తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Trending Movie: గ్లోబల్‍ రేంజ్‍‍లో ట్రెండ్ అవుతున్న విజయ్ యాక్షన్ సినిమా.. 14 దేశాల్లో..

OTT Trending Movie: గ్లోబల్‍ రేంజ్‍‍లో ట్రెండ్ అవుతున్న విజయ్ యాక్షన్ సినిమా.. 14 దేశాల్లో..

12 October 2024, 6:00 IST

google News
    • OTT Trending Movie: దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‍టైమ్’ థియేటర్లలో మోస్తరుగానే ఆడినా.. ఓటీటీలో దూసుకెళుతోంది. ప్రస్తుతం గ్లోబల్ రేంజ్‍లో టాప్-5లో ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..
OTT Trending Movie: గ్లోబల్‍ రేంజ్‍‍లో ట్రెండ్ అవుతున్న విజయ్ యాక్షన్ సినిమా.. 14 దేశాల్లో..
OTT Trending Movie: గ్లోబల్‍ రేంజ్‍‍లో ట్రెండ్ అవుతున్న విజయ్ యాక్షన్ సినిమా.. 14 దేశాల్లో..

OTT Trending Movie: గ్లోబల్‍ రేంజ్‍‍లో ట్రెండ్ అవుతున్న విజయ్ యాక్షన్ సినిమా.. 14 దేశాల్లో..

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‍టైమ్ (ది గోట్) చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీకి అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు ది గోట్ మూవీకి విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. అయితే, థియేటర్లలో రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ రావడంతో అంచనాలకు తగినట్టు కలెక్షన్లు కురవలేదు.

ది గోట్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో గత వారమే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి అదిరిపోయే వ్యూస్ దక్కుతున్నాయి. ఇండియాలోనే కాకుండా కొన్ని విదేశాల్లోనూ ఈ చిత్రం టాప్-10లో ట్రెండ్ అవుతోంది.

గ్లోబల్‍గా 4వ ప్లేస్‍లో..

ది గోట్ సినిమా గ్లోబల్ రేంజ్‍లో నాలుగో ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. నెట్‍ఫ్లిక్స్ నాన్ ఇంగ్లిష్ సినిమాల కేటగిరీలో గోట్ ప్రస్తుతం టాప్-5లో ట్రెండ్ అవుతూ సత్తాచాటుతోంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ తాజాగా వెల్లడించింది.

14 దేశాల్లో టాప్-10

ది గోట్ సినిమా ఇండియాలోనే కాకుండా మలేషియా, మాల్దీవ్స్, ఖతార్, సింగపూర్ సహా మొత్తంగా 14 దేశాల్లో నెట్‍ఫ్లిక్స్ టాప్-10లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. శ్రీలంకలో టాప్ ప్లేస్‍లో నిలిచింది. ఇండియాలో ప్రస్తుతం ఈ మూవీ రెండో ప్లేస్‍లో ఉంది.

ది గోట్ చిత్రం అక్టోబర్ 3వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో సెప్టెంబర్ 2న ఈ మూవీ రిలీజైంది. సుమారు నెల రోజులకే ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

ది గోట్ కలెక్షన్లు

ది గోట్ చిత్రం సుమారు రూ.400కోట్ల భారీ బడ్జెట్‍తో రూపొందింది. ఈ చిత్రానికి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.450కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. అనుకున్న రేంజ్‍లో ఈ చిత్రం వసూళ్లను రాబట్టుకోలేకపోయింది. మొదటి నుంచి మిక్స్డ్ టాక్ రావడం బాగా ప్రభావం చూపింది.

ది గోట్ మూవీకి డైరెక్టర్ వెంకట్ ప్రభు రాసుకున్న కథ బాగానే అనిపించినా నరేషన్ విషయంలో నిరాశపరిచారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్రంలో దళపతి విజయ్‍కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా చేసినా ఈ మూవీలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ప్రశాంత్, స్నేహ, ప్రభుదేవా, జయరాం ఈ మూవీలో కీరోల్స్ చేశారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై కల్పాతి గణేశ్, సురేశ్, అగోరం ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు.

విజయ్ నెక్స్ట్ సినిమా

దళవతి విజయ్ తదుపరి హెచ్.వినోత్ దర్శకత్వంలో ఓ మూవీ (దళపతి 69) చేయనున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజూ, బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రియమణి కీలకపాత్రలు పోషించనున్నారు. రాజకీయ పార్టీ స్థాపించిన విజయ్‍కు ఇదే చివరి చిత్రంగా ఉంటుందని సమాచారం. దీంతో ఈ సినిమాకు క్రేజ్ మరింత విపరీతంగా ఉండనుంది. 2025 అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే వెల్లడించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం