తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nadikar Ott Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ కామెడీ డ్రామా మూవీ.. డేట్ ఇదే!

Nadikar OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ కామెడీ డ్రామా మూవీ.. డేట్ ఇదే!

09 June 2024, 23:45 IST

google News
    • Nadikar OTT Release Date: నడికర్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైనట్టు సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే.
Nadikar OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ కామెడీ డ్రామా మూవీ.. డేట్ ఇదే!
Nadikar OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ కామెడీ డ్రామా మూవీ.. డేట్ ఇదే!

Nadikar OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ కామెడీ డ్రామా మూవీ.. డేట్ ఇదే!

Nadikar OTT: మలయాళ యంగ్ స్టార్ హీరో టొవినో థామస్ ప్రధాన పాత్ర పోషించిన నడికర్ చిత్రం మే 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్‌తో ఈ చిత్రానికి బాగానే బజ్ వచ్చింది. మంచి అంచనాలతో థియేటర్లలోకి అడుగుపెట్టింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు లాల్ జూనియర్. అయితే, నడికర్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

నడికర్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్‌లో జూన్ 27వ తేదీన స్ట్రీమింగ్‍కు రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

నడికర్ మూవీలో టొవినో థామస్‍తో పాటు భావన, సౌబిన్ షాహిర్, బాలు వర్గీస్ ప్రధాన పాత్రలు చేశారు. సురేశ్ కృష్ణ, అనూప్ మీనన్, లాల్, ధ్యాన్ శ్రీనివాసన్, గణపతి కీరోల్స్ చేశారు. సినీ కెరీర్లో చిక్కుల్లో పడిన హీరో చుట్టూ తిరిగే స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు లాల్ జూనియర్.

నడికర్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, గాడ్‍స్పీడ్ సినిమా బ్యానర్లపై నవీన్ యెర్నెనీ, రవి శంకర్, అలాన్ ఆంటోనీ, అనూప్ వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. గ్యారీ పెరీరా, నేహా నాయర్ సంగీతం అందించారు.

నడికర్ స్టోరీలైన్

సినీ సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ (టొవినో థామస్) చుట్టూ నడికర్ మూవీ స్టోరీ సాగుతుంది. డేవిడ్‍కు వరుసగా మూడు భారీ ప్లాఫ్‍లు ఎదురవుతాయి. దీంతో అవకాశాలు తగ్గిపోతాయి. అయితే, అతడి మేనేజర్ పైలీ (సురేశ్ కృష్ణ) ఎలాగో కష్టపడి డేవిడ్‍తో మూవీ చేసేందుకు ఓ దర్శకుడిని ఒప్పిస్తాడు. అయితే, డేవిడ్ తన పొగరుతో ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పుకుంటాడు. అయితే, తనలో యాక్టింగ్ టాలెంట్ తగ్గిపోయిందని గుర్తిస్తాడు. దీంతో యాక్టింగ్ కోచ్ బాలు (సౌబిన్ షాహిర్)ను నియమించుకుంటాడు. ఆ తర్వాత డేవిడ్, బాలు మధ్య కూడా ఈగో సమస్యలు వస్తాయి. అయితే, డేవిడ్ మళ్లీ స్టార్ డమ్ తెచ్చుకునేలా బాలు సాయం చేశాడా.. డేవిడ్ యాక్టింగ్ కెరీర్ ఏమైంది అనేదే నడికర్ చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

ఇటీవలే ‘వర్షంగల్కు శేషం’

మలయాళ ఫీల్ గుడ్ కామెడీ మూవీ ‘వర్షంగల్కు శేషం’ ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూన్ 7వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. సూపర్ స్టార్ మోహన్‍లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‍లాల్ హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ సోనీ లివ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీకి వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఏప్రిల్ 11న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. వర్షంగల్కు శేషం చిత్రంలో ప్రణవ్‍ సహా ధ్యాన్ శ్రీనివాసన్, కల్యాణి ప్రియదర్శి, నివిన్ పౌలీ ప్రధాన పాత్రలు చేశారు.

తదుపరి వ్యాసం