస్తే ఇదేం పనికి రాదని అనడం విశేషం.

యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ తో తృప్తి దిమ్రి
యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ తో తృప్తి దిమ్రి

Triptii Dimri on Animal Nude Scene: యానిమల్ మూవీతో మరో నేషనల్ క్రష్ గా మారిపోయిన నటి తృప్తి దిమ్రి.. తాను ఈ సినిమాలో నటించిన కొన్ని ఇంటిమేట్ సీన్లపై స్పందించింది. ఈ సినిమాలో కొన్ని సీన్లలో ఆమె రెచ్చిపోయి నటించింది. రణ్‌బీర్ కపూర్ తో ఓ సీన్లో బెడ్ పై సెమీ న్యూడ్ సీన్లో నటించి షాక్ కు గురి చేసింది.

ఈ సీన్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో తృప్తి స్పందించింది. నిజానికి నెట్‌ఫ్లిక్స్ మూవీ బుల్‌బుల్ లో తాను చేసిన రేప్ సీన్ తో పోలిస్తే ఇదేమీ లేదని ఆమె అనడం విశేషం. ఆ రేప్ సీన్ కోసం తాను సిద్ధం కావడం మరింత సవాలుగా అనిపించిందని ఆమె చెప్పింది. యానిమల్ మూవీలో ఆ బోల్డ్ సీన్ చేసే రోజు షూటింగ్ ఎలా సాగిందో కూడా చెప్పుకొచ్చింది.

ఆ రోజు రణ్‌బీర్, తాను, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, సినిమాటోగ్రాఫర్ మాత్రమే సెట్లో ఉన్నట్లు చెప్పింది. "ప్రతి ఐదు నిమిషాలకు ఓసారి వాళ్లు బాగానే ఉన్నావా అని అడిగారు. ఏమైనా కావాలా అని అడిగారు. దీంతో నేను ఏమాత్రం అసౌకర్యంగా ఫీలవ్వలేదు" అని తెలిపింది. రణ్‌బీర్ తో కలిసి నటించాలంటే తాను ఎందుకో బాగా ఆందోళనకు గురైనట్లు వెల్లడించింది.

ఇక రణ్‌బీర్ తో ఓ సీన్లో అతని షూస్ నాకే సీన్ పై వచ్చిన విమర్శలపైనా ఆమె స్పందించింది. "అది నా యాక్టింగ్ కోచ్ నాకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. మన పాత్రను జడ్జ్ చేయకూడదు అన్నది గోల్డెన్ రూల్. మనం పోషించే పాత్రలు, మన కోస్టార్స్ పోషించే పాత్రలు కూడా మనుషులే. మనుషుల్లో మంచి చెడు రెండూ ఉంటాయి. అన్ని పాత్రలు పోషించడానికి ఓ నటి లేదా నటుడు సిద్ధంగా ఉండాలి. అందుకే అదే మనసులో పెట్టుకున్నాను" అని తృప్తి చెప్పింది.

యానిమల్ మూవీలో బోల్డ్ సీన్స్ తోపాటు హింస కూడా మితిమీరడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం దూసుకెళ్తూనే ఉంది. ఇండియాలో రూ.300 కోట్లకుపైగా, ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా వసూలు చేసింది.

Whats_app_banner