తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Sethupathi: రామ్‍చరణ్ సినిమాను విజయ్ సేతుపతి రిజెక్ట్ చేసింది ఇందుకేనా?

Vijay Sethupathi: రామ్‍చరణ్ సినిమాను విజయ్ సేతుపతి రిజెక్ట్ చేసింది ఇందుకేనా?

27 August 2024, 17:18 IST

google News
    • Vijay Sethupathi - RC16: రామ్‍చరణ్ సినిమాలో ఓ కీలకపాత్రను విజయ్ సేతుపతి తిరస్కరించారనే సమాచారం ఇటీవల బయటికి వచ్చింది. అయితే, ఆయన ఎందుకు ఆ చిత్రం చేయనన్నారో కారణం తాజాగా వెల్లడైంది.
Vijay Sethupathi: రామ్‍చరణ్ సినిమాను విజయ్ సేతుపతి రిజెక్ట్ చేసింది ఇందుకేనా?
Vijay Sethupathi: రామ్‍చరణ్ సినిమాను విజయ్ సేతుపతి రిజెక్ట్ చేసింది ఇందుకేనా?

Vijay Sethupathi: రామ్‍చరణ్ సినిమాను విజయ్ సేతుపతి రిజెక్ట్ చేసింది ఇందుకేనా?

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కావాల్సి ఉంది. తదుపరి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానతో ఆయన ఓ మూవీ (RC16) చేయనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించనున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఈ సినిమాలో కీలకపాత్రను తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తిరస్కరించాని తెలిసింది. గతంలో బుచ్చిబాబుతో ఉప్పెన చేసిన చేసిన సేతుపతి.. ఈ మూవీలో నటించేందుకు నో చెప్పారని సమాచారం బయటికి వచ్చింది.

కారణం ఇదేనా!

బుచ్చిబాబు దర్శకత్వంలో విజయ్ సేతుపతి ఉప్పెన చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించారు. ఇటీవల బ్లాక్‍బ్టస్టర్ చిత్రం మహారాజలోనూ ఆయన ఫాదర్ రోల్ చేశారు. ఆర్‌సీ16లోనూ రామ్‍చరణ్ తండ్రి పాత్ర కోసం విజయ్ సేతుపతిని బుచ్చిబాబు అడిగారు. అయితే, ఒకేరకంగా తండ్రి పాత్రలు చేస్తూ సాగడం విజయ్ సేతుపతికి నచ్చలేదని సమాచారం బయటికి వచ్చింది. మళ్లీ తండ్రి క్యారెక్టర్ పోషించే ఇష్టం లేక రామ్‍చరణ్ మూవీకి నో చెప్పారని సమాచారం చక్కర్లు కొడుతోంది.

మహారాజ తెలుగు వెర్షన్ ప్రమోషన్ల సమయంలో రామ్‍చరణ్ - బుచ్చిబాబు సినిమా గురించి కొన్నిసార్లు ప్రస్తావించారు విజయ్ సేతుపతి. ప్రమోషన్ ఈవెంట్లలో బుచ్చిబాబు కూడా పాల్గొన్నారు. రామ్‍చరణ్‍తో చేయబోయే మూవీ స్టోరీని బుచ్చిబాబు తనకు నరేట్ చేశారని, కథ అద్భుతంగా ఉందని, ఈ చిత్రం తప్పకుండా భారీ బ్లాక్‍బస్టర్ అవుతుందని సేతుపతి అన్నారు.

మహారాజతో సూపర్ హిట్

విజయ్ సేతుపతి ఈ ఏడాది మహారాజ సినిమాతో భారీ బ్లాక్‍బస్టర్ సాధించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను దక్కించుకుంది. తెలుగు వెర్షన్ కోసం జోరుగా ప్రమోషన్లను చేశారు సేతుపతి. ఈ చిత్రం సుమారు రూ.107కోట్ల కలెక్షన్లు దక్కించుకొని సూపర్ హిట్‍గా నిలిచింది. నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన మహారాజా చిత్రం జూన్ 14న థియేటర్లలో రిలీజైంది. ప్రశంసలతో పాటు కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది. విజయ్ సేతుపతి మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇది ఆయనకు 50 మూవీ కావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.

మహారాజా సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ సూపర్ సక్సెస్ అయింది. భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. జూలై 12న స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ చిత్రం ఇంకా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో టాప్-5లో ట్రెండ్ అవుతోంది.

విజయ్ సేతుపతి ఇప్పటి వరకు మూడు స్ట్రైట్ తెలుగు చిత్రాల్లో నటించారు. అయితే, తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ చాలా ఫేమస్ అయ్యారు. మహారాజా చిత్రంతో తెలుగులో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. మళ్లీ ఆయన స్ట్రైట్ తెలుగు చిత్రం ఎప్పుడు చేస్తారో చూడాలి.

విజయ్ సేతుపతి ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై పార్ట్ 2 మూవీలో నటిస్తున్నారు. ఈ సీక్వెల్ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన సేతుపతి ఫస్ట్ లుక్ ఇంటెన్స్‌గా మెప్పించింది. ఈ చిత్రం సూరి కూడా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారు కావాల్సి ఉంది. గాంధీటాక్స్ అనే ఓ సైలెంట్ చిత్రంలోనూ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర చేశారు. ఈ మూవీ కూడా విడుదల కావాల్సి ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం