Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో నెట్‌ఫ్లిక్స్ సీఈవో.. చిరంజీవినీ కలిసి..-ram charan and chiranjeevi met netflix ceo ted sarandos ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Charan And Chiranjeevi Met Netflix Ceo Ted Sarandos

Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో నెట్‌ఫ్లిక్స్ సీఈవో.. చిరంజీవినీ కలిసి..

Hari Prasad S HT Telugu
Dec 07, 2023 08:58 PM IST

Ram Charan: రామ్ చరణ్, చిరంజీవిని వాళ్ల ఇంట్లో కలిసి మాట్లాడారు నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్. వీళ్లు కలిసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లను కలిసి నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్
చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లను కలిసి నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం (డిసెంబర్ 7) సాయంత్రం హైదరాబాద్ వచ్చిన ఆయన నేరుగా రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ అతనితోపాటు చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ లతో మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు

వాళ్లతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. సెల్ఫీలు కూడా దిగారు. రామ్ చరణ్, చిరంజీవిలతో నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన టీమ్ తో కలిసి హైదరాబాద్ వచ్చిన ఆయన.. చరణ్ ఇంట్లో ఇలా సందడి చేయడం విశేషం. ఈ ఫొటోలను ఎంతో మంది అభిమానులు తమ ఎక్స్ అకౌంట్లలో షేర్ చేస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ సీఈవో మామూలుగానే వాళ్లను కలిశారా లేక ఈ ఇద్దరితోనూ ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారా అన్నది తెలియలేదు. నిజానికి గతంలో చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీని ఆకాశానికెత్తుతూ సరండోస్ ట్వీట్ చేశారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోనూ సంచనలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో 2022లో వచ్చిన బెస్ట్, మోస్ట్ రెవల్యుషనరీ సినిమా ఆర్ఆర్ఆర్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఇప్పుడు హైదరాబాద్ రాగానే నేరుగా రామ్ చరణ్ ను కలవడం విశేషం. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు రామ్ చరణ్. పైగా ఆ సినిమా ప్రమోషన్ల కోసం అమెరికాలో పర్యటించినప్పుడు కూడా ఎందరో ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్లు, నటీనటులను కలిశాడు. ఇప్పుడు ఏకంగా నెట్‌ఫ్లిక్స్ సీఈవోనే చరణ్ ఇంటికి రావడాన్ని అతని అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య మూవీలో గెస్ట్ రోల్లో కనిపించినా.. మరో పూర్తి స్థాయి సినిమా అతడు చేయలేదు. దీంతో శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు చిరంజీవి తన నెక్ట్స్ మూవీని డైరెక్టర్ వశిష్టతో చేస్తున్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.