Vidudala Part 1 OTT Release Date: విడుదల పార్ట్ 1 ఓటీటీలోకి వచ్చేసింది-vidudala part 1 finally makes its ott debut ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vidudala Part 1 Ott Release Date: విడుదల పార్ట్ 1 ఓటీటీలోకి వచ్చేసింది

Vidudala Part 1 OTT Release Date: విడుదల పార్ట్ 1 ఓటీటీలోకి వచ్చేసింది

Hari Prasad S HT Telugu
May 23, 2023 08:57 PM IST

Vidudala Part 1 OTT Release Date: విడుదల పార్ట్ 1 ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే తమిళ వెర్షన్ ఓటీటీలో అభిమానులను అలరిస్తుండగా.. తాజాగా తెలుగు అభిమానులకు జీ5 గుడ్ న్యూస్ అందించింది.

విడుదల మూవీ
విడుదల మూవీ

Vidudala Part 1 OTT Release Date: తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ విడుదలై పార్ట్ 1. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ ఆ తర్వాత విడుదల పార్ట్ 1గా రిలీజైంది. తెలుగులోనూ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది.

తమిళ వెర్షన్ ఇప్పటికే జీ5 (zee5)లో చాలా రోజుల కిందటే వచ్చింది. తాజాగా తెలుగు వెర్షన్ అయిన విడుదల కూడా తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో అందుబాటులోకి వచ్చినట్లు జీ5 అనౌన్స్ చేసింది. ఈ విషయాన్ని జీ5 సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే తెలుగు వెర్షన్ లో మాత్రం డైరెక్టర్స్ కట్ అందుబాటులో లేకపోవడం కాస్త నిరాశ కలిగించేదే.

డైరెక్టర్స్ కట్ అంటే సాధారణ వెర్షన్ కు భిన్నంగా డైరెక్టర్ సూచనలకు అనుగుణంగా కొన్ని సీన్లను కట్ చేసి తీసుకొచ్చే వెర్షన్. తమిళంలో ఈ మూవీ డైరెక్టర్స్ కట్ అందుబాటులో ఉన్నా.. తెలుగులో మాత్రం తీసుకురాలేదు. ఈ విడుదల పార్ట్ 1లో భవానీ శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మేనన్, రాజీవ్ మేనన్, చేతన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఇళయరాజా మ్యూజిక్ అందించాడు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం