Vidudala Part 2 First Look: విడుదల సీక్వెల్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఇంటెన్స్ లుక్‌లో విజయ్ సేతుపతి-vidudala part 2 first look vijay sethupathi in intense look in vetrimaarans vidudala sequel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vidudala Part 2 First Look: విడుదల సీక్వెల్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఇంటెన్స్ లుక్‌లో విజయ్ సేతుపతి

Vidudala Part 2 First Look: విడుదల సీక్వెల్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఇంటెన్స్ లుక్‌లో విజయ్ సేతుపతి

Hari Prasad S HT Telugu

Vidudala Part 2 First Look: విడుదల సీక్వెల్ ఫస్ట్ లుక్ బుధవారం (జులై 17) రిలీజ్ చేశారు. గతేడాది వచ్చిన విడుదల మూవీకి సీక్వెల్ గా ఈ విడుదల పార్ట్ 2 రాబోతున్న విషయం తెలిసిందే.

విడుదల సీక్వెల్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఇంటెన్స్ లుక్‌లో విజయ్ సేతుపతి

Vidudala Part 2 First Look: తమిళ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడుదల మూవీ గతేడాది ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఇప్పుడీ మూవీ సీక్వెల్ విడుదల పార్ట్ 2 రాబోతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను బుధవారం (జులై 17) మేకర్స్ రిలీజ్ చేశారు. తమిళంలోనే కాదు తెలుగులోనూ ఈ విడుదల హిట్ కావడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

విడుదల పార్ట్ 2 ఫస్ట్ లుక్

వెట్రిమారన్ డైరెక్షన్ లో గతేడాది విడుదల మూవీ రిలీజైంది. సూరి లీడ్ రోల్లో పరిచయం అయిన సినిమా ఇది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. తొలి భాగంగా అతని పాత్ర పెద్దగా కనిపించలేదు. అయితే తాజాగా రిలీజ్ చేసిన సెకండ్ పార్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించడం విశేషం.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. “విడుదల పార్ట్ 2తో ఓ కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. విజనరీ వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన మూవీ. ఫస్ట్ లుక్ వచ్చేసింది” అనే క్యాప్షన్ తో విజయ్ ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు.

తిరుక్కురల్ వాక్యాలతో..

దీంతోపాటు విజయ్, మంజు వారియర్ లతో కూడిన మరో పోస్టర్ ను కూడా మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ యాక్షన్ డ్రామా సెకండ్ పార్ట్ మరింత అలరించబోతున్నట్లు ఈ పోస్టర్ల ద్వారా స్పష్టమవుతోంది. అంతేకాదు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై తమిళ పాపులర్ బుక్ తిరుక్కురల్ లోని వాక్యాలు కూడా ఉండటం విశేషం.

"తమ శత్రువుల అహంకారాన్ని మచ్చిక చేసుకోలేని వారు.. ఎప్పుడూ సంతృప్తికరంగా జీవించలేరు" అని అర్థం వచ్చే వాక్యాలను టైటిల్ పై ఉంచారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. విడుదల పార్ట్ 2 షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు కూడా మేకర్స్ వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఈ విడుదల పార్ట్ 1 ఇప్పటికే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ ఈ సినిమా చూసి ఉండకపోతే.. రెండో పార్ట్ వచ్చే ముందే చూసేయండి. నక్సలిజం బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ థ్రిల్లర్ మూవీ కచ్చితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ అందించాడు. విజయ్ సేతుపతి, సూరితోపాటు గౌతమ్ మేనన్, కిశోర్, రాజీవ్ మేనన్ లాంటి వాళ్లు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు.