OTT Malayalam Movies: ఈనెల ఓటీటీల్లోకి రానున్న ఐదు ఇంట్రెస్టింగ్ మలయాళ సినిమాలు ఇవే
OTT Malayalam Movies to release in June: ఓటీటీల్లో ఈనెలలో మరిన్ని మలయాళం సినిమాలు రానున్నాయి. ఇంట్రెస్టింగ్ చిత్రాలు స్ట్రీమింగ్‍కు వస్తున్నాయి. అవేవో ఇక్కడ చూడండి.
OTT Malayalam Movies: ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో మలయాళం సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. కొత్త మలయాళీ చిత్రాలు ఓటీటీల్లోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో ఈనెల (జూన్) కూడా కొన్ని కొత్త మలయాళం సినిమాలో ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి. చాలా రోజు నుంచి వేచిచూస్తున్న ఆడుజీవితంతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు రానున్నాయి. ఈ జూన్ నెలలో ఓటీటీల్లోకి వచ్చే ముఖ్యమైన మలయాళం సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
ఆడుజీవితం
పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఆడుజీవితం’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు చాలా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మార్చి 28వ తేదీన రిలీజైన ఈ సర్వైవల్ డ్రామా మూవీ ఇంకా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రాలేదు. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ+హాట్‍స్టార్ ఓటీటీ వద్ద ఉన్నాయి. ఈ జూన్‍లోనే ఆడుజీవితం సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‍ను హాట్‍స్టార్ ఓటీటీ ప్రకటించనుంది.
వర్షంగల్కు శేషం
మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘వర్షంగల్కు శేషం’ సినిమా జూన్ 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‍లాల్, ధ్యాన్ శ్రీనివాసన్, కల్యాణి ప్రియదర్శి వర్షంగల్కు శేషం చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.80కోట్లకు పైగా కలెక్షన్లు దక్కించుకుంది. వినీత్ శ్రీనివాసన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చు.
నడికర్
కామెడీ డ్రామా మూవీ ‘నడికర్’కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ కామెడీ డ్రామాలో టొవినో థామన్ హీరోగా నటించారు. లాల్ జూనియర్ దర్శకత్వం వహించారు. దివ్య పిళ్లై, భావన, సౌబిన్ షాహిర్, బాలు వర్గీస్ కీలకపాత్రలు చేశారు. మే 3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కాకపోయినా.. డిఫరెంట్‍గా ఉందంటూ టాక్ తెచ్చుకుంది. నడికర్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు తీసుకుందని తెలుస్తోంది. జూన్‍లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది.
మలయాళీ ఫ్రమ్ ఇండియా
మలయాళీ ఫ్రమ్ ఇండియా సినిమాకు చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. మే 1న రిలీజైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. డిజో జాస్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ పొటికల్ సెటైర్ మూవీలో నవీన్ పౌలీ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ తీసుకుందని సమాచారం బయటికి వచ్చింది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఈనెలలో మలయాళీ ఫ్రమ్ ఇండియా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది.
గురువాయూర్ అంబలనడయిల్
గురువాయిర్ అంబలనడయిల్ మూవీకి థియేటర్లలో సూపర్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. విపిన్ దాస్ దర్శకత్వం వహించారు. గురువాయిర్ అంబలనడయిల్ చిత్రం మే 16వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా జూన్‍లోనే స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఓటీటీ పార్ట్‌నర్ వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.